తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cm Jagan Delhi Tour: హోదాతో పాటు పోలవరం నిధులు ఇవ్వండి... కేంద్ర ఆర్థికమంత్రితో సీఎం జగన్

CM Jagan Delhi Tour: హోదాతో పాటు పోలవరం నిధులు ఇవ్వండి... కేంద్ర ఆర్థికమంత్రితో సీఎం జగన్

HT Telugu Desk HT Telugu

30 March 2023, 15:10 IST

  • CM Jagan Delhi Tour Updates: ఏపీ సీఎం జగన్‌ హస్తిన పర్యటన ముగిసింది. రెండు రోజుల పర్యటనలో ఇవాళ కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమయ్యారు. సుమారు అరగంటపాటు సాగిన సమావేశంలో పలు అంశాలను కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

కేంద్ర ఆర్థికమంత్రితో సీఎం జగన్
కేంద్ర ఆర్థికమంత్రితో సీఎం జగన్

కేంద్ర ఆర్థికమంత్రితో సీఎం జగన్

CM Jagan Meets Union Minister Nirmala Sitharaman: ఢిల్లీ పర్యటనలో భాగంగా ఇవాళ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ తో సీఎం జగన్ భేటీ అయ్యారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత తిరిగి విజయవాడకు బయల్దేరారు. అయితే కేంద్రమంత్రితో సాగిన సమావేశంలో... రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలను ప్రస్తావించారు.

ట్రెండింగ్ వార్తలు

Arakku Simhachalam Tour : అరకు, సింహాచలం ట్రిప్ - సబ్‌మెరైన్ మ్యూజియం కూడా చూడొచ్చు, టూర్ ప్యాకేజీ వివరాలివే

AP ITI Admissions 2024 : ఏపీలో ఐటీఐ ప్రవేశాలు - దరఖాస్తులకు చివరి తేదీ ఎప్పుడంటే..?

AP TS Local Issue: ఈ ఏడాది వరకు తెలంగాణ విద్యాసంస్థల్లో నాన్ లోకల్ కోటా కొనసాగించాలని ఏపీ సర్కారు విజ్ఞప్తి

AP DBT Transfer: సంక్షేమ పథకాలకు నిధుల విడుదల ప్రారంభం, లబ్దిదారుల ఖాతాల్లో నగదు

సీఎం జగన్ చర్చించిన అంశాలు.

ఉపాధి హామీ పనులకు సంబంధించి రాష్ట్రానికి ఇవ్వాల్సిన బకాయిలు సుమారు రూ.2,500 కోట్లు ఉన్నాయని, వెంటనే ఈ డబ్బు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి జగన్ కోరారు.

రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వం తప్పులేకున్నా... రుణాలపై కేంద్రం ఆంక్షలు విధించడం సరికాదని వివరించారు. నిబంధనలు ప్రకారం ఇచ్చిన రుణ పరిమితిని కూడా తగ్గించారని, 2021-22లో రూ.42,472 కోట్ల రుణపరిమితి కల్పించి, తదుపరి కాలంలో రూ.17,923 కోట్లుకు కుదించిన విషయాన్ని ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

తెలంగాణ డిస్కంల నుంచి ఏపీ జెన్‌కోకు, 2014 జూన్ నుంచి 2017 జూన్ వరకూ సరఫరాచేసిన విద్యుత్తుకు సంబంధించి రూ.7,058 కోట్లు రావాల్సి ఉందని, ఈ డబ్బును వెంటనే ఇప్పించాల్సిందిగా కోరిన సీఎం.

2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్రానికి రిసోర్స్‌ గ్యాప్‌ ఫండింగ్‌ కింద రూ.36,625 కోట్ల రూపాయలు పెండింగులో ఉన్నాయని, వాటిని విడుదల చేసేలా చూడండి.

పోలవరం ప్రాజెక్టును వేగవంతంగా ముందుకు తీసుకెళ్లడానికి అడహాక్ గా రూ.10 వేల కోట్లు మంజూరు చేయాలని కోరారు.

డయాఫ్రంవాల్ ప్రాంతంలో చేయాల్సిన మరమ్మతులకు దాదాపు రూ.2020 కోట్లు ఖర్చు చేయాల్సి ఉందని, వెంటనే ఈ నిధులు విడుదల చేయండి.

పోలవరం ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా ఖర్చు చేసిన రూ.2600.74 కోట్ల రూపాయలను సత్వరమే రీయింబర్స్ చేయాలన్నారు.

పోలవరం ప్రాజెక్టు అంచనాలను టెక్నికల్ అడ్వయిజరీ కమిటీ రూ. 55,548 కోట్లుగా నిర్థారించింది. దీనికి వెంటనే ఆమోదం తెలపాలని కోరారు. దీంతోపాటు ప్రాజెక్టుకు సంబంధించి ఇతరత్రా అంశాలను కూడా చర్చించారు.

రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామంటూ పార్లమెంటు సాక్షిగా కేంద్రం హామీ ఇచ్చిందని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

బుధవారం కేంద్రహోంమంత్రి అమిత్‌షాతో భేటీ అయిన సీఎం జగన్… రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను చర్చించారు. ఇక ఇవాళ ఆర్థికమంత్రితో భేటీతో ఢిల్లీ పర్యటన ముగిసింది. అనంతరం విజయవాడకు బయల్దేరారు.

తదుపరి వ్యాసం