APPSC Departmental Tests : డిపార్ట్మెంటల్ టెస్ట్‌లకు ఏపీపీఎస్‌సీ నోటిఫికేషన్ - డిసెంబర్ 18 నుంచి పరీక్షలు
09 November 2024, 6:38 IST
- డిపార్ట్‌మెంటల్ టెస్టుల నిర్వహణకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. నవంబర్ 13 నుంచి డిసెంబర్ 3 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాలి. దరఖాస్తు చేసుకునేవారు రూ. 500 చెల్లించాలి.
డిపార్ట్‌మెంటల్ టెస్టులు - ఏపీపీఎస్సీ నోటిఫికేషన్
ప్రభుత్వ ఉద్యోగులకు, సిబ్బందికి నిర్వహించే డిపార్ట్‌మెంటల్ టెస్టుల నిర్వహణకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్‌సీ) సన్నద్ధం అయింది. ఈ మేరకు డిపార్ట్‌మెంటల్ టెస్టులు నిర్వహించేందుకు ఏపీపీఎస్‌సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. నవంబర్ 13 నుంచి డిసెంబర్ 3 వరకు దరఖాస్తు దాఖలు చేసుకునేందుకు గడువు విధించింది. డిసెంబర్ 18 నుంచి డిసెంబర్ 23 వరకు డిపార్ట్‌మెంటల్ టెస్టులు నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొంది.
దరఖాస్తు దాఖలు ఎలా చేయాలి..?
దరఖాస్తులను ఆన్‌లైన్‌లో దాఖలు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తును అధికారిక వెబ్‌సైట్ https://psc.ap.gov.in లో దాఖలు చేయాలి. ఫీజు చెల్లించడానికి గడువు డిసెంబర్ 3 రాత్రి 11ః59 వరకు ఇచ్చినట్లు ఏపీపీఎస్‌సీ సెక్రటరీ ప్రదీప్ కుమార్ తెలిపారు.
1. దరఖాస్తుదారులు ప్రాథమికంగా వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ (వోటీపీఆర్)ని ఏపీపీఎస్‌సీ వెబ్‌సైట్ https://psc.ap.gov.in లో నమోదు చేసుకోవాలి. దరఖాస్తుదారు వివరాలను నమోదు చేసిన తరువాత, వినియోగదారు ఐడీ రూపొందుతుంది. రిజిస్ట్రర్ మొబైల్ నంబర్, ఈ మెయిల్ ఐడీకి ఐడీ వస్తుంది. దరఖాస్తుదారులు ఏపీపీఎస్‌సీ వెబ్‌సైట్ ద్వారా వోటీపీఆర్ వినియోగదారు ఐడీని ఉపయోగించి డిపార్టమెంటల్ టెస్ట్‌ల కోసం దరఖాస్తు చేసుకోవాలి.
2. దరఖాస్తుదారు గత డిపార్టమెంటల్ టెస్ట్‌ల కోసం ఇంతకు ముందు వోటీపీఆర్‌ని రూపొందిస్తే, అదే ఐడీ నెంబర్‌ను ఉపయోగించి నేరుగా దరఖాస్తు చేసుకోవవచ్చు. వారి దరఖాస్తులో కొత్త 26 జిల్లాల ప్రకారం వారి జిల్లాను అప్‌డేట్ చేయాలి.
3. అప్లికేషన్ నవంబర్ 13 నుండి ఏపీపీఎస్‌సీ వెబ్‌సైట్‌లో అందుబాటు ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తు చేయడానికి చివరి తేదీ డిసెంబర్ 3. అలాగే ఫీజు చెల్లించాడానికి డిసెంబర్ 3 రాత్రి 11ః59 గంటల గడువు ఉంది.
4. చేతితో రాసిన, టైప్ చేసిన, ఫోటోస్టాట్ కాపీలు, వెలుపల ముద్రించిన దరఖాస్తులను అంగీకరించరు. తిరస్కరిస్తారు.
5. డిపార్టమెంటల్ టెస్ట్ రూల్స్1996 నిబంధనలు, షరతులు, సవరించిన షరతులకు అనుగుణంగా ఈ పరీక్షలు నిర్వహిస్తారు.
పరీక్షల ప్రక్రియ
1. లాంగ్వేజ్, సర్వే పరీక్షలు మినహా అన్ని పరీఓలు ఆబ్జెక్టివ్ టైప్‌లో ఉంటాయి.
2. లాంగ్వేజ్ టెస్ట్ పేపర్లు (P.C.Nos.5, 6, 7, 19, 28, 36,49, 67,37, 58, 74) మరియు సర్వే &
సెటిల్మెంట్ పేపర్లు (P.C.Nos.69, 87, 109, 111, 116, 118, 120, 122, 133, 135, 161 and 162,) సాంప్రదాయ మోడ్‌లో ఉంటాయి.
3. అన్ని ఆబ్జెక్టివ్ టైప్ పేపర్లు కంప్యూటర్ బేస్డ్ డిపార్ట్మెంటల్ టెస్ట్‌లలో నిర్వహిస్తారు. ఈ కంప్యూటర్ ఆధారిత పరీక్షకు సంబంధించిన సూచనలు ఈ అధికారిక లింక్‌లోని మాన్యువల్‌లో https://psc.ap.gov.in/Documents/NotificationDocuments/ANNEXURE_I_172024_07112024.pdf వివరించారు.
4. ఆబ్జెక్టివ్ టైప్ పేపర్‌లకు హాజరయ్యే అభ్యర్థులు కంప్యూటర్ ఆధారిత పరీక్షలతో పరిచయం పొందడానికి కమిషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న మాక్‌టెస్ట్ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు.
5. సంప్రదాయ పేపర్‌లకు (డిస్ట్కిప్టివ్ ఎగ్జామ్) హాజరయ్యే అభ్యర్థులకు బ్లూ లేదా బ్లాక్ పెన్‌తో సమాధానం ఇవ్వడానికి బార్ కోడ్ షీట్ జత చేసి జవాబు పుస్తకాలు అందిస్తారు.
6. పరీక్షలకు సంబంధించిన టైమ్ టేబుల్ ఈ అధికారిక లింక్‌లో https://psc.ap.gov.in/Documents/NotificationDocuments/ANNEXURE_II_172024_07112024.pdf ఉంటుంది.
7. పరీక్షలకు సంబంధించిన సిలబస్ ఈ అధికారిక లింక్‌లో https://psc.ap.gov.in/Documents/NotificationDocuments/ANNEXURE_III_172024_07112024.pdf ఉంటుంది.
పరీక్షలు…
1. ఆబ్జెక్టివ్ టైప్ పేపర్లః పరీక్ష వ్యవధి 2 గంటలు (120 నిమిషాలు) ఉంటుంది. పరీక్షా సమయం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. అలాగే మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది.
2. సంప్రదాయ టైప్ పేపర్లః పరీక్ష వ్యవధి 3 గంటలు (180 నిమిషాలు) ఉంటుంది. పరీక్షా సమయం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుంది. అలాగే మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది.
పరీక్ష ఫీజు…
1. ఒక్కో పేపర్‌కి ఫీజు రూ.500 ఉంటుంది.
2. దరఖాస్తుదారు ఫీజు రూ.500 ఉంటుంది.
3. ఒక పేపర్‌కు మొత్తం ఫీజు రూ.1,000 ఉంటుంది.
ఒకటి కంటే ఎక్కువ పేపర్‌లకు హాజరైనట్లయితే, ప్రతి పేపర్‌కు రూ.500, అప్లికేషన్ ప్రాసెసింగ్ కోసం రూ.500 కలిపి చెల్లించాల్సి ఉంటుంది.
అర్హులు….
1. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ సంబంధిత డిపార్ట్‌మెంటల్ సర్వీస్ రూల్స్‌లో నిర్దేశించిన టెస్ట్‌లకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
2. సచివాలయ ఉద్యోగులు ఇతర సేవలకు బదిలీ, ప్రమోషన్ ద్వారా నియామకానికి అర్హత పొందేందుకు నియమాలు అనుమతించిన చోట ఈ పరీక్షలకు హాజరుకావడానికి అనుమతించబడతారు.
3. వాణిజ్య పన్నుల శాఖ
4. ట్రెజరీలు, ఖాతాల విభాగం
5. ఫైనాన్స్ అండ్ ప్లానింగ్
6. సెరికల్చర్ విభాగం
7. గనులు అండ్ భూగర్భ విభాగం
8. వర్క్ అకౌంట్స్ సర్వీస్
9. వర్క్‌షాప్ అధికారులు
10. ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్
11. సాంఘిక సంక్షేమ శాఖ
12. ఆరోగ్య అండ్ కుటుంబ సంక్షేమ శాఖ
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.