తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Bjp Somu Veerrjau : వైసీపీ నేతలకు బుర్ర లేదన్న సోమువీర్రాజు

BJP Somu Veerrjau : వైసీపీ నేతలకు బుర్ర లేదన్న సోమువీర్రాజు

HT Telugu Desk HT Telugu

29 October 2022, 15:44 IST

google News
    • BJP Somu Veerrjau : అమరావతి ప్రాంత రైతులు శ్రీకాకుళం ప్రాంతానికి ఎందుకు రాకూడదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రశ్నించారు. రైతులపై అక్కసుతోనే  వికేంద్రీకరణ అంటున్నారని, మూడు రాజధానుల పేరుతో డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు.  పేదల ఇళ్లకు జగనన్న ఇళ్ళుగా ప్రచారం చేసుకోవడంపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని సోము వీర్రాజు చెప్పారు. 
ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు
ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు

ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు

BJP Somu Veerrjau పేదలకు ఇళ్ల నిర్మాణానికి కేంద్రం నిధులు ఇస్తుంటే వాటికి జగనన్న ఇళ్లు, కాలనీలను పేర్లు పెట్టుకుంటున్నారని, ఈ వ్యవహారంపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తామన్నారు బీజేపీ రాష్ట్ర అధ‌్యక్షుడు సోము వీర్రాజు. ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ నేతలకు బుర్రలేదని, అమరావతి రైతులు సిక్కోలు ఎందుకు రాకూడదని సోము ప్రశ్నించారు. రైతులపై అక్కసుతోనే వికేంద్రీకరణ అంటున్నారని మండి పడ్డారు.

ఏపీలో మూడు రాజధానుల పేరుతో డ్రామాలు చేస్తున్నారని, పేదల ఇళ్లకు జగనన్న పేరు పెట్టుకోవడానికి వీల్లేదన్నారు. ఈ విషయంపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తామన్నారు. పీఎం ఆవాస్ యోజన పేరు పెట్టకపోతే నిధులు నిలిపివేయాలని కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చెప్పారు.

రాష్ట్రంలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న స్పీకర్, మంత్రులు అర్ధరహితమైన భాష , మాట్లాడుతున్నారుని సోము ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలకు రాజకీయాలు తప్ప ,అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదన్నారు. 800 కోట్లు ఖర్చు పెడితే సిక్కోలు సస్యశ్యామలం అవుతుందని, వికేంద్రీకరణ గురించి మాట్లాడే నేతలకు అభివృద్ధిపై అవగాహన ఉందా అని ప్రశ్నించారు.

అధికార పార్టీ నేతలకు బుర్ర పనిచేస్తుందా అని సోము నిలదీశారు. స్పీకర్ తమ్మినేని, మంత్రి ధర్మాన కు ముఖ్యమంత్రి తో మాట్లాడి నిధులు తెచ్చే దమ్ము ఉందా అని ప్రశ్నించారు. పేదలకు ఇచ్చే ఇళ్లకు జగనన్న ఇల్లు అనే పేరు పెట్టుకోవటానికి వీలు లేదని, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరు పెట్టకపోతే కేంద్రం నిధులు నిలిపేస్తామన్నారు.

జగనన్న కాలనీలపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తామన్నారు. విభజన హామీలను బిజెపి అమలు చేసిందని, విభజన చట్టంలో లేని 8లక్షల కోట్లతో పనులు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని, మూడు రాజధానులు పేరుతో డ్రామాలు వద్దు అంటున్నామన్నారు.

ప్రతిపక్షంలో అమరావతిలోనే రాజధాని ఉంటుందని జగన్ చెప్పారు...ఇప్పుడు అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు వికేంద్రీకరణ గురుంచి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. అమరావతి రైతుల పాదయాత్రపై దాడి చేయటం ,అడ్డుకోవడం అవివేకమన్నారు. అమరావతి రైతులు సిక్కోలు వరకు ఎందుకు రాకూడదో చెప్పాలని నిలదీశారు. వికేంద్రీకరణ గురించి మాట్లాడే అర్హత వైసీపీ నేతలకు లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులతో జరిగే పనులు తప్పా ఒక్క పనైనా చేపట్టారా అని ప్రశ్నించారు.

రాజధాని పేరుతో రాష్ట్ర ప్రభుత్వం విబేధాలు సృష్టించటం మానుకోవాలని, ప్రభుత్వానికి ఏ అంశంపై అవగాహన లేదని, అమరావతి రైతులపై అక్కసుతోనే వికేంద్రీకరణ అంటున్నారన్నారు. వికేంద్రీకరణ ద్వారా ఎలా అభివృద్ధి చేస్తారో చెప్పే దమ్ము రాష్ట్రానికి లేదన్నారు.

టాపిక్

తదుపరి వ్యాసం