AP SSC Results Live: ఏపీ పదో తరగతి ఫలితాలు రిలీజ్.. టాప్ లో మన్యం జిల్లా
06 May 2023, 13:47 IST
- AP SSC Results 2023 Live Updates: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాలు వచ్చేశాయ్. శనివారం ఉదయం 11 గంటలకు మంత్రి బొత్స ఫలితాలను రిలీజ్ చేశారు. ఫలితాలను www.bse.ap.gov.in లింక్ తో చెక్ చేసుకోవచ్చు. ఈ సారి ఫలితాల్లో పార్వతీపురం మన్యం జిల్లా అగ్రస్థానంలో నిలిచింది.
స్పెషల్ తరగతులు…
పదో తరగతి పరీక్షలో తప్పిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని నిర్ణయించినట్లు మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. జిల్లాల వారీగా కొన్ని పాఠశాలలు గుర్తించినట్లు తెలిపారు. వాటిలో ప్రత్యేక తరగతులు నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వమే అన్ని ఏర్పాట్లు చేస్తుందని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు
సప్లిమెంటరీ పరీక్షలు:
జూన్ 2 నుంచి జూన్ 10 వరకు సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయి.
ఈ పరీక్షలకు హాజరయ్యే వారు మే 17వ తేదీలోపు ఫీజు చెల్లించుకోవాలి.
అపరాద రుసుంతో మే 22 వరకు కూడా చెల్లించవచ్చు.
సప్లిమెంటరీ విద్యార్థుల కోసం ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు.
టాప్ ఈ జిల్లానే
ఏపీ పది ఫలితాల ముఖ్య వివరాలు:
పది ఫలితాల్లో 72.06 మంది ఉత్తీరణత
ఈసారి పది ఫలితాల్లో బాలికలదే పైచేయి
933 పాఠశాలల్లో వంద శాతం మంది పాస్ అయ్యారు.
38 పాఠశాలల్లో ఒక్కరు కూడా పాస్ కాలేదు.
పార్వతీపురం మన్యం జిల్లా - మొదటి ప్లేస్ లో నిలిచింది.
చివరి స్థానంలో - 60.30 శాతంతో నంద్యాల జిల్లా చివరి స్థానంలో నిలిచింది.
ఏపీ రెసిడెన్షియల్ స్కూళ్లలో 95.25 శాతం మంది ఉత్తీరణత సాధించారు.
గత సంవత్సరం కంటే ఈ ఏడాది ఐదు శాతం ఉత్తీరణత పెరిగింది.
మరికాసేపట్లో ఫలితాలు…
మరికాసేపట్లో ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాలు విడుదల కానున్నాయి. విజయవాడలో మంత్రి బొత్స సత్యనారాయణ ఉదయం 11 గంటలకు ఫలితాలను రిలీజ్ చేస్తారు.
మరికొద్ది గంటల్లో ఫలితాలు…
మరికొద్ది గంటల్లో పదో తరగతి ఫలితాలు రానున్నాయి. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఆసక్తిగా విద్యార్థులు
మే 6న ఫలితాలు విడుదల చేస్తున్నట్లు అధికారిక ప్రకటన కూడా విడుదలైంది. ఇప్పటికే జవాబు పత్రాల స్పాట్ వాల్యుయేషన్ పూర్తయింది. టెన్త్ ఫలితాల కోసం దాదాపు 6.5 లక్షల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఏపీలో ఏప్రిల్ 18న పదో తరగతి పరీక్షలు పూర్తయ్యాయి. ఏప్రిల్ 19 నుంచి 26 వరకు 23 జిల్లాల్లో స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియ చేపట్టారు. దాదాపు 30 నుంచి 35 వేల మంది ఉపాధ్యాయులు స్పాట్ వాల్యుయేషన్ లో పాల్గొన్నారు.
ఇవాళ పదో తరగతి ఫలితాలు విడుదల
AP SSC Results 2023: లక్షలాది మంది విద్యార్థుల ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న టెన్త్ రిజల్ట్స్ కు ఏపీ విద్యాశాఖ ముహూర్తం ఖరారు చేసింది. ఇవాళ ఉదయం 11 గంటలకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో ఫలితాలు విడుదల చేయనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఇలా చెక్ చేసుకోండి…
విద్యార్థులు మొదటగా bse.ap.gov.in లోకి వెళ్లండి.
హోమ్ పేజీలోని AP SSC ఫలితాల లింక్‌పై క్లిక్ చేయండి.
మీ హాల్ టికెట్ నంబర్ ని ఎంటర్ చేయండి.
సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి.
ఫలితాలు డిస్ ప్లే అవుతాయి.
కీలక నిర్ణయం
ఈసారి పదో తరగతి విద్యార్థులకు మేలు జరిగేలా ఏపీ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం జరిగిన పరీక్షల్లో ఎవరైనా విద్యార్థి నిర్ణీత ప్రశ్నల సంఖ్య కన్నా ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలు రాసి ఉంటే.. వాటిలో ఎక్కువ మార్కులు వచ్చిన సమాధానాన్ని పరిగణనలోకి తీసుకుని ఆ విద్యార్థి మొత్తం మార్కులను నిర్ణయించారు. ఈ మేరకు తాజాగా పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది.
వాల్యూయేషన్ పూర్తి….
మే 6న ఫలితాలు విడుదల చేస్తున్నట్లు అధికారిక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే జవాబు పత్రాల స్పాట్ వాల్యుయేషన్ పూర్తయింది. టెన్త్ ఫలితాల కోసం దాదాపు 6.5 లక్షల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఏపీలో ఏప్రిల్ 18న పదో తరగతి పరీక్షలు పూర్తయ్యాయి. ఏప్రిల్ 19 నుంచి 26 వరకు 23 జిల్లాల్లో స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియ చేపట్టారు. దాదాపు 30 నుంచి 35 వేల మంది ఉపాధ్యాయులు స్పాట్ వాల్యుయేషన్ లో పాల్గొన్నారు. ప్రస్తుతం మార్కుల టేబులేషన్, అప్లోడ్ ప్రక్రియ జరుగుతోందని అధికారులు తెలిపారు. పదో తరగతి ఫలితాలు రేపు విడుదల చేస్తామని ఉద్యోగులతో మంత్రి బొత్స సత్యనారాయణ అన్నట్లు తెలుస్తోంది.
లింక్ ఇదే
మే 6వ తేదీన ఉదయం 11 గంటలకు మంత్రి బొత్స ఫలితాలను రిలీజ్ చేస్తారు. ఫలితాలను www.bse.ap.gov.in లింక్ తో చెక్ చేసుకోవచ్చు.
6 లక్షల మంది విద్యార్థులు
ఫలితాల విడుదలపై విద్యాశాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఏపీలో 3349 కేంద్రాల్లో నిర్వహించిన పదో తరగతి పరీక్షలను 6.5 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. ఏప్రిల్ 3 నుంచి 18వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించగా... 19 నుంచి 26తేదీ వరకూ స్పాట్ వాల్యుయేషన్ చేశారు.
రేపు ఫలితాలు….?
ఏపీ పదో తరగతి ఫలితాలపై కీలక అప్ డేట్ వచ్చింది. లక్షలాది మంది విద్యార్థుల ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న టెన్త్ రిజల్ట్స్ కు ఏపీ విద్యాశాఖ ముహూర్తం ఖరారు చేసింది. ఈ నెల 6వ తేదీ(శనివారం) ఉదయం 11 గంటలకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో ఫలితాలు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.