AP SSC 10 Results 2024 : ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదల - బాలికలదే పై చేయి
22 April 2024, 15:47 IST
- AP SSC Results 2024 Live News Updates : ఇవాళ ఉదయం 11 గంటలకు ఏపీ పదో తరగతి ఫలితాలు (AP SSC Results) విడుదల అయ్యాయి. ఈసారి 86.69 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈ ఫలితాలను HT తెలుగుతో పాటు ఏపీ SSC బోర్డు వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు. తాజా లైవ్ అప్డేట్స్ కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి….
17 స్కూల్స్ జీరో పాస్ పర్సెంటెజ్
రాష్ట్రంలో నూటికి నూరు శాతం ఉత్తీర్ణత(100 Percent Pass Schools) సాధించి కొన్ని పాఠశాలలు రికార్డు సృష్టించాయి. మొత్తం 2,803 పాఠశాల్లో 100 శాతం ఉత్తీర్ణత నమోదయ్యింది. 17 పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా పాస్ కాలేదు. అంటే జీరో (Zero Pass percent Schools)ఉత్తీర్ణత శాతం వచ్చింది. ఈ 17 స్కూళ్లలో 16 ప్రైవేట్ స్కూల్స్(Private Schools) ఉండగా.. మిగిలిన ఒకటి ప్రభుత్వ పాఠశాల కావడం విశేషం.
ఏపీ మేనేజ్మెంట్ స్కూల్స్ ఉత్తీర్ణత శాతాలు
ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్- 98.43
ఏపీ బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్- 98.43
ఏపీ ప్రైవేట్ అన్ ఎయిడెడ్ స్కూల్స్- 96.72
ఏపీ సోషల్ వెల్ఫేర్ స్కూల్స్- 94.56
ఏపీ మోడల్ స్కూల్స్- 92.88
ఏపీ ఆశ్రమ పాఠశాలలు-90.13
ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్- 89.64
ఏపీ కస్తూర్బా బాలిక పాఠశాలలు- 88.96
ఏపీ ప్రైవేట్ ఎయిడెడ్ స్కూల్స్- 80.01
ఏపీ మున్సిపల్ స్కూల్స్ -75.42
ఏపీ గవర్నమెంట్ హైస్కూల్స్- 74.40
ఏపీ జిల్లా పరిషత్ హైస్కూల్స్- 73.38
మే 24 నుంచి జూన్ 3 వరకు సప్లిమెంటరీ
ఏపీ పదో తరగతి ఫలితాల్లో 69.26 శాతం మంది ఫస్ట్ క్లాస్‌లో పాస్ కాగా, 11.87 శాతం సెకండ్ క్లాస్, 5.56 శాతం మంది థర్డ్ క్లాస్‌లో సాధించారు. మే 24 నుంచి జూన్ 3 వరకు పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు(AP SSC Supplementary Exams ) నిర్వహించనున్నారు. రేపటి(ఏప్రిల్ 23) నుంచి రీవాల్యుయేషన్, రీకౌంటింగ్ అప్లికేషన్లు స్వీకరించనున్నారు. మరో 4 రోజుల్లో ఎస్ఎస్.సి వెబ్‌సైట్ నుంచి టెన్త్ మెమోలు డౌన్‌లోడ్ చేసుకునేందుకు అవకాశం కల్పించనున్నారు.
ఏపీ టెన్త్ రిజల్ట్స్ డైరెక్ట్ లింక్….
ఏపీ టెన్త్ రిజల్ట్స్ ను హెచ్ టీ తెలుగులో సింగిల్ క్లిక్ తోనే చెక్ చేసుకోవచ్చు…..
బాలికలదే పైచేయి
ఈసారి మొత్తం 6.23 లక్షల మంది విద్యార్థుల టెన్త్ పరీక్షలు పరీక్షలు రాశారు టెన్త్ ఫలితాల్లో బాలికలదే పైచేయిగా నిలిచింది. బాలుర ఉత్తీర్ణత శాతం 84.32, బాలికల ఉత్తీర్ణత శాతం 89.17గా ఉంది. మొత్తంగా 86.69 శాతం మంది విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణులు అయ్యారు. ఫలితాల్లో పార్వతీపురం మన్యం జిల్లా టాప్‌గా నిలిచింది.
ఏపీ టెన్త్ రిజల్ట్స్ - HT తెలుగు డైరెక్ట్ లింక్
మీ రూల్ నెంబర్ ను ఎంట్రీ చేసి చెక్ రిజల్ట్ పై క్లిక్ చేస్తే మీ ఫలితాలు డిస్ ప్లే అవుతాయి.
ఏపీ పదో తరగతి ఫలితాల్లో టాప్ టెన్ జిల్లాలు
మన్యం జిల్లా - 96.37
శ్రీకాకుళం - 93.35
వైఎస్ఆర్ కడప- 92.10
కోనసీమ జిల్లా - 91.88
విజయనగరం - 91.82
చిత్తూరు -91.28
ప్రకాశం-91.21
విశాఖపట్నం-91.15
అల్లూరి సీతారామరాజు జిల్లా- 90. 95
తిరుపతి - 90.71
4 రోజుల్లో షార్ట్ మెమోలు….
ఫలితాలు ప్రకటించిన నాలుగు రోజుల్లో టెన్త్ షార్ట్ మెమోలను వెబ్ సైట్ లో ఉంచుతామని ఏపీ విద్యాశాఖ కమిషనర్ ప్రకటించారు. పాఠశాలకు వెళ్లకుండానే… నేరుగా వెబ్ సైట్ నుంచి వీటిని పొందవచ్చని స్పష్టం చేశారు. నిర్ణీత సమయంలోనే అన్ని రకాల సర్టిఫికెట్లను అందజేస్తామని తెలిపారు. పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు ఒత్తిడికి గురి కావొద్దని సూచించారు. మళ్లీ పరీక్షలు రాసుకొవచ్చన్నారు. కానీ క్షణికావేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దని విద్యార్థులను కోరారు.
ఏపీ టెన్త్ ఫలితాలు - HT తెలుగు డైరెక్ట్ లింక్
HT తెలుగు డైరెక్ట్ లింక్ తో పదో తరగతి ఫలితాలను క్షణాల్లోనే తెలుసుకోవచ్చు. ఒకే ఒక్క క్లిక్ తో మీ రిజల్ట్స్ డిస్ ప్లే అవుతాయి.
సప్లిమెంటరీ పరీక్షల ముఖ్య తేదీలివే
మే 24వ తేదీ నుంచి ఏపీ పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు(Ap SSC Supplementary Exams) జరుగుతాయని విద్యాశాఖ కమిషనర్ సురేశ్ కుమార్ ప్రకటించారు. జూన్ 3వ తేదీ వరకు ఈ ఎగ్జామ్స్ కొనసాగుతాయని వెల్లడించారు. సప్లిమెంటరీ పరీక్షల ఫీజుతో పాటు రీవాల్యూయేషన్, రీవెరిఫికేషన్ కోరే విద్యార్థులు ఏప్రిల్ 23వ తేదీ నుంచే ఫీజులు చెల్లించుకోవచ్చని సూచించారు. ఏప్రిల్ 30వ తేదీతో ఈ గడువు ముగుస్తుందని వివరించారు. ఆలస్య రుసుముతో మే 23వ తేదీ వరకు ఫీజును చెల్లించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.
డైరెక్ట్ లింక్
ఏపీ టెన్త్ ఫలితాలను ఈ డైరెక్ట్ లింక్ తో చెక్ చేసుకోండి
మే 24 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు
మే 24 నుంచి జూన్ 3 ఏపీ టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. రేపట్నుంచి రీవాల్యుయేషన్ దరఖాస్తులను స్వీకరించనున్నారు.
చివరి ప్లేస్ లో కర్నూలు జిల్లా
ఈసారి అత్యధిక ఉత్తీర్ణత సాధించిన జిల్లాల్లో పార్వతీపురం మన్యం జిల్లా మొదటి ప్లేస్ లో నిలిచింది.96.3 శాతం ఉత్తీర్ణతో టాప్ ప్లేస్ లో నిలిచినట్లు ఏపీ విద్యాశాఖ కమిషనర్ వెల్లడించారు. పరీక్ష రాసిన మొత్తం విద్యార్థుల్లో 86.69శాతం పాస్ అయ్యారని పేర్కొన్నారు. ఇందులో బాలురు 84.32, బాలికలు 89.17 ఉత్తీర్ణులు అయ్యారని వివరించారు. 2803 స్కూల్స్ 100 శాతం ఉత్తీర్ణత సాధించాయని ప్రకటించారు. 17స్కూల్స్ లో సున్నా శాతం ఉత్తీర్ణత నమోదైందని చెప్పారు. కర్నూల్ జిల్లా 62.47శాతం తో చివరి స్థానంలో నిలిచింది.
96.3 శాతంతో మన్యం జిల్లా టాప్
ఏపీ టెన్త్ ఫలితాల్లో 96.3 శాతంతో పార్వతీపురం మన్యం జిల్లా టాప్ ప్లేస్ లో నిలిచింది.
ఏపీ టెన్త్ ఫలితాల డైరెక్ట్ లింక్
ఏపీ టెన్త్ ఫలితాలను ఈ డైరెక్ట్ లింక్ తో సింపుల్ గా చెక్ చేసుకోవచ్చు
టాప్ లో మన్యం జిల్లా
ఈసారి టెన్త్ ఫలితాల్లో మన్యం జిల్లా టాప్ ప్లేస్ లో ఉండగా.. చివరి ప్లేస్ లో కర్నూలు జిల్లా ఉంది.
6.18 లక్షల మంది విద్యార్థులు
ఈ ఏడాది 6.18 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాసినట్లు ఏపీ విద్యాశాఖ కమిషనర్ వెల్లడించారు.
ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదల
ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఉదయం 11 గంటలకు విద్యాశాఖ అధికారులు ఫలితాలను ప్రకటించారు.
మరికొద్ది నిమిషాల్లో ఏపీ టెన్త్ ఫలితాలు
మరికొద్ది నిమిషాల్లో ఏపీ టెన్త్ ఫలితాలు విడుదల కానున్నాయి. 6 లక్షల మందికిపైగా విద్యార్థుల ఫలితాలను ప్రకటించనున్నారు.
How To Check AP 10th Results 2024 : ఇలా చెక్ చేసుకోండి
-ఏపీ పదో తరగతి ఫలితాలు పరీక్షలు రాసిన విద్యార్థులు https://telugu.hindustantimes.com/andhra-pradesh-board-result లింక్ పై క్లిక్ చేసి వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
-ఇక్కడ ఆంధ్ర ప్రదేశ్ ఎస్ఎస్‌సి పదో తరగతి రిజల్ట్ 2024 ( https://telugu.hindustantimes.com/andhra-pradesh-ap-ssc-10th-result-2024 ) లింక్ పై క్లిక్ చేయాలి.
-మీ రూల్ నెంబర్ ను ఎంట్రీ చేసి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేస్తే మీ ఫలితాలు డిస్ ప్లే అవుతాయి.
ఏపీ టెన్త్ రిజల్ట్స్ - HT తెలుగు డైరెక్ట్ లింక్ ఇదే
HT తెలుగు లింక్ తో క్షణాల వ్యవధిలోనే ఏపీ పదో తరగతి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
మరికాసేపట్లో ఫలితాలు
మరికాసేపట్లో ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ మేరకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఏపీ విద్యాశాఖ కమిషనర్ సురేశ్ కుమార్ ఫలితాల వివరాలను వెల్లడించనున్నారు.
11.30 గంటలకు ఏపీ టెన్త్ ఫలితాలు
ఏపీ పదో తరగతి ఫలితాలు ఉదయం 11.30 గంటలకు విడుదల కానున్నట్లు తెలిసింది. ముందుగా ప్రకటించిన సమయం కంటే అరగంటపాటు ఆలస్యంగా రానున్నాయి.
ఈసారి ఎక్కువే…!
2023లో ఏపీలో జరిగిన పదో తరగతి పరీక్షలకు 6,03,700 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈసారి 6,23,092 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. గతేడాదితో పోల్చితే ఈసారి పరీక్ష రాసిన విద్యార్థుల సంఖ్య ఎక్కువ.
మరో గంటలో ఏపీ టెన్త్ ఫలితాలు
మరో గంటలో ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదల కాబోతున్నాయి. 11 గంటలకు ఏపీ విద్యాశాఖ కమిషన్ ఫలితాలను వెల్లడించనున్నారు.
HT తెలుగులో ఏపీ టెన్త్ రిజల్ట్స్
- పరీక్షలు రాసిన విద్యార్థులు https://telugu.hindustantimes.com/andhra-pradesh-board-result లింక్ పై క్లిక్ చేసి వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- ఇక్కడ ఆంధ్ర ప్రదేశ్ ఎస్ఎస్‌సి పదో తరగతి రిజల్ట్ 2024 ( https://telugu.hindustantimes.com/andhra-pradesh-ap-ssc-10th-result-2024 ) లింక్ పై క్లిక్ చేయాలి.
- మీ రూల్ నెంబర్ ను ఎంట్రీ చేసి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేస్తే మీ ఫలితాలు డిస్ ప్లే అవుతాయి.
- ప్రింట్ ఆప్షన్ పై క్లిక్ చేసి ఫలితాల కాపీని పొందవచ్చు.
డైరెక్ట్ లింక్
ఈ డైరెక్ట్ లింక్ తో ఏపీ పదో తరగతి ఫలితాలను క్షణాల్లోనే తెలుసుకోవచ్చు. మీ రూల్ నెంబర్ ను ఎంట్రీ చేసి చెక్ రిజల్ట్ పై క్లిక్ చేస్తే ఫలితాలు డిస్ ప్లే అవుతాయి.
గతేడాది 72.26 శాతం ఉత్తీర్ణత
గతేడాది ఫలితాలను చూస్తే… పదో తరగతి పరీక్షల్లో 72.26 శాతం ఉత్తీర్ణత నమోదు అయ్యింది. ఫలితాల్లో బాలురు 69.27 శాతం, బాలికలు 75.38 శాతం ఉత్తీర్ణత సాధించారు. టెన్త్ పరీక్షల్లో బాలికలే పైచేయి సాధించారు.
మే ఫస్ట్ వీక్ లో తెలంగాణ ఫలితాలు..!
త్వరలోనే తెలంగాణ పదో తరగతి ఫలితాలు కూడా వచ్చే అవకాశం ఉంది. మే ఫస్ట్ వీక్ లో వచ్చే అవకాశం ఉందని సమాచారం.
సర్వం సిద్ధం…
పదోతరగతి పరీక్షల ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది. ఇవాళ విజయవాడలో ఉదయం 11 గంటలకు ఏపీ విద్యా కమిషనర్ సురేశ్‌కుమార్ ఫలితాలను ప్రకటిస్తారు.
ఏపీ టెన్త్ రిజల్ట్స్ డైరెక్ట్ లింక్
పదోతరగతి పరీక్షల ఫలితాలు సోమవారం విడుదల కానున్నాయి. ఈ ఫలితాలను విజయవాడలో ఉదయం 11 గంటలకు విద్యా కమిషనర్ సురేశ్‌కుమార్ విడుదల చేస్తారు. ఈ డైరెక్ట్ లింక్ తో ఫలితాలను క్షణాల్లోనే చెక్ చేసుకోవచ్చు.
విద్యార్థుల వివరాలు
ఏపీలో మొత్తం మొత్తం 6.54 లక్షల మంది పరీక్ష రుసుము చెల్లించగా.. 6.23 లక్షల మంది హాజరయ్యారు. 1.02 లక్షల మంది ప్రైవేటుగా పరీక్షలు రాశారు.
8 రోజుల్లో స్పాట్ పూర్తి…
ఏప్రిల్ 1న ప్రారంభమై… ఏప్రిల్ 8వ తేదీతో పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్ పూర్తి అయింది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల కేంద్రాల్లో ఈ స్పాట్ ప్రక్రియ కొనసాగింది. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మూల్యాంకన ప్రక్రియను పూర్తి చేశారు అధికారులు. దాదాపు 25 వేల మందికి పైగా సిబ్బంది ఈ స్పాట్ లో పాల్గొంది.
6,23,092 మంది విద్యార్థులు….
ఈసారి ఏపీలో పదో తరగతి పరీక్షల కోసం 3,473 కేంద్రాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. రెగ్యులర్ అభ్యర్థులు 6,23,092 మంది పేర్లు నమోదు చేసుకున్నారు. ఇందులోబాలుర సంఖ్య 3,17,939గా ఉంటే బాలికల సంఖ్య 3,05,153గా ఉంది.
గతేడాది కంటే ముందే…
గత ఏడాది(2023)లో చూస్తే…మే 6వ తేదీన ఫలితాలు విడుదలయ్యాయి. షెడ్యూల్ ప్రకారం… అప్పుడు ఏప్రిల్ 18వ తేదీతో పరీక్షలు పూర్తి అయ్యాయి. కానీ ఈసారి మాత్రం…. మార్చి 30వ తేదీతో ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యాయి. అయినప్పటికీ తొందరగానే ఫలితాలను ప్రకటిస్తున్నారు.
ఈసారి ముందుగానే ఫలితాలు…
గత ఏడాది(2023)లో చూస్తే…మే 6వ తేదీన ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. అప్పటితో పోల్చితే…ఈ ఏడాది ముందుగానే ఫలితాలు అందుబాటులోకి రానున్నాయి.
6 లక్షల మంది విద్యార్థులు
ఈ ఏడాది జరిగిన పదో తరగతి పరీక్షల(AP SSC Results) కోసం రెగ్యూలర్ అభ్యర్థులు 6,23,092 మంది పేర్లు నమోదు చేసుకున్నారు. ఇందులో బాలుర సంఖ్య 3,17,939గా ఉంటే బాలికల సంఖ్య 3,05,153గా ఉంది.
ఏపీ పదో తరగతి ఫలితాల డైరెక్ట్ లింక్
ఏపీ పదో తరగతి విద్యార్థులు ఈ డైరెక్ట్ లింక్ లో రూల్ నెంబర్ నెంబర్ ను ఎంట్రీ చేసి 'Check Result' పై క్లిక్ చేస్తే క్షణాల్లోనే మీ ఫలితాలు డిస్ ప్లే అవుతాయి.
ఏపీ SSC బోర్డు సైట్ లో ఫలితాలు
పదో తరగతి పరీక్ష రాసిన విద్యార్థులు https://www.bse.ap.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి కూడా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
HT తెలుగులో ఏపీ పదో తరగతి ఫలితాలు
పరీక్షలు రాసిన విద్యార్థులు https://telugu.hindustantimes.com/andhra-pradesh-board-result లింక్ పై క్లిక్ చేసి వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
ఇక్కడ ఆంధ్ర ప్రదేశ్ ఎస్ఎస్‌సి పదో తరగతి రిజల్ట్ 2024 ( https://telugu.hindustantimes.com/andhra-pradesh-ap-ssc-10th-result-2024 ) లింక్ పై క్లిక్ చేయాలి.
మీ రూల్ నెంబర్ ను ఎంట్రీ చేసి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేస్తే మీ ఫలితాలు డిస్ ప్లే అవుతాయి.
ప్రింట్ ఆప్షన్ పై క్లిక్ చేసి ఫలితాల కాపీని పొందవచ్చు.
ఉదయం 11 గంటలకు
సోమవారం ఉదయం 11 గంటలకు విజయవాడలో విద్యాశాఖ కమిషనర్ సురేశ్ కుమార్ ఫలితాలను ప్రకటించనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లను సిద్ధం చేశారు. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి 6 లక్షలుపైగా విద్యార్థులు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.
ఇవాళే ఫలితాలు
ఇవాళ ఉదయం 11 గంటలకు ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదల కానున్నాయి. 6 లక్షల మందికిపైగా విద్యార్థులు రిజల్ట్స్ కోసం ఎదురుచూస్తున్నారు.