Minor Rape: ప్రకాశం జిల్లాలో దారుణం.. 8వ తరగతి విద్యార్థిపై అత్యాచారం చేసిన సోదరుడు.. నిందితుడు 9వ తరగతి
28 October 2024, 6:10 IST
- Minor Rape: ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. 8వ తరగతి చదువుతున్న చెల్లెలిపై అన్న అత్యాచారం చేసిన ఘటన వెలుగు చూసింది. బాధితురాలు స్నేహితులతో ఫోన్లో ఛాటింగ్ చేస్తోందని బెదిరించి సొంత అన్న అత్యాచారానికి పాల్పడటంతో గర్భం దాల్చింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
చెల్లెలిపై అత్యాచారానికి పాల్పడిన అన్న
Minor Rape: ప్రకాశం జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. 8వ తరగతి చదువుతున్న చెల్లెలు ఫోన్లో మిత్రులతో ఛాట్ చేస్తోందని గుర్తించిన సోదరుడు ఆమెను బెదిరించి కొద్ది రోజులుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. చెల్లెలి విషయాన్ని ఇంట్లో వారికి చెబుతానని బెదిరించి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. నిందితుడు కూడా అదే పాఠశాలలో చదువుతున్నట్టు పోలీసులు గుర్తించారు. చెల్లెలు ప్రేమ వ్యవహారాన్ని ఇంట్లో వారికి చెబుతానని బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు.
ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన అత్యాచార ఘటనపై స్థానిక పోలీసలు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం తాళ్లూరు మండలంలోని గ్రామంలోని బాలిక అక్కడే ఉన్న జడ్పీ హైస్కూల్‌లో 8వ తరగతి చదువుతోంది. ఇంటికి వచ్చిన తర్వాత మొబైల్ ఫోన్‌లో తోటి విద్యార్థులతో రోజూ చాటింగ్ చేస్తూ ఉండేది.
ఈ క్రమంలో అదే పాఠశాలకు చెందిన ఓ బాలుడితో ఫోన్లో చనువుగా ఉంటోంది. ఈ విషయం అదే స్కూల్లో 9వ తరగతి చదువుతున్న బాలిక సోదరుడికి తెలిసింది. తన చెల్లెలి విషయం తల్లిదండ్రులకు చెబుతానంటూ బెదిరించి ఆమెపై కొంత కాలంగా లైంగిక దాడి చేశాడు. ఇటీవల బాలికకు తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు దర్శి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు.
వైద్య పరీక్షల్లో ఆ బాలిక గర్భవతిగా గుర్తించారు. ఆస్పత్రి సిబ్బంది స్త్రీ శిశుసంక్షేమ శాఖకు సమాచారం అందించడంతో వారు పోలీసులకు వివరాల అందించారు. బాలిక గర్భవతిగా నిర్ధారణ కావడంతో ఆమెను తల్లిదండ్రులు గట్టిగా ప్రశ్నించడంతో సోదరుడి నిర్వాకాన్ని వివరించింది. వైద్యులకు జరిగిన విషయాన్ని వివరించడంతో తల్లిదండ్రుల సమ్మతితితో ఆమెకు అబార్షన్ చేయించారు. మెరుగైన చికిత్స కోసం బాలికను ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న దర్శి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అత్యాచారం కేసులో బాలుడిని జువైనల్ హోమ్‌కు తరలిస్తామని తెలిపారు.