తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tahsildar Murder : ఐరన్ రాడ్‌తో దాడి - విశాఖలో తహసీల్దార్‌ దారుణ హత్య

Tahsildar Murder : ఐరన్ రాడ్‌తో దాడి - విశాఖలో తహసీల్దార్‌ దారుణ హత్య

03 February 2024, 13:22 IST

google News
    •  Tahsildar Murder in Visakhapatnam : విశాఖ జిల్లాలో దారుణం జరిగింది. తహసీల్దార్‌ గా పని చేస్తున్న రమణయ్య అనే అధికారి దారుణ హత్యకు గురయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు… ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపాయి.
తహసీల్దార్‌ దారుణ హత్య
తహసీల్దార్‌ దారుణ హత్య (Unshplash.com)

తహసీల్దార్‌ దారుణ హత్య

Tahsildar Murder in Visakhapatnam :విశాఖ జిల్లాలో ఓ తహసీల్దార్ దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తుల చేసిన దాడిలో ఆయన ప్రాణాలు కోల్పోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

వివరాల్లోకి వెళ్తే….. కొమ్మాదిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆయన నివాసం ఉండే చరణ్ క్యాజిల్‌ అపార్ట్‌మెంట్‌ గేట్‌ వద్ద దుండగులు శుక్రవారం రాత్రి ఇనుప రాడ్‌తో దాడి చేశారు. దీంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. వాచ్ మెన్ కేకలు వేయటంతో దుండగులు అక్కడ్నుంచి పరారీ అయ్యారు. వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ.. చికిత్స పొందుతూ మృతి చెందారు. తహసీల్దార్‌పై రాడ్‌తో దాడి చేసిన సమయంలో దగ్గరలో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డైంది. విశాఖ రూరల్ తహసీల్దార్‌గా పనిచేసిన రమణయ్య.. ఇటీవల విజయనగరం జిల్లా బంటుమిల్లికి బదిలీ అయ్యారు.

భూమాఫియా పనేనా…?

తహసీల్దార్ రమణయ్యది శ్రీకాకుళం జిల్లా. ఇటీవలే విశాఖ రూరల్ నుంచి విజయనగరం జిల్లా బంటుపల్లికి బదిలీ అయ్యారు. భూవివాదం కోణంలోనే ఈ మర్డర్ జరిగిందన్న వార్తలు వినిపిస్తున్నాయి.

సీసీ పుటేజీలో పలు దృశ్యాలు రికార్డయ్యాయి. అపార్ట్ మెంట్ లోని గది నుంచి బయటికి వచ్చిన రమణయ్య పది నిమిషాలపాటు ఓ ఫోన్ కాల్ మాట్లాడినట్లు ఉంది. ఈ సమయంలోనే అక్కడికి వచ్చిన వ్యక్తితో వాదిస్తున్నట్లు కనిపించాయి. తిరిగి ఇంట్లోకి వెళ్లే క్రమంలో ఇనుపరాడ్ తో రమణయ్యపై దాడి జరిగింది. మొత్తం నలుగురు ఈ ఘటనకు పాల్పడినట్లు సీసీటీవీ పుటేజీలో ఉంది. వాచ్ మెన్ కేకలు వేయటంతో వెంటనే వారు పారిపోగా...రమణయ్యను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. తెల్లవారుజాము సమయంలో తహసీల్దార్ రమణయ్య ప్రాణాలు వదిలారు. ఘటనాస్థలిని వైజాగ్ సీపీ పరిశీలించారు. ఘటన జరిగిన తీరుపై వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ఈ మర్డర్ విషయంలో విశాఖ జిల్లాలో సంచలన పరిణామంగా మారింది. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీస్ శాఖ… హత్యకు గల కారణాలను తెలుసుకునేందుకు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు. రమణయ్య విధులు నిర్వర్తించిన పలు ప్రాంతాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది.

తదుపరి వ్యాసం