తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Apsrtc Special Services : అధ్యాత్మిక క్షేత్రాలకు ఆర్టీసి ప్రత్యేక సర్వీసులు

APSRTC Special Services : అధ్యాత్మిక క్షేత్రాలకు ఆర్టీసి ప్రత్యేక సర్వీసులు

HT Telugu Desk HT Telugu

10 October 2022, 13:38 IST

google News
    • APSRTC Special Services దసరా సీజన్‌లో ఏపీఎస్‌ఆర్టీసీకి భారీగా ఆదాయం రావడంతో వినూత్న ప్రయోగాలకు సిద్ధమవుతోంది. ఆర్టీసీ బస్సుల్లో  స్పెషల్ సర్వీస్‌ అదనపు ఛార్జీలను రద్దు చేయడంతో ఈ ఏడాది ఆర్టీసికి భారీగా ఆదాయం సమకూరింది. ఆర్టీసి బస్సులన్ని పండుగ సీజన్‌లో ఫుల్‌ అక్యుపెన్సీతో నడిచాయి. దీంతో ఇప్పుడు టెంపుల్‌ సర్వీస్ మొదలు పెట్టాలని ఆర్టీసి యోచిస్తోంది. 
ఏపీఎస్ ఆర్టీసీలో ఫలించిన ప్రయోగం
ఏపీఎస్ ఆర్టీసీలో ఫలించిన ప్రయోగం (Hindustan times)

ఏపీఎస్ ఆర్టీసీలో ఫలించిన ప్రయోగం

APSRTC Special Services ఏపీఎస్‌ ఆర్టీసీకి ఈ దసరా సీజన్‌లో భారీగా ఆదాయం సమకూరడంతో కొత్త ప్రయోగాలకు సిద్ధమవుతోంది. అదనపు రుసుములు రద్దు చేయడంతో ఆర్టీసి భారీగా ఆదాయం రావడంతో ఇప్పుడు పుణ్య క్షేత్రాలకు సాధారణ చార్జీలతోనే ప్రత్యేక బస్సులు నడిపేందుకు సిద్ధమవుతోంది.

ఇప్పటికే దక్షిణాదిలో పవిత్ర పుణ్యక్షేత్రంగా పేరొందిన అరుణాచలం (Thiruvannamalai)కి APSRTC ప్రత్యేక బస్సులను నడుపుతోంది. గతంలో ఏపీలోని పలు పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక పర్వదినాల్లో స్పెషల్‌ బస్సులు నడిపిన ఆర్టీసీ తొలిసారిగా అంతరాష్ట్ర పుణ్యక్షేత్రమైన అరుణా చలానికి ప్రత్యేక బస్సులు నడుపుతోంది.

ఆదివారం పౌర్ణమి దర్శనం, గిరి ప్రదక్షణల కోసం వివిధ ప్రాంతాల నుంచి పదకొండు ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నట్లు ఆర్టీసీ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఆర్టీసీలో స్పెషల్‌ బస్సుల్లో చార్జీపై 50శాతం అదనపు రుసుము వసూలు చేసేవారు. దసరా, సంక్రాంతి సీజన్‌లో ఈ సర్వీసుల్లో ప్రయాణాలకు టిక్కెట్ ధరపై 50శాతం అదనంగా వసూలు చేసేవారు. గత కొన్నేళ్లుగా వస్తున్న ఆనవాయితీకి ఆర్టీసీ ఈ ఏడాది చెక్‌ పెట్టింది. ప్రయోగా త్మకంగా సాధారణ బస్సు చార్జీలతోనే దసరా స్పెషల్స్‌ నడపడంతో పెద్ద ఎత్తున ప్రజల నుంచి ఆదరణ లభించింది.

గతంతో పోల్చితే దసరా ప్రత్యేక బస్సుల ద్వారా ఆర్టీసీకి రెట్టిం పు ఆదాయం లభించింది. స్పెషల్‌ బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో అనూహ్యంగా పెరిగింది. దీంతో ఈ విధానం కొనసాగించాలని ఎండీ తిరుమలరావు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎండీ ఆదేశాల నేపధ్యంలో ఈ నెల 7, 8, 9 తేదీల్లో కడప, ప్రొద్దు టూరు, జమ్మలమడుగు, పుంగ నూరు, నెల్లూరు, నరసరా వుపేట తదితర పట్టణాల నుంచి పదకొండు ప్రత్యేక సర్వీసు లను అరుణాచలానికి (Arunachalam) నడిపారు.

ఈ ప్రత్యేక సర్వీసులు పూర్తి సీటింగ్‌ సామర్థ్యంతో నడిచినట్లు గుర్తించారు. ఇకపై అరుణా చలానికి ఏపీలోని వేర్వేరు ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను పౌర్ణమి ముందు రోజు బయలు దేరేలా చర్యలు చేపట్టనున్నారు. అరుణాచలేశ్వరుని దర్శనంతో పాటు గిరి ప్రదిక్షణ ముగించుకొని రాత్రికి బయలుదేరి తిరిగి మరుసటి రోజు ఉదయం స్వస్థలానికి బస్సులు చేరుతాయి. ఆయా బస్సుల్లో కూడా సాధా రణ చార్జీలు వసూలు చేయ డం ద్వారా ఎక్కువ మంది సాధా రణ ప్రయాణికులు అరుణా చలేశ్వరుని దర్శనానికి వెళ్లే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.

ఏటా కార్తీక మాసంలో పంచారామాల సందర్శన కు ఆర్టీసీ ఏర్పాటు చేయనున్న బస్సుల్లో కూడా సాధారణ చార్జీల వసూలుకే అధికారులు నిర్ణయించారు. కోవిడ్‌ మహమ్మారి నష్టాల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆర్టీసీ అదనపు ఆదాయ మార్గాల అన్వేషణలో భాగంగా పలు సకొత్త నిర్ణయా లు తీసుకుంటోంది. ఇందులో భాగంగా భక్తుల విశ్వాసాలకు అనుగుణంగా ఆయా పర్వదినాల్లో సాధారణ చార్జీలతోనే ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. తద్వారా ఎక్కువ మంది ప్రయాణికులకు రవాణా కల్పించడంతో సంస్థకు లాభసాటిగా ఉంటుందని భావిస్తోంది.

టాపిక్

తదుపరి వ్యాసం