HT తెలుగు మీకు నోటిఫికేషన్ పంపాలనుకుంటోంది. సబ్‌స్క్రైబ్ చేసుకోవడానికి సరే అని క్లిక్ చేయండి.
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Vande Bharat Express : అలర్ట్... విశాఖ - సికింద్రాబాద్ 'వందేభారత్' షెడ్యూల్ లో మార్పులు, ఇకపై మంగళవారం సెలవు..!

Vande Bharat Express : అలర్ట్... విశాఖ - సికింద్రాబాద్ 'వందేభారత్' షెడ్యూల్ లో మార్పులు, ఇకపై మంగళవారం సెలవు..!

09 August 2024, 19:09 IST

    • Vizag - Secunderabad  Vande Bharat Express : వందే భారత్ ఎక్స్ ప్రెస్ కు సంబంధించి దక్షిణ మధ్య రైల్వే కీలక అప్డేట్ ఇచ్చింది. విశాఖ - సికింద్రాబాద్ మధ్య నడిచే షెడ్యూల్ లో మార్పులు చేసింది. ఇకపై ప్రతి మంగళవారం ఈ రైలుకు సెలవు ఉంటుంది. డిసెంబర్ 10 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది.
విశాఖ-సికింద్రాబాద్‌ వందేభారత్‌ షెడ్యూల్‌లో మార్పు
విశాఖ-సికింద్రాబాద్‌ వందేభారత్‌ షెడ్యూల్‌లో మార్పు

విశాఖ-సికింద్రాబాద్‌ వందేభారత్‌ షెడ్యూల్‌లో మార్పు

రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక అప్డేట్ ఇచ్చింది. విశాఖపట్నం-సికింద్రాబాద్‌-విశాఖపట్నం మధ్య నడిచే వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులో స్వ‌ల్ప మార్పులు చేస్తున్నట్లు పేర్కొంది. ఇకపై ప్రతి మంగళవారం సెలవు ఉంటుందని తెలిపింది.

దక్షిణ మధ్య రైల్వే తాజా ప్రకటన ప్రకారం…. విశాఖపట్నం - సికింద్రాబాద్ (20833) మధ్య నడిచే వందే భారత్ ట్రైన్ వారంలో ఆరు రోజులు సర్వీసు అందిస్తుందని తెలిపింది. గతంలో ఉన్న షెడ్యూల్ ప్రకారం… ఆదివారం సెలవు ఉండగా, ప్రస్తుతం దీన్ని మంగళవారానికి మారుస్తున్నట్లు వివరించింది. ఈ నిర్ణయం డిసెంబర్ 10వ తేదీ నుంచి అమల్లోకి రానుంది.

ఇక సికింద్రాబాద్ - విశాఖపట్నం( 20834) మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ ప్రెస్ షెడ్యూల్ లో కూడా మార్పులు చేశారు. ఈ ట్రైన్ కూడా మంగళవారం అందుబాటులో ఉండదని పేర్కొంది. ఈ నిర్ణయం కూడా డిసెంబర్ 10 నుంచే అమల్లోకి వస్తుందని తెలిపింది. ఇప్ప‌టివ‌ర‌కు షెడ్యూల్ ప్రకారం ఈ రైలు ఆదివారం మినహా వారంలో ఆరు రోజులు సేవ‌లందించేది.

విశాఖపట్నం-సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్ ప్రెస్… వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట రైల్వే స్టేషన్లలో రెండు దిశలలో ఆగుతుంది.

HT Telugu ఫేస్‌బుక్ పేజీ ద్వారా అప్‌డేట్స్ పొందండి
తదుపరి వ్యాసం
నోటిఫికేషన్ సెంటర్