తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cm Chandrababu : ఈ నెల 8 నుంచి ఉచిత ఇసుక విధానం అమల్లోకి, సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

CM Chandrababu : ఈ నెల 8 నుంచి ఉచిత ఇసుక విధానం అమల్లోకి, సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

03 July 2024, 14:54 IST

google News
    • CM Chandrababu : నకిలీ విత్తనాలు, నాసిరకం విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఖరీఫ్ లో 4 లక్షల భూసార పరీక్షలు చేయాలని సూచించారు. అలాగే ఉచిత ఇసుక విధానం ఈ నెల 8 నుంచి అందుబాటులోకి తీసుకోవాలని ఆదేశించారు.
ఈ నెల 8 నుంచి ఉచిత ఇసుక విధానం అమల్లోకి, సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం
ఈ నెల 8 నుంచి ఉచిత ఇసుక విధానం అమల్లోకి, సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

ఈ నెల 8 నుంచి ఉచిత ఇసుక విధానం అమల్లోకి, సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

CM Chandrababu : నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అనుమతి లేని విత్తనాలు విక్రయిస్తే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఖరీఫ్ సీజన్ కార్యాచరణపై సీఎం చంద్రబాబు బుధవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 46.45 లక్షల హెక్టార్లలో ఖరీఫ్ సాగు చేస్తున్నారని అధికారులు సీఎంకు తెలిపారు. పంటల సాగులో ఇబ్బందులు తలెత్తకుండా విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలని అధికాలను ఆదేశించారు. నకిలీ విత్తనాలు చెక్ పెట్టి, నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సహకార సంఘాలతో ఎరువుల పంపిణీకి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అలాగే బిందుసేద్యం, ప్రకృతి వ్యవసాయ పద్దతులు ప్రోత్సహించి సాగు విస్తీర్ణం పెంచాలని సీఎం చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. పంటల సాగులో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఖరీఫ్ లో 4 లక్షల భూసార పరీక్షలు చేయాలని సూచించారు.

అమరావతిపై శ్వేతపత్రం

సీఎం చంద్రబాబు ఇవాళ అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు అమరావతి రాజధానిపై శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. అమరావతి మొదటి దశ పనులను గత టీడీపీ ప్రభుత్వంలో దాదాపుగా పూర్తయ్యాయి. వైసీపీ అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల అంశం తెరపైకి తెచ్చింది. దీంతో అమరావతిలో రాజధాని పనులు నిలిచిపోయాయి. అమరావతిలో అవినీతి జరిగిందని, ఇన్ సైడర్ ట్రేడింగ్, ఇన్నర్ రింగ్ అవకతవకలు జరిగాయని టీడీపీ నేతలు కేసులు పెట్టారు. రాజధానికి ఆ ప్రాంత రైతులు సుదీర్ఘ పోరాటం చేశారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులపై గత ప్రభుత్వం కేసులు సైతం నమోదు చేసింది. అమరావతిపై రాజధాని ప్రాంతాలు కోర్టుల్లో సైతం పోరాటం చేశారు. తాజాగా ఐదేళ్ల క్రితం అమరావతి ఎలా ఉండేది, ప్రస్తుతం ఎలా ఉందనే అంశంపై చంద్రబాబు శ్వేత పత్రం విడుదల చేయనున్నారు. రాజధానిలో జరిగిన నిర్మాణాలు, ఇంకా జరగాల్సిన పనులపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయనున్నారు.

ఉచిత ఇసుక విధానం

ఈ నెల 8 నుంచి ఉచిత ఇసుక విధానం అమల్లోకి తీసుకురావాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఈ మేరకు మంత్రి కొల్లు రవీంద్రకు ఆదేశాలు జారీ చేశారు. ఇసుక లోడింగ్, రవాణా ఛార్జీలు నిర్ణయించేందుకు కలెక్టర్ల అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేయనున్నారు. మంగళవారం ఇసుక తవ్వకాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. జగన్‌ పాలనలో ఇసుక పాలసీ వల్ల పేదలు తీవ్రంగా నష్టపోయారని, గృహనిర్మాణ రంగం కుదేలైందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇసుక డంప్‌లు వైసీపీ నేతలు, ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్నాయన్న సమాచారం ఉందని, ధరలను భారీగా పెంచి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని సీఎం పేర్కొన్నారు. తక్షణమే ఇసుక ధరలు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టంచేశారు. ఈ సందర్భంగా రీచ్‌లు, స్టాక్‌పాయింట్లు, డంప్‌ల పరిధిలో ఎంత ఇసుక అందుబాటులో ఉందని అధికారులను సిఎం ప్రశ్నించారు. ప్రస్తుతం 40 లక్షల టన్నులు అందుబాటులో ఉందని అధికారులు వివరించారు.

తదుపరి వ్యాసం