తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Fibernet Scam : ఏపీ ఫైబర్ నెట్ స్కామ్‌లో డీఆర్ఐ కొరడా - వారిపై రూ.34 కోట్ల జరిమానా విధింపు

AP Fibernet Scam : ఏపీ ఫైబర్ నెట్ స్కామ్‌లో డీఆర్ఐ కొరడా - వారిపై రూ.34 కోట్ల జరిమానా విధింపు

06 December 2023, 7:06 IST

google News
    • AP Fibernet Scam Latest News:ఏపీ ఫైబర్ నెట్ స్కాంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. పన్ను ఎగ్గొట్టిన వారిపై ఏపీ డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటలిజెన్స్‌ చర్యలు తీసుకుంది. ఫాస్ట్‌లేన్‌ టెక్నాలజీస్‌కు రూ.34 కోట్ల జరిమానాను విధించింది.
ఏపీ ఫైబర్ నెట్ స్కాంలో కీలక పరిణామం
ఏపీ ఫైబర్ నెట్ స్కాంలో కీలక పరిణామం

ఏపీ ఫైబర్ నెట్ స్కాంలో కీలక పరిణామం

AP Fibernet Scam : ఏపీ ఫైబర్ నెట్ స్కామ్ కేసులో రాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) కొరడా ఝుళిపించింది. ఈ కేసులో పన్ను ఎగ్గొట్టారన్న ఆరోపణలపై ఫాస్ట్ లేన్ టెక్నాలజీస్ అనే కంపెనీకి ఏకంగా రూ.34.01 కోట్ల జరిమానాను విధించింది డీఆర్ఐ. జీఎస్టీ నిబంధనలను పట్టించుకోకుండా కొన్ని కంపెనీలు అవతవకలకు పాల్పడ్డాయని డీఆర్ఐ పేర్కొంది. జీఎస్టీ నిబంధనలను ఫాస్ట్‌లైన్‌ టెక్నాలజీస్‌ పూర్తిగా విస్మరించిందని… ఆధారాలను పరిశీలిస్తే రూ.10.81 కోట్ల పన్ను ఎగ్గొట్టినట్టు గుర్తించినట్లు డీఆర్ఐ ప్రకటించింది.

ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు కంపెనీ ఎలాంటి నిబంధనలు పాటించలేదని వివరించింది.ఫాస్ట్‌ లేన్‌ టెక్నాలజీస్‌ వెనక ఉన్నది టెరాసాఫ్ట్‌ కంపెనీ అని గుర్తించినట్లు తెలిపింది డీఆర్ఐ. ఫైబర్‌నెట్‌ నిధులను పక్కదారి పట్టించింది కూడా ఈ కంపెనీలే అని… విచారణలో ఫాస్ట్‌ లేన్‌ మాజీ ఎండీ విప్లవ్‌ కుమార్‌ పన్ను ఎగ్గొట్టినట్టు ఒప్పుకున్నట్లుగా అధికారులు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కేసు వ్యవహరంలో ప్రధాన నిందితుడిగా వేమూరి హరిప్రసాద్‌ని గుర్తించారని…. టెరాసాఫ్ట్‌ ఎండీ తుమ్మల గోపిచంద్‌ విజ్ఞప్తి మేరకే పాస్ట్‌లేన్‌ను ఏర్పాటు చేసినట్టు విప్లవ్‌ కుమార్‌ చెప్పారని వెల్లడించారు.

తదుపరి వ్యాసం