Inner Ring road case: చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా
07 November 2023, 13:05 IST
- Inner Ring road case: ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ నవంబర్ 22వ తేదీకి వాయిదా పడింది.
చంద్రబాబు
Inner Ring road case: ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది.ఈ కేసులో బాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్ చేయడంతో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేశారు.
చంద్రబాబుకు ఇప్పటికే అనారోగ్య కారణాలతో బెయిల్‌పై ఉన్నందున విచారణ వాయిదా వేయాలని అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ సుబ్రహ్మణ్యం విజ్ఞప్తి చేశారు. చంద్రబాబుకు నవంబర్ 28వరకు బెయిల్ గడువు ఉన్నందున విచారణను వాయిదా 22వ తేదీకి వాయిదా వేశారు.
ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో చంద్రబాబును అరెస్ట్ చేయొద్దని గతంలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఏసీబీ కోర్ట్ విచారణ దశలో ఉన్న పిటి వారెంట్‌పై నేటి వరకు హైకోర్టు స్టే విధించింది.
తాజా విచారణలో చంద్రబాబు ఇప్పటికే బెయిల్‌పై ఉన్నందున విచారణ అవసరం లేదని వాయిదా వేయాలని అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ సుబ్రహ్మణ్యం విజ్ఞప్తి చేశారు. దీంతో ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు విచారణను నవంబర్ 22వ తేదీకి వాయిదా వేశారు.