APPSC DEO Screening Key: ఏపీపీఎస్సీ డీఈఓ స్క్రీనింగ్ పరీక్ష - కీ విడుదల, ఆన్‌లైన్‌లో అందుబాటులో…
29 May 2024, 10:01 IST
- APPSC DEO Screening Key: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ స్క్రీనింగ్ పరీక్ష కీను కమిషన్ విడుదల చేసింది.
ఏపీపీఎస్సీ డీఈఓ స్క్రీనింగ్ కీ విడుదల
APPSC DEO Recruitment 2023 : ఏపీపీఎస్సీ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ స్క్రీనింగ్ పరీక్ష కీ విడుదలైంది. కొద్ది రోజుల క్రితం ఏపీపీఎస్సీ డీఈఓ స్క్రీనింగ్ పరీక్షను ఆన్‌లైన్ పద్ధతిలో నిర్వహించారు. జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ విభాగంలో 150 మార్కులకు కంప్యూటర్ బేేస్డ్ పరీక్ష నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో ఉద్యోగ నియామకాల్లో భాగంగా 38 డీఈవో ఉద్యోగాల భర్తీకి ప్రకటనను గత డిసెంబర్‌లో విడుదల చేసింది. జనవరి 9వ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరించారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీలో 38 డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ (DEO) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. జనవరి 9 నుంచి దరఖాస్తులు ప్రారంభమై 29వ తేదీతో ముగిశాయి.పీజీ డిగ్రీతో పాట, బీఈడీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులుగా ప్రకటించారు.
ముఖ్య వివరాలు:
ఉద్యోగ ప్రకటన - ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
ఉద్యోగాలు - డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ (DEO)
మొత్తం ఖాళీలు - 38
అర్హతలు - పీజీ డిగ్రీతోపాటు, బీఈడీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అవుతారు.
జోన్లవారీగా ఖాళీలు - జోన్-1: 07 పోస్టులు, జోన్-2: 12 పోస్టులు, జోన్-3: 08 పోస్టులు, జోన్- 4: 11 పోస్టులు ఉన్నాయి.
వయోపరిమితి - 01.07.2023 నాటికి 18-42 సంవత్సరాల మధ్య ఉండాలి. పలు వర్గాల వారికి మినహాయింపులు ఉన్నాయి.
దరఖాస్తులు- ఆన్‌లైన్
దరఖాస్తులు ప్రారంభం -జనవరి 9, 2023
దరఖాస్తులకు తుది గడువు - జనవరి 29, 2024.
దరఖాస్తు రుసుం - అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు రూ.250, పరీక్ష ఫీజు రూ.120 చెల్లించాలి.
ఎంపిక విధానం - స్క్రీనింగ్, మెయిన్ పరీక్షలు ఉంటాయి. కంప్యూటర్ ప్రొఫీషియన్సీ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
స్క్రీనింగ్ పరీక్ష తేది: 13.04.2024.
ఏపీలోని పలు ప్రాంతాల్లో స్క్రీనింగ్ పరీక్షల్ని నిర్వహించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలులో కంప్యూటర్ బేస్డ్ పరీక్షను ఏపీపీఎస్సీ నిర్వహించింది.
అధికారిక వెబ్ సైట్ - https://psc.ap.gov.in/
ఏప్రిల్ 13న జరిగిన స్క్రీనింగ్ పరీక్ష కీను మంగళవారం ఏపీపీఎస్సీ విడుదల చేసింది. ఈ లింకు ద్వారా కీను పరిశీలించవచ్చు.
ఏపీపీఎస్సీ డీఈఓ పరీక్షల కోసం నిర్వహించిన ప్రాథమిక పరీక్షను 150మార్కులకు నిర్వహించారు. ప్రతి తప్పు సమాధానానికి 0.33 మార్కులను కోత విధిస్తారు. మొత్తం సరైన సమాధానాలకు వచ్చిన మార్కులతో పాటు మూడు తప్పు సమాధానాలకు ఒక మార్కును కోల్పోవాల్సి ఉంటుంది.