తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Govt Employees: మా డబ్బులివ్వడండి.. ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్.. రూ.7500కోట్లకు చేరిన ఉద్యోగుల బకాయిలు!

AP Govt Employees: మా డబ్బులివ్వడండి.. ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్.. రూ.7500కోట్లకు చేరిన ఉద్యోగుల బకాయిలు!

Sarath chandra.B HT Telugu

05 February 2024, 6:55 IST

google News
    • AP Govt Employees:రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు వెంటనే విడుదల చేయాలని ఏపీజేఏసీ అమరావతి డిమాండ్ చేసింది. ఉద్యోగులకు ప్రభుత్వం దాదాపు రూ.7500కోట్లు బాకీ పడిందని ఆరోపించారు. 
ఏపీజేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు
ఏపీజేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు

ఏపీజేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు

AP Govt Employees: కుటుంబ అవసరాల కోసం దాచుకున్న డబ్బులు, జీతంతో పాటు రావాల్సిన డిఏలు, సరెండర్ లీవులు, పిఆర్సీ బకాయిలు, పదవీ విరమణ తర్వాత వచ్చే బకాయిలను చెల్లిస్తుందని ఉద్యోగులంతా ఆశగా ఎదురు చూస్తున్నా ఫలితం లేకుండా పోయిందని ఏపీజేఏసీ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.

12 వ పిఆర్శి కమిషన్ ప్రకటించి ఎనిమిది నెలలు గడుస్తున్నా దాని ఛైర్మన్ కు కనీసం సీటులేదని,సిబ్బంది కేటాయింపు లేదని జేఏసీ నేతలు ఆరోపించారు. ఏపిజేఏసి అమరావతి రాష్ట్ర కమిటి సమావేశంలో ప్రభుత్వ తీరుపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

26 జిల్లాలనుండి హాజరైన ఉద్యోగ సంఘాల నాయకులంతా ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు విషయంలో జాప్యం చేస్తుందని, తద్వారా ఉద్యోగులు తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

రేయింబవళ్ళు కష్టపడే పోలీసులకు రెండు సంవత్సరాలుగా కనీసం సరెండర్ లీవులు కూడా చెల్లించడం లేదని, ప్రస్తుత పరిస్థితులు ఉద్యోగులు అర్థం చేసుకుని, ఓపికతో, సహనంతో, నమ్మకంతో చెల్లింపుల కోసం వేచి చూస్తున్నారని వారికి ఇవ్వాల్సిన ఆర్ధిక ప్రయోజనాల విషయంలో మాత్రం ప్రభుత్వం తాత్సారం చేస్తోందని ఆరోపిస్తున్నారు.

ఆర్ధిక సమస్యల పరిష్కారానికి ఉద్యోగ సంఘాలకు రెండేళ్ల క్రితం ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని, పూర్తి స్థాయిలో అమలుకాని ఎంప్లాయీస్ హెల్త్ స్కీంతో పెన్షనర్లు/ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు.

ఉద్యోగుల సమస్యలపై ఉద్యోగసంఘాలు గత 2022 ఫిబ్రవరి లో ఉద్యమించినపుడు ముఖ్యమంత్రి, ప్రభుత్వ పెద్దలు, ప్రభుత్వ ఉన్నతాధికార్లు సమక్షంలో అంగీకరించిన సమస్యల పరిష్కారంలో కూడా జాప్యం చేస్తున్నారని ఆరోపించారు.

ఉద్యోగులతో పాటు పెన్షనర్లుకు చెల్లించాల్సిన బకాయిలు కూడా ఇంతవరకు చెల్లించక పోవడం దారుణమని, ప్రభుత్వం ఇచ్చిన GO లు ఇచ్ఛిమ హామిలే అమలు కాకపోతే భవిష్యత్ లో ఉద్యోగులు, పెన్షనర్లు ఎవరికి చెప్పుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు కొత్తకొత్త డిమాండ్లు ఏమి చేయడం లేదని ప్రభుత్వపెద్దలు,ఉన్నతాధికార్లు చర్చలు సందర్భంగా ఇచ్చిన హామిలనే అమలు చేయాలని కోరారు. ప్రభుత్వం ఇచ్చిన హామిలు, బకాయిలు చెల్లింపుల కోసం, పెండింగు సమస్యలు పరిష్కారం కొరకు ఉన్నతస్దాయిలో తక్షణమే ఉద్యోగ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యలు తక్షణమే పరిష్కరించి ఉద్యోగులు, పెన్షనర్ల లో ఉన్న ఆందోళనను తొలగించాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వ ఉద్యోగులు వారి పిల్లలు చదువులు, పెళ్లిళ్లు, వైద్యం తదితర కుటుంబ అవసరాల కోసం ప్రభుత్వం దగ్గర దాచుకున్న జీ.పీ.యఫ్/ఏ.పి.జి.యల్.ఐ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వంటి ప్రయోజనాలకు సంబంధించిన వేల కోట్ల బకాయిలు 2022 ఏప్రిల్ నాటికి చెల్లిస్తామని చెప్పినా నేటికి విడుదల కాలేదని ఆరోపించారు.

డి.ఏ బకాయిలు, సరండర్ లీవులు 2023 సెప్టెంబర్ నెలలో చెల్లింపులు చేస్తామన్నారని వాటికి కూడా ఎలాంటి చెల్లింపులు చేయలేదని, డబ్బులు ఇవ్వక పోవడంతో ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్రమైన అవేదనతో ఉన్నారని, కనీసం సమాధానం చెప్పే పరిస్థితి కూడా ప్రభుత్వంలో లేకపోవడం దారుణమన్నారు.

చర్చల సందర్బంగా ప్రభుత్వం ఉద్యోగ సంఘాలకు ఇచ్చిన హామీ మేరకు, ప్రభుత్వం ఉద్యోగులకు, పెన్షనర్లకు చెల్లించాల్సిన మొత్తం సూమారు 7,500 కోట్ల రూపాయలు వెంటనే చెల్లించాలని ఏకగ్రీవంగా తీర్మానించారు.sa

తదుపరి వ్యాసం