APSRTC Special Buses : ఏపీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్- పంచారామాలకు స్పెషల్ బస్ సర్వీసులు, ప్యాకేజీలు ఇవే
09 November 2024, 17:16 IST
APSRTC Special Buses : కార్తీక మాసాన్ని పురస్కరించుకుని పంచారామ క్షేత్రాలను కవర్ చేస్తూ ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు అందుబాటులోకి తెచ్చింది. రామచంద్రపురం, చిలకలూరిపేట, పాలకొండ నుంచి శైవక్షేత్రాలకు ప్రత్యేక సర్వీసులు అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఏపీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్- పంచారామాలకు స్పెషల్ బస్ సర్వీసులు, ప్యాకేజీలు ఇవే
భక్తులకు ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకొని రామచంద్రపురం, చిలకలూరిపేట, పాలకొండ నుంచి ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఏపీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. ప్రసిద్ధ శైవక్షేత్రాలైన పంచారామాలకు ప్రత్యేక సర్వీసులు, ప్యాకేజీలు అందుబాటులోకి తీసుకుకొచ్చారు. భక్తుల కోసం సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్, ఎక్స్‌ప్రెస్ బస్సులు నడుపుతున్నారు.
రామచంద్రాపురం నుంచి పంచారామ దర్శిని...ప్యాకేజీలు
ఈ బస్సులు కార్తీకమాసంలో ప్రతి ఆదివారం, సోమవారాల్లో రాత్రి రామచంద్రాపురం కాంప్లెక్స్ నుంచి బయలుదేరి పంచారామాలైన అమరావతి (అమరేశ్వరుడు), భీమవరం (సోమేశ్వరుడు), పాలకొల్లు (క్షీరరామలింగేశ్వరుడు), ద్రాక్షారామం (భీమేశ్వరుడు), సామర్లకోట (కొమర లింగేశ్వరుడు) పుణ్యక్షేత్రాలను కార్తిక సోమవారం, మంగళవారం నాడు దర్శనం పూర్తి చేసుకుంటారు. అనంతరం మళ్లీ తిరిగి సోమ, మంగళవారాల్లో రాత్రికి రామచంద్రాపురం కాంప్లెక్స్‌కు బస్సులు చేరుకుంటాయి. ఈ ప్రత్యేక సర్వీసులు నవంబర్ నెలలో ప్రతి ఆదివారం నవంబర్ 10, 11, 17, 18, 24, 25 తేదీల్లో అందుబాటులో ఉంటాయి.
టిక్కెట్టు ధర అల్ట్రా డీలక్స్, ఎక్స్‌ప్రెస్ సర్వీస్‌లకు వేర్వేరుగా ఉంటుంది. ఒక్కొక్కరికి టిక్కెట్టు ధర సూపర్ లగ్జరీ సర్వీస్‌కు రూ.1,170, అల్ట్రా డీలక్స్ సర్వీస్‌కు రూ.1,125, ఎక్స్‌ప్రెస్ సర్వీసుకు రూ.915గా నిర్ణయించారు. రిజర్వేషన్ టికెట్లను రామచంద్రాపురం బస్టాండ్, ఆన్‌లైన్‌లోనూ, టికెట్ల ఏజెంట్ల వద్ద ముందుగానే మీకు నచ్చిన సీటును రిజర్వేషన్ చేయించుకోవచ్చని రామచంద్రపురం డీఎం పేపకాయల భాస్కరరావు తెలిపారు. అదనపు సమచారం కోసం డిపో మేనేజర్ 9959225536, ట్రాఫిక్ ఏవీఎస్ నారాయణ 9493953838, బస్‌స్టేషన్ 73828925520, కంట్రోలర్ 7382910769 లను సంప్రదించాలని సూచించారు.
చిలకలూరిపేట నుంచి దర్శన ప్రాంతాలు...ప్యాకేజీలు
ఈ బస్సులు కార్తీకమాసంలో ప్రతి శనివారం, ఆదివారం రాత్రి 10 గంటకు చిలకలూరిపేట కాంప్లెక్స్ నుంచి బయలుదేరి పంచారామాలైన అమరావతి (అమరేశ్వరుడు), భీమవరం (సోమేశ్వరుడు), పాలకొల్లు (క్షీరరామలింగేశ్వరుడు), ద్రాక్షారామం (భీమేశ్వరుడు), సామర్లకోట (కొమర లింగేశ్వరుడు) పుణ్యక్షేత్రాలను కార్తిక ఆదివారం, సోమవారం నాడు దర్శనం పూర్తి చేసుకుంటారు. అనంతరం మళ్లీ తిరిగి ఆదివారం, సోమవారం రాత్రికి చిలకలూరిపేట కాంప్లెక్స్‌కు బస్సులు చేరుకుంటాయి.
టిక్కెట్టు ధర అల్ట్రా డీలక్స్, ఎక్స్‌ప్రెస్ సర్వీస్‌లకు వేర్వేరుగా ఉంటుంది. ఒక్కొక్కరికి అల్ట్రా డీలక్స్ టిక్కెట్టు ధర రూ.1,300, ఎక్స్‌ప్రెస్ సర్వీసుకు రూ.1,000గా నిర్ణయించారు. రిజర్వేషన్ టికెట్లను చిలకలూరిపేట బస్టాండ్, ఆన్‌లైన్‌లోనూ, టికెట్ల ఏజెంట్ల వద్ద ముందుగానే మీకు నచ్చిన సీటును రిజర్వేషన్ చేయించుకోవచ్చని పాలకొండ డీఎం ఎస్.రాంబాబు తెలిపారు. అదనపు సమచారం కోసం డిపో మేనేజర్ 9959225427, డిప్యూటీ మేనేజర్ 6303325113, జనరల్ ఏడీసీ 7382893037 లను సంప్రదించాలని సూచించారు.
పాలకొండ నుంచి దర్శన ప్రాంతాలు...ప్యాకేజీలు
ఈ బస్సులు కార్తీకమాసంలో ప్రతి ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు పాలకొండ కాంప్లెక్స్ నుంచి బయలుదేరి పంచారామాలైన అమరావతి (అమరేశ్వరుడు), భీమవరం (సోమేశ్వరుడు), పాలకొల్లు (క్షీరరామలింగేశ్వరుడు), ద్రాక్షారామం (భీమేశ్వరుడు), సామర్లకోట (కొమర లింగేశ్వరుడు) పుణ్యక్షేత్రాలను కార్తీక సోమవారం నాడు దర్శనం పూర్తి చేసుకుంటారు. అనంతరం మళ్లీ తిరిగి మంగళవారం ఉదయం పాలకొండ కాంప్లెక్స్‌కు బస్సులు చేరుకుంటాయి. ఈ ప్రత్యేక సర్వీసులు నవంబర్ నెలలో ప్రతి ఆదివారం నవంబర్ 10,17, 24 తేదీల్లో అందుబాటులో ఉంటాయి.
టిక్కెట్టు ధర అల్ట్రా డీలక్స్, ఎక్స్‌ప్రెస్ సర్వీస్‌లకు వేర్వేరుగా ఉంటుంది. ఒక్కొక్కరికి అల్ట్రా డీలక్స్ టిక్కెట్టు ధర రూ.2,500, ఎక్స్‌ప్రెస్ సర్వీసుకు రూ.2,200గా నిర్ణయించారు. రిజర్వేషన్ టికెట్లను పాలకొండ బస్టాండ్, ఆన్‌లైన్‌లోనూ, టికెట్ల ఏజెంట్ల వద్ద ముందుగానే మీకు నచ్చిన సీటును రిజర్వేషన్ చేయించుకోవచ్చని పాలకొండ డీఎం పి.వెంకటేశ్వరరావు తెలిపారు.
జగదీశ్వరరావు జరజాపు , హిందుస్తాన్ టైమ్స్ తెలుగు