తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Borugadda Anil : రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కు పోలీస్ స్టేషన్ లోనే రాచమర్యాదలు, మరో వీడియో వెలుగులోకి

Borugadda Anil : రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కు పోలీస్ స్టేషన్ లోనే రాచమర్యాదలు, మరో వీడియో వెలుగులోకి

09 November 2024, 17:17 IST

google News
  • Borugadda Anil : రౌడీ షీటర్ అనిల్ ను పోలీసులు రెస్టారెంట్ కు తీసుకెళ్లి బిర్యానీ తినిపించిన వివాదం సద్దుమణగకముందే...పోలీస్ స్టేషన్ లో రాచమర్యాదలు చేసిన మరో వీడియో వెలుగులోకి వచ్చింది. అనిల్ కోసం స్టేషన్ లోనే టేబుల్ పై దిండు, దుప్పటితో బెడ్ ఏర్పాటు చేశారు పోలీసులు.

 రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కు పోలీస్ స్టేషన్ లోనే రాచమర్యాదలు, మరో వీడియో వెలుగులోకి
రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కు పోలీస్ స్టేషన్ లోనే రాచమర్యాదలు, మరో వీడియో వెలుగులోకి

రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కు పోలీస్ స్టేషన్ లోనే రాచమర్యాదలు, మరో వీడియో వెలుగులోకి

Borugadda Anil : రౌడీ షీటర్ అనిల్ ను పోలీసులు రెస్టారెంట్ కు తీసుకెళ్లి బిర్యానీ తినిపించిన వివాదం సద్దుమణగకముందే...పోలీస్ స్టేషన్ లో రాచమర్యాదలు చేసిన మరో వీడియో వెలుగులోకి వచ్చింది. అనిల్ కోసం స్టేషన్ లోనే టేబుల్ పై దిండు, దుప్పటితో బెడ్ ఏర్పాటు చేశారు పోలీసులు.

ఏపీలో పోలీసుల తీరు వివాదాస్పదంగా మారుతోంది. సామాన్యులను ఇబ్బందులు పెడుతూ.. నేరస్థులకు రాచమర్యాదల చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వ సమయంలో.. కూటమి నేతలు, వారి కుటుంబ సభ్యులపై అత్యంత హేమమైన వ్యాఖ్యలు చేయడమే కాకుండా...బెదిరింపులకు పాల్పడిన రౌడీ షీటర్ బోరు గడ్డ అనిల్ కు పోలీసులు రాచమర్యాదలు చేయడం మరోసారి వివాదాస్పదం అవుతోంది. ఇటీవల బోరుగడ్డను జైలుకు తరలించే క్రమంలో రెస్టారెంట్ కు తీసుకెళ్లి బిర్యానీ పెట్టించిన పోలీసుల తీరు విమర్శలకు దారితీసింది. తాజాగా మరో వీడియో వెలుగులోకి వచ్చింది.

ఓ వ్యాపారిని బెదిరించి రూ.50 లక్షలు డిమాండ్ చేసిన కేసులో అరెస్ట్ అయిన రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కు స్వయంగా పోలీసులు... గుంటూరు అరండల్ పేట్ పోలీస్ స్టేషన్ లో రాచమర్యాదలు చేశారు. అరెస్టు అనంతరం బోరుగడ్డను స్టేషన్ కు తరలించి...అతనికి సపర్యలు చేశారు. బోరుగడ్డ పడుకునేందుకు ఓ టేబుల్ పై దుప్పటి, దిండు వేశారు. బోరుగడ్డ పోలీసులకు ఆదేశాలు ఇస్తున్నట్లు ఉన్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఈ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్, అనిత... ఇలా కూటమి నేతలను హత్య చేస్తానని, వారి కుటుంబ సభ్యులను రేప్ చేస్తానని బోరుగడ్డ అనిల్ ... వైసీపీ హయాంలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓ రౌడీ షీటర్ కు పోలీసులు ఇంతలా సేవలు చేయడం ఏంటని పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోలు నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు మండిపడుతున్నారు.

బోరుగడ్డకు బిర్యానీ-ఏడుగురు పోలీసుల సస్పండ్

వైసీపీ నేత, రౌడీ షీటర్‌ బోరుగడ్డ అనిల్ కు మర్యాదలు చేసిన ఏడుగురు పోలీసులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. మంగళగిరి కోర్టు నుంచి రాజమండ్రి జైలుకు తరలించే సమయంలో రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్ ను ఏలూరులోని ఓ రెస్టారెంట్ కు పోలీసులు తీసుకెళ్లారు. అతనితో సరదాగా మాట్లాడుతూ చికెన్ బిర్యానీ తినిపించారు పోలీసులు. రెస్టారెంట్లో ఉన్న సీసీ కెమెరాల్లో పోలీసుల వ్యవహారం అంత రికార్డైంది. ఆ వీడియో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు అప్రమత్తం అయ్యారు. ఈ క్రమంలోనే ఏడుగురు పోలీసు సిబ్బందిని సస్పెండ్ చేస్తూ గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.

మరో కేసు నమోదు

రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్‌పై మరో కేసు నమోదు అయ్యింది. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్‌లపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారని, టీడీపీ నేత గట్టు తిలక్ గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కర్నూలు మూడో పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. దీంతో ఆయనను పీటీ వారెంట్‌పై కర్నూల్ కు తీసుకొచ్చిన పోలీసులు విచారణ చేపట్టారు.

బోరుగడ్డ అనిల్‌పై ఇప్పటికే పలు కేసులు ఉన్నాయి. రూ. 50 లక్షలు ఇవ్వాలని 2021లో కర్లపూడి బాబుప్రకాశ్‌ను బెదిరించిన కేసులో గుంటూరు పోలీసులు బోరుగడ్డను అరెస్టు చేశారు. గతేడాది మార్చి 31న బీజేపీ నేత, ప్రస్తుత మంత్రి సత్యకుమార్‌పై దాడి కేసులో అనిల్‌పై హత్యాయత్నం కేసు నమోదైంది. ఈ కేసులో మాజీ ఎంపీ నందిగం సురేశ్ ఏ1గా, బోరుడ్డ అనిల్ ఏ2గా ఉన్నారు. బోరుగడ్డ అనిల్ బెదిరింపులు, దాడులపై బాధితులు ఎవరైనా ఆధారాలతో ఫిర్యాదు చేస్తే కేసులు నమోదు చేస్తామని గుంటూరు జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్ తెలిపారు.

తదుపరి వ్యాసం