తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Bjp Purandeswari: దొంగ ఓట్లపై బీజేపీ ఆందోళన.. ఐఏఎస్‌, ఐపీఎస్‌లపై ఈసీకి ఫిర్యాదు చేస్తామన్న పురందేశ్వరి

BJP Purandeswari: దొంగ ఓట్లపై బీజేపీ ఆందోళన.. ఐఏఎస్‌, ఐపీఎస్‌లపై ఈసీకి ఫిర్యాదు చేస్తామన్న పురందేశ్వరి

Sarath chandra.B HT Telugu

22 February 2024, 13:03 IST

google News
    • BJP Purandeswari: ఏపీలో ఐఏఎస్‌, ఐపీఎస్ అధికారులు వి‎ధుల్ని సక్రమంగా నిర్వర్తించాలని బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు.  దొంగఓట్ల వ్యవహారంపై అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. 
ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి
ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి

ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి

BJP Purandeswari: ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు దేశం పట్ల, ప్రజల పట్ల అంకిత భావంతో పని చేయాలని, ఓ రాజకీయ పార్టీకో.. పొలిటికల్ లీడర్లకు అధికారులు అనుకూలంగా ఉండకూడదన్నారు. ఎన్నికల అధికారులుగా ఉన్న వాళ్లు బాధ్యతతో వ్యవహరించాలని, అధికారులు ప్రజల పట్ల బాధ్యతతో ఉండాలి కానీ.. పార్టీ పట్ల కాదనే విషయాన్ని అధికారులు గుర్తించాలని పురందేశ్వరి హితవు పలికారు.

తప్పులు చేసే అధికారులు తీరు మార్చుకోకుంటే కేంద్రానికి ఫిర్యాదు చేస్తామన్నారు. ఏపీలో దొంగ ఓట్ల అంశం ఆందోళన కలిగిస్తోందన్నారు. ఇప్పటికే దొంగ ఓట్ల వ్యవహరం కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని, తమ ఫిర్యాదుతోనే ఐఏఎస్ అధికారి గిరీషా సహా ఇతర అధికారులను సస్పెండ్ చేశారన్నారు. .

వైసీపీ నేతలు - కొందరు అధికారులు కుమ్మక్కై ఓటర్ల జాబితాలో అవకతవలు చేస్తున్నారని, క్రిమినల్ మైండ్ ఉన్న వాళ్లే ఇంత పెద్ద ఎత్తున ఓటర్ల జాబితాలో అవకతవకలు చేయగలరన్నారు. .తక్కువ మార్జినులో వైసీపీ ఓడిపోయే చోట్ల వైసీపీ ఓటర్ల జాబితాలో అవకతవకలకు పాల్పడుతున్నట్టు సమాచారం ఉందన్నారు.

బీజేపీ ప్రజా సేవకు అంకితమైన పార్టీ అని ప్రజా సేవ చేసి.. అధికారంలోకి రావాలనేది బీజేపీ ఉద్దేశ్యమన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమని, వచ్చే ఎన్నికల్లో బీజేపీకి 370 సీట్లు వస్తాయన్నారు. 370 అనేది బీజేపీకి నంబర్ కాదు.. సెంటిమెంట్ అన్నారు. వికసిత్ భారత్ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుగుతోందని చెప్పారు.

అన్ని ఆధారాలతో ఎన్నికల సంఘానికి దొంగ ఓట్ల Fake Votes వ్యవహారంపై ఫిర్యాదు చేశామన్నారు. నకిలీ ఓటరు గుర్తింపు కార్డులపై సమాచారం బిజెపి దృష్టికి తీసుకు రావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో అధికార పార్టీ దొంగ ఓట్లతో గట్టెక్కాలని చూస్తోందని తక్కువ మార్జిన్‌తో సీట్లను కోల్పోతామని భావించే నియోజకవర్గాల్లో ఈ తరహా కుట్రలకు నాంది పలుకిందని అనుమానం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలలో కేంద్ర ప్రభుత్వం నిధులు ఉన్నాయని ప్రజలకి వివరిస్తున్నామని చెప్పారు. పల్లెకి పోదాం పేరుతో బీజేపీ నాయకులు గ్రామాలలో నివసించి, వారితో మమేకమై రాష్ట్రానికి మోదీ సేవల గురించి వివరించినట్టు తెలిపారు. అయోధ్య రామ మందిరం నిర్మాణంతో గొప్ప కార్యక్రమానికి ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారని, ఈ నిర్మాణం జరిగితే హిందూ - ముస్లిమ్స్ మధ్య గొడవలు తలెత్తుతాయన్న విమర్శలని తిప్పి కొట్టగలిగామన్నారు.

వివాదాలకు తావు లేకుండా అయోధ్య రామ మందిరం నిర్మాణం అనేది జరిగిందని గుర్తు చేశారు. ప్రజా పూరి యాత్రకు బీజేపీ శ్రీకారం చుట్టిందని,

ప్రతి జిల్లాలో అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చిందని, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవి తీర్చ లేకపోయిందని ఆరోపించారు.రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రజలు బీజేపీ కి పట్టం కట్టాలని పిలుపు నిచ్చామన్నారు.

రాష్ట్రంలో ఉన్న నకిలీ ఓటు కార్డులు ఎలా జారీ చేశారో ఆధారాలతో ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్ళామన్నారు. ఐఏఎస్, IPS అధికారులను చీఫ్ ఎలక్షన్ కమిషన్ సస్పెండ్ చేశారన్నారు. ఎన్నికల్లో వాలంటీర్లను పోలింగ్ ఏజెంట్లుగా వినియోగుంచుకుంటామని ధర్మాన వ్యాఖ్యానించారని,

ఎలక్షన్ కమిషన్ స్వయంగా వాలంటీర్లను ఎలక్షన్స్ కి దూరంగా ఉంచాలని నిర్ణయించిందని, వీటిపై కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తామన్నారు.

తిరుపతి ఉప ఎన్నికల్లో తప్పుడు దారిలో గెలిచిన వ్యక్తిని అనర్హుడిగా గుర్తించి గెలుపును రద్దు చేయాలని ఎన్నికల దృష్టికి గతంలోనే తీసుకెళ్ళామన్నారు.

ఏపీలో ఎన్నికల పొత్తులపై అగ్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని, పొత్తు ఉన్నా లేకపోయినా బీజేపీ పార్టీ రాష్ట్రంలో బలోపేతానికి కృషి చేస్తున్నామని చెప్పారు.

తదుపరి వ్యాసం