తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Eluru Fraud: ఇస్రోలో ఉద్యోగమంటూ ఐదో పెళ్లికి రెడీ… ఏలూరులో కేటుగాడిని అరెస్ట్ చేసిన పోలీసులు

Eluru Fraud: ఇస్రోలో ఉద్యోగమంటూ ఐదో పెళ్లికి రెడీ… ఏలూరులో కేటుగాడిని అరెస్ట్ చేసిన పోలీసులు

08 October 2024, 14:57 IST

google News
    • Eluru Fraud: ఇస్రోలో ఉన్నతోద్యోగినంటూ నమ్మించి ఐదో పెళ్లికి రెడీ అయిన కేటుగాడిని ఏలూరు పోలీసులు అరెస్ట్ చేశారు.  9వ తరగతి మాత్రమే చదివిన నిందితుడు మోసాలు చేస్తూ జల్సా జీవితం గడిపేస్తున్నాడు.  నిందితుడిగా బంధువులుగా వ్యవహరిస్తున్న వారిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. 
ఇస్రోలో ఉద్యోగినంటూ మోసాలకు పాల్పడిన ముఠా అరెస్ట్‌
ఇస్రోలో ఉద్యోగినంటూ మోసాలకు పాల్పడిన ముఠా అరెస్ట్‌

ఇస్రోలో ఉద్యోగినంటూ మోసాలకు పాల్పడిన ముఠా అరెస్ట్‌

Eluru Fraud: మ్యాట్రిమోనీ ద్వారా సేకరించిన వివరాలతో పెళ్లి చూపులు డ్రామా ఆడటం, మాయ మాటలు చెప్పి ఇప్పటి వరకు నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న కేటుగాడిని ఏలూరు పోలీసులు అరెస్ట్‌ చేవారు. నిత్య పెళ్లి కొడుకుగా మారిన ఆశం అనిల్ బాబు అలియాస్ కళ్యాణ్ రెడ్డి భీమడోలు పోలీసులు అరెస్ట్ చేశారు.

పెళ్లి చూపుల కోసం వచ్చినట్లు వచ్చి, మాయ మాటలు చెప్పి, పెళ్లి కూతురు ఇంట్లో ఎవరైనా చదువుకున్న వారు ఉంటే ఇస్రో వంటి పెద్ద సంస్థలలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి మోసాలకు పాల్పడే ముఠా ఆటకట్టించారు. నిందితుల నుంచి రెండు లక్షల నగదు. ఓ కారు, ఐదు మొబైల్ ఫోన్లు, 13 సిమ్‌ కార్డులు, కంప్ూటర్లు, నకిలీ అపాయింట్‌మెంట్‌ లెటర్లు, నకిలీ లెటర్‌ హెడ్లు, బ్యాంకు చెక్‌ బుక్‌లు స్వాధీనం చేసుకున్నారు.

నిందితుడు అనిల్‌ తిరు పతి జిల్లా వెంకటగిరి మండలం బంగారుపేటకు చెందిన వాడు. ప్రస్తుతం ఖమ్మం జిల్లా మదిర లోని టీచర్స్ కాలనీలో ఉంటున్నాడు. 9వ తరగతి మాత్రమే చదువుకున్నాడు. ఓ మ్యాట్రిమోనిలో కల్యాణ్‌ రెడ్డిగా వివరాలు రిజిస్టర్ చేయించుకున్నాడు. దీని ద్వారా తనను సంప్రదించిన వారికి ఫోన్ చేసి, కల్యాణ్ రెడ్డి తండ్రిని మాట్లాడు తున్నానని చెప్పేవాడు.

తన కొడుకు ఇస్రోలో ఉన్నతోద్యోగం చేస్తున్నాడు, తాము ఇంజనీర్లమని చెప్పుకునే వాడు. తమ కొడుకు పెళ్లి చూపులకు వస్తున్నాడని నమ్మించేవాడు. పెళ్లిచూపులకు వచ్చినప్పుడు తన తల్లిదండ్రు లకు సెలవు దొరక్క పోవడంతో వారు రాలేక పోయారని నమ్మించేవాడు. తనకు ఆస్తులు ఉన్నాయని నమ్మించేందుకు హైదరాబాద్ శివార్లలో చేవెళ్లలో ఓ ఫామ్ హౌస్‌, బెంగళూరులో ఓ విల్లా అద్దెకు తీసుకున్నాడు. అవి తనవేనని పెళ్లి సంబంధాలకు వచ్చిన వారికి చెప్పేవాడు. తనకు సహాయకుడిగా ఓ వ్యక్తిని, పెళ్లి చేసే పంతులును వెంటే ఉంచుకునేవాడు.

భీమడోలులో మోసం చేసి దొరికాడు..

పెళ్లి చేసుకుని కొన్నాళ్లకు ఉడాయించడం అలవాటుగా చేసుకున్నాడు. 2023లో ఐదో పెళ్లి చేసుకునేందుకు ప్రణా ళిక వేసిన అనిల్.. భీమడోలు మండలం గుండు గొలనుకు చెందిన గుండా లక్ష్మీకుమారిని సంప్రదించాడు. ఆమె రెండో కుమార్తెను పెళ్లి చేసుకుని, మూడో కుమార్తెకు ఇస్రోలో ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పాడు. ఆమె నుంచి పలు విడతల్లో రూ.9.53 లక్షలు కాజే శాడు. నకిలీ అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా ఇప్పించాడు. ఆ తర్వాత వారు మోసపోయినట్లు గ్రహించి భీమడోలు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

కేసు దర్యాప్తు చేసిన పోలీసులు అనిల్ గతంలో నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నట్టు గుర్తించారు. నిందితుడు బాధితుల నుంచి కోటిన్నర వరకు కాజేసినట్టు దర్యాప్తులో తేలింది. అనిల్‌తో పాటు వైఎస్సార్ జిల్లా యర్రగుంట్లకు చెందిన తుంగా శశాంక్, కారు డ్రైవరు నంద్యాల జిల్లా బనగానిపల్లి మండలం బత్తు లూరుపాడుకు చెందిన పల్లె హేమంత్‌రెడ్డిలను అరెస్ట్ చేశారు. మ్యాట్రిమోనీ సైట్లలో వచ్చే వివరాలు ధృవీకరించుకున్న తర్వాతే పెళ్లిల్లు ఖరారు చేసుకున్న ఏలూరు జిల్లా ఎస్పీ కిషోర్ సూచించారు. కేసును చేధించిన గుండుగొలను పోలీసుల్ని అభినందించారు. sa

తదుపరి వ్యాసం