తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Nellore Birdflu: నెల్లూరులో విస్తరిస్తున్న బర్డ్‌ ఫ్లూ… చికెన్ విక్రయాలపై కలెక్టర్‌ ఆంక్షలు

Nellore BirdFlu: నెల్లూరులో విస్తరిస్తున్న బర్డ్‌ ఫ్లూ… చికెన్ విక్రయాలపై కలెక్టర్‌ ఆంక్షలు

Sarath chandra.B HT Telugu

16 February 2024, 12:14 IST

google News
    • Nellore BirdFlu: నెల్లూరు జిల్లాలో బర్డ్‌ ఫ్లూ కలకలం రేపుతోంది.  జిల్లాలోని పలు ప్రాంతాల్లో బర్డ్‌ ఫ్లూ కారణంగా పెద్ద సంఖ్యలో కోళ్లు చనిపోవడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. 
నెల్లూరు జిల్లాలో బర్డ్‌ ఫ్లూ కారణంగా వేల సంఖ్యలో కోళ్ల మృతి
నెల్లూరు జిల్లాలో బర్డ్‌ ఫ్లూ కారణంగా వేల సంఖ్యలో కోళ్ల మృతి

నెల్లూరు జిల్లాలో బర్డ్‌ ఫ్లూ కారణంగా వేల సంఖ్యలో కోళ్ల మృతి

Nellore BirdFlu: ఆంధ్రప్రదేశ్‌ AP రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో బర్డ్‌ఫ్లూ కలకలం రేగింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో బర్డ్‌ ఫ్లూతో వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాతపడ్డాయి.

నెల్లూరు జిల్లాలో బర్డ్‌ ఫ్లూ విస్తరిస్తోంది. వేల సంఖ్యలో కోళ్లు Chicken మృత్యవాత పడటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. వ్యాధి నిర్ధారణ పరీక్షల్లో బర్డ్‌ఫ్లూగా తేలడంతో అధికారులు ఆంక్షలు Retrictions విధించారు.

జిల్లాలోని చాటగుట్ల Chatagutla, గుమ్మళ్ళదిబ్బ Gummalladibbaలో బర్డ్ ఫ్లూ కారణంగా వేల సంఖ్యలో కోళ్లు చనిపోయాయి. కోళ్ల కళేబరాల నుంచి శాంపిల్ Samples సేకరించి భోపాల్ Bhopal లోని టెస్టింగ్ కేంద్రానికి పంపిన పశుసంవర్ధక శాఖ అధికారులు..బర్డ్‌ ఫ్లూ‌గా ఫలితాలు రావడంతో అప్రమత్తం అయ్యారు.

జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధితో కోళ్లు చనిపోతున్నాయని నిర్ధారణకు వచ్చిన జిల్లా యంత్రాంగం, వ్యాధి విస్తరిస్తున్న ప్రాంతాలపై దృష్టి సారించారు.

కోళ్లు మృతిచెందిన ప్రాంతానికి పది కిలోమీటర్ల పరిధి లో 3 రోజులపాటు చికెన్ షాపులు మూసివేయాలని, కిలోమీటర్ పరిధిలో ఉన్న చికెన్ షాప్స్ మూడు నెలల పాటు మూసేయ్యాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

నెల్లూరు Nellore జిల్లాలో బర్డ్‌ఫ్లూ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఎం.హరినారాయణన్ అధికారుల్ని గురువారం ఆదేశించారు. నెల్లూరు క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. పొదలకూరు మండలం చాటగుట్ల, కోవూరు మండలం గుమ్మళ్లదిబ్బ గ్రామాల్లో ఇటీవల ఏవీఏఎన్‌ ఇన్‌ఫ్లూయోంజాతో కోళ్లు పెద్ద ఎత్తున చనిపోయినట్లు అధికారులు గుర్తించారు.

చనిపోయిన కోళ్ల నమూనాలను పశుసంవర్థక శాఖ అధికారులు భోపాల్‌లోని పరీక్షా కేంద్రాలకు పంపారు. ఇన్‌‌ఫ్లూయెంజా Influenza నిర్ధారించడంతో వ్యాధి ప్రబలకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిబంధనల ప్రకారం కోళ్లు మృతి చెందిన ప్రాంతానికి పది కిలోమీటర్ల పరిధిలో మూడు రోజుల పాటు చికెన్ దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు. కిలోమీటర్ పరిధిలో మూడు నెలలు దుకాణాలు తెరవొద్దని ఆదేశించారు.

వ్యాధి ప్రబలిన ప్రాంతాల నుంచి 15రోజుల వరకు కోళ్లు ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా, బయట నుంచి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. చనిపోయిన కోళ్లను భూమిలో పాతేయాలని, గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు.

బర్డ్ ఫ్లూ వ్యాపించిన కిలో మీటర్ పరిధిలో మూడు నెలల వరకు షాపులు తెరవకూడదని,కోళ్లతో పనిచేసేవారు జాగ్రత్తగా ఉండాలని వ్యాధి ప్రబలిన 2 గ్రామాల్లో డీపీవో, జిల్లా పరిషత్ సీఈవో గ్రామసభలు నిర్వహించాలని ఆదేశించారు. ప్రజలు, కోళ్ల పెంపకందారులు, చికెన్ షాప్ యజమానుల్లో చైతన్యం తేవాలని ఆయా గ్రామాల పరిధిలో శానిటైజేషన్ చేయించాలని కలెక్టర్ సూచించారు.

మనుషులకు సోకే ప్రమాదం…

బర్డ్‌ఫ్లూ పక్షుల నుంచి మనుషులకు కూడా సోకుతుంది. గాలిద్వారా వ్యాధి వస్తుందని పశు సంవర్థక శాఖ అధికారులు చెబుతున్నారు. గతంలో దేశంలోని పలు ప్రాంతాల్లో వ్యాధి సోకి లక్షల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడ్డాయి.

నెల్లూరు జిల్లా పొదలకూరు Podalakur మండలం తేటగొట్ల, కోవూరు Kovurమండలం గుమ్మలదిబ్బ గ్రామాల్లో బ్రాయిలర్‌ కోళ్ల ఫారాల్లో బర్డ్‌ఫ్లూ వ్యాప్తి చెందింది. ఈనెల 5న కోళ్లు వేల సంఖ్యలో చనిపోవడంతో వెంటనే అక్కడి ఫారాల వారు పశువైద్య అధికారులను సంప్రదించారు.

పశు సంవర్థక శాఖ నుంచి కొందరు అధికారులు అక్కడికి వెళ్ళి రక్తనమూనాలు సేకరించి పరీక్షల నిమిత్తం విజయవాడలోని వెటర్నరీ బయోలాజికల్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ (విబిఆర్‌ఐ)కు పంపించారు.

విజయవాడలో వెలువడిన ఫలితాలపై అనుమానం వచ్చిన రీసెర్చ్‌ ల్యాబ్‌ అధికారులు రక్త నమూనాలను భోపాల్‌లోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హై సెక్యూరిటీ యానిమల్‌ డిసీజెస్‌ ((NIHSAD)) పంపించారు. అక్కడ చేసిన పరీక్షల్లో బర్డ్‌ఫ్లూగా నిర్థారించి రిపోర్టులను గురువారం విజయవాడకు పంపించారు. వెంటనే ఈ విషయాన్ని నెల్లూరు జిల్లా కలెక్టర్‌కు, ఇతర సంబంధిత అధికారులకు విజయవాడ లేబరేటరీ వారు పంపించారు.

పది రోజులుగా ఉదాసీనత…

బర్డ్‌ఫ్లూ వ్యాధి వచ్చిందనే రిపోర్టులు ఆలస్యంగా రావడంతో ఇప్పటికే ఎన్ని జిల్లాలకు విస్తరించిందనే లెక్కలు లేవు. ప్రకాశం, కడప, అన్నమయ్య, తిరుపతి జిల్లాలకు నెల్లూరు నుంచి కోళ్లు వెళుతుంటాయని గుర్తంచారు.

ప్రభుత్వ లెక్కల ప్రకారం ఒక చదరపు కిలో మీటరు పరిధిలో వెయ్యి కోళ్లు ఉంటే ఆ జిల్లాలను ‘ఎ’ కేటగిరీ జిల్లాలుగా ప్రభుత్వం గుర్తించింది. ఏపీలో అటువంటి జిల్లాలు మూడు ఉన్నాయి. అవి ఉమ్మడి కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలు. ఈ జిల్లాల్లో అలర్ట్‌ ప్రకటించాల్సి ఉంటుంది.

విదేశీ పక్షులు వచ్చే సరస్సులు ఉన్న జిల్లాలను కూడా అలర్ట్‌ చేయాలని పశుసంవర్థక శాఖ అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, నెల్లూరు, కడప, శ్రీకాకుళం, కర్నూలు, ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో విదేశీ పక్షులు వస్తుంటాయని గుర్తు చేస్తున్నారు.

బర్డ్‌ ఫ్లూ హెచ్చరికలపై నెల్లూరు జిల్లా వ్యాప్తంగా హై అలర్ట్‌ ప్రకటించి కంట్రోల్‌ రూమ్స్‌ ఏర్పాటు చేయాల్సి ఉన్నా అలా చేయలేదు. ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీమ్స్‌ను అలర్ట్‌ చేయడం, సిబ్బందిని అందుబాటులో ఉంచడం వంటి చర్యలపై ఉదాసీనంగా వ్యవహరించారనే విమర‌్శలు ఉన్నాయి.

తదుపరి వ్యాసం