తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ys Avinash Reddy: అరెస్ట్ వార్తలపై అవినాష్‌ రెడ్డిలో నిస్పృహ.. ఏది జరిగితే అది జరుగుతుందన్న కడప ఎంపీ

YS Avinash Reddy: అరెస్ట్ వార్తలపై అవినాష్‌ రెడ్డిలో నిస్పృహ.. ఏది జరిగితే అది జరుగుతుందన్న కడప ఎంపీ

HT Telugu Desk HT Telugu

26 April 2023, 6:39 IST

    • YS Avinash Reddy: సుప్రీం కోర్టు ముందస్తు బెయిల్ రద్దు చేయడంతో ఎంపీ అవినాష్‌ రెడ్డిని సిబిఐ ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేస్తుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు కడపలో తన అభిమానులు, అనుచరులతో అవినాష్ రెడ్డి సమావేశాన్ని నిర్వహించారు. ఈ కేసులో తనకు సంబంధం లేదని అవినాశ్‌రెడ్డి నిర్వేదం వ్యక్తం చేశారు.
వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ
వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ

వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ

YS Avinash Reddy: వివేకా హత్య కేసులో పరిణామాలు వేగంగా మారిపోతుండటంతో ఎంపీ అవినాష్ రెడ్డి కడపలో తన అనుచరులతో భేటీ అయ్యారు. సిబిఐ దర్యాప్తు జరుగుతున్న తీరుపై అవినాష్ రెడ్డి నిస్పృహకు గురైనట్లు కనిపించారు.

ట్రెండింగ్ వార్తలు

Visakha Human Trafficking : విశాఖలో హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా అరెస్టు, నిరుద్యోగులను చైనా కంపెనీలు అమ్మేస్తున్న గ్యాంగ్!

South West Monsoon : అండమాన్ ను తాకిన నైరుతి రుతుపవనాలు, తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

JD Lakshmi Narayana : అల్లర్ల సమయంలో సీఎం జగన్ విదేశీ పర్యటనకు వెళ్లడమేంటి? -జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు

Chikkamagaluru : ప్రకృతి అందాలు, కొండల్లో కాఫీ తోటల్లో ట్రెక్కింగ్- చిక్కమగళూరు అద్భుతాలు చూసొద్దామా?

హైదరాబాద్‌ నుంచి మంగళవారం మధ్యాహ్నం పులివెందుల చేరుకున్న అవినాష్ రెడ్డి 3.20 నుంచి రాత్రి 8గంటల వరకు సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్‌ నిర్వహించారు. ఆ కార్యక్రమం తర్వాత మీడియాతో మాట్లాడిన అవినాష్ రెడ్డి హత్య జరిగిన రోజు వివేకానందరెడ్డి చనిపోయినట్లు సునీత భర్త రాజశేఖర్‌రెడ్డి ఫోన్‌ చేస్తే జమ్మలమడుగు వెళ్తూ తిరిగి అక్కడకు వెళ్లినట్లు చెప్పారు. తనకు ఫోన్‌ రావడం 15 నిమిషాలు ఆలస్యమై ఉంటే ఈ రోజు నా మీద నిందలు ఉండేవి కావన్నారు.

ఈ కేసులో తనను ఇరికించేందుకు కుట్ర జరుగుతోందని, తనను, పార్టీని డ్యామేజ్‌ చేసేందుకు ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. సునీతమ్మ ఇచ్చిన మొదటి స్టేట్‌మెంటుకు, ఇప్పుడు చాలా వ్యత్యాసాలు ఉన్నాయని అవినాష్ రెడ్డి ఆరోపించారు.

సుప్రీం కోర్టు ముందస్తు బెయిల్ రద్దు చేసిన తర్వాత ఎంపీ అవినాష్ రెడ్డి కడప జిల్లాలోని పులివెందుల క్యాంపు కార్యాలయంలో ముగిసిన అవినాష్ రెడ్డి ప్రజాదర్బార్ నిర్వహించారు. సాయంత్రం 3 గంటల నుండి 8.00గంటల వరకు ప్రజాదర్బార్ నిర్వహించిన ఎంపి అవినాష్ రెడ్డి అనుచరులతో సమాలోచన జరిపారు. ఎంపీ స్థాయి వ్యక్తికే నిజాయితీ నిరూపించుకోవడాని చాలా కష్టపడాల్సి వస్తోందని, ఇక సామాన్యుడి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.

వైఎస్ సునీత స్టేట్మెంట్ లో చాలా వ్యత్యాసాలు ఉన్నాయని అవినాష్ రెడ్డి అభిప్రాయపడ్డారు. సునీత మొదట ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో తమ ప్రస్తావనే లేదని, మొదట లెటర్ దాచిన విషయంలో కూడా తమ కుటుంబానికి సంబంధం లేదన్నారు. సునీత ఇప్పుడు పూర్తిగా మాట మార్చిందని అవినాష్ రెడ్డి చెప్పారు. సునీత భర్త రాజశేఖరరెడ్డి ఫోన్ చేస్తేనే తాను అక్కడికి వెళ్ళానని స్పష్టం చేశారు.

తనకు ఫోన్ రావడం ఒక 15 నిమిషాలు ఆలస్యం అయి ఉంటే నిందలు ఉండేవి కావన్నారు. తనను కేసులో ఇరికించడానికి కుట్ర జరుగుతోందని అవినాష్ రెడ్డి చెప్పారు. వివేకా హత్య కేసులో తనకు, తండ్రి భాస్కర్ రెడ్డికి, శంకర్ రెడ్డికు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

వివేకాను హత్య చేయబోయే ముందు దస్తగిరి తదితరులు రాయించిన లేఖను బట్టి అర్థం చేసుకోవచ్చన్నారు. హత్య చేసినప్పుడే హత్య కేసులో డ్రైవర్ ప్రసాద్‌ను ఇరికించాలని చూశారన్నారు. ప్రస్తుతం తనపై కూడా అలాంటి కుట్రే జరుగుతోందన్నారు. తాను ఏ పాపం చేయలేదు కాబట్టి గత మూడు సంవత్సరాలుగా సిబిఐ విచారణ గురించి పట్టించుకోలేదని, మీడియా కూడా ఈ కేసులోని వాస్తవాలను తెలుసుకుని ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందనన్నారు. బుధ, గురువారాలలో కూడా పులివెందులలోనే ఉంటానని అవినాష్ రెడ్డి స్పష్టం చేశారు.

సిబిఐ అరెస్టు చేస్తుందా అని మీడియా ప్రశ్నించడంతో అంతా దైవాదీనం అని అవినాష్ నిర్వేదం వ్యక్తం చేశారు. ధర్మో రక్షతి రక్షితః అన్న దాన్ని నమ్ముతానని, తనను ధర్మమే కాపాడుతుంది అని అవినాష్‌ రెడ్డి చెప్పారు.

అవినాష్ అరెస్ట్పై ఉత్కంఠ.. జోరుగా సాగుతున్న బెట్టింగ్..

వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తారన్న వార్తల నేపథ్యంలో కడపలో బెట్టింగులు జోరందుకున్నాయి. వివేకాను అరెస్ట్ చేస్తారని, మరికొందరు చేయరంటూ పందాలు కాస్తున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గంతో పాటు అవినాష్ రెడ్డి నివాసముండే పులివెందులలో కూడా బెట్టింగులు జరుగుతున్నట్లు ప్రచారంలో ఉంది. అవినాష్ అరెస్ట్ వార్తల నేపథ్యంలో పోలీసు శాఖ అప్రమత్తమైంది.. రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో నిరసనలు చెలరేగే అవకాశం ఉందనే హెచ్చరికల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు.

 

తదుపరి వ్యాసం