AP Budget 2024-25: రూ.2,94,427కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్ రూపకల్పన, శాఖల వారీగా కేటాయింపులు ఇవే…
11 November 2024, 11:01 IST
- AP Budget 2024-25: ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్‌ను రూ.2,94,427కోట్ల ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ శాసనసభలో ప్రవేశపెట్టారు. ఏపీలో ఇప్పటికే రెండు సార్లు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా పూర్తి స్థాయి బడ్జెట్‌ను నేడు సభలో ప్రవేశపెట్టారు.
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రతులను సీఎం, డిప్యూటీ సిఎంలకు అందిస్తున్న ఆర్థిక మంత్రి
AP Budget 2024-25: ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్‌ను రూ. 2.94లక్షల కోట్లతో అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఏపీ వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సభలో ప్రవేశపెట్టారు. బడ్జెట్‌లో రెవిన్యూ వ్యవయయం రూ.2,35, 916.99కోట్లుగా ఉంది.
బడ్జెట్‌లో మూల ధన వ్యయం రూ.32,712.84 కోట్లు కాగా రెవిన్యూ లోటును రూ.34,743.38కోట్లుగా ఉంది. ద్రవ్య లోటు రూ.68,742.65కోట్లుగా ఉంది. రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తిలో రెవిన్యూ లోటు 4.19శాతం, ద్రవ్యలోటు 2.12శాతం ఉంది.
2023-24 ఆర్థిక సంవత్సరంలో రెవిన్యూ వ్యయం రూ.2,12,450కోట్లు కాగా మూలధన వ్యయం రూ23,330కోట్లుగాఉంది. 2023 * 24లో రెవిన్యూ లోటు రూ.38,682కోట్లుగా ఉంది.
1.పర్యావరణం అటవీ శాస్త్ర సాంకేతిక శాఖకు రూ.687కోట్లను కేటాయించారు.
2.మాదక ద్రవ్యాల వినియోగ వ్యతిరేక టాస్క్‌ఫోర్స్‌లో 3172 యూనిట్లకు శిక్షణ ఇచ్చేందుకు పోలీస్ శాఖకు రూ.8,495కోట్లను కేటాయించారు.
3. పోలీస్ బలగాల ఆధునీకరణకు రూ.62కోట్లను కేటాయించారు. 13ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు.
4. పర్యాటక సాంస్కృతిక శాఖకు రూ.322కోట్ల కేటాయింపు
5. రోడ్లు భవనాల శాఖకుే రూ.9,554కోట్ల కేటాయింపు
6.రాజధానిలో మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.15వేల కోట్ల నిధులను కేంద్రం సహకారంతో సమీకరణ
7. ఇంధన శాఖకు రూ.8207కోట్ల కేటాయింపు
8. పరిశ్రమల శాఖకు రూ.3127 కోట్ల కేటాయింపు
9. జలవనరుల శాఖకు రూ.16,705కోట్ల కేటాయింపు
10. గృహ నిర్మాణ రంగానికి రూ.4102 కోట్ల కేటాయింపు
11. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు రూ.11,490కోట్లను కేటాయించారు.
12. పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి వాఖలకు రూ.16,739కోట్లను కేటాయించారు.
13. వైద్య ఆరోగ్య శాఖకు రూ.18,421 కోట్లను కేటాయించారు.
14. ఉన్నత విద్యాశాఖకు రూ.2,326 కోట్ల కేటాయింపు
15. పాఠశాల విద్యాశాఖకు రూ.29,909 కోట్ల కేటాయింపు
16. స్కిల్ డెవలప్‌బమెంట్ కోసం రూ.1215కోట్ల కేటాయింపు
17. మహిళా, స్త్రీ శిశు సంక్షేమ శాఖకు రూ.4,285కోట్ల కేటాయింపు
18. షెడ్యూల్ కులాల సంక్షేమం కోపం రూ.18,497కోట్లు, షెడ్యూల్ తెగల కోసం రూ.7557కోట్లు, బీసీ సంక్షేమానికి రూ.39,007కోట్లు, అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమానికి రూ.4376కోట్లు కేటాయించారు.
19.వ్యవసాయం అనుబంధ రంగాలకు రూ.11,855కోట్లను కేటాయించారు.