తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap: గణేశ్ మండపం పెడుతున్నారా? ఈ రూల్స్ పాటించాల్సిందే

AP: గణేశ్ మండపం పెడుతున్నారా? ఈ రూల్స్ పాటించాల్సిందే

26 August 2022, 19:04 IST

google News
    •  ganesh chaturthi pandals rules in ap: ఈ నెల 31 నుంచి వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. గణేష్‌ మండపాల ఏర్పాటు, ఉత్సవాల నిర్వహణకు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. పలు నిబంధనలను పేర్కొంటూ ప్రకటన విడుదల చేశారు.
మండపాలపై ఆంక్షలు
మండపాలపై ఆంక్షలు

మండపాలపై ఆంక్షలు

ap police issued guildlines for ganesh chaturthi pandals :మరికొద్దిరోజుల్లో వినాయక చవితి వచ్చేస్తోంది. వీధికో గణపయ్య దర్శనమిచ్చేస్తాడు..! చవితి వేడుకలతో రాష్ట్రవ్యాప్తంగా పండగ వాతావరణం రాబోతుంది. అయితే మండపాల పెట్టే నిర్వహకులు మాత్రం కొన్ని విషయాలు తప్పక తెలుసుకోవటమే కాదు... పాటించాల్సి ఉంటుంది. ఇచ్చిన నిబంధనలు ఉల్లంఘిస్తే మాత్రం కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరికలు, ప్రకటనలు జారీ చేస్తున్నారు.

నిబంధనలు ఇవే…

guidelines for setting up ganesh pandals: విగ్రహం సైజు, బరువు, ఉత్సవం ఎన్ని రోజులు నిర్వహిస్తారు. నిమజ్జనం చేసే తేదీ, కమిటీ సభ్యుల వివరాలను ముందుగానే తెలియజేయాలి.

బలవంతపు చందాలు వసూళ్లు చేయరాదు. ఎవరైనా అటువంటి చర్యలకు పాల్పడితే డయల్‌ 100 గానీ ఫిర్యాదు చేయవచ్చు.

మట్టితో తయారుచేసిన విగ్రహాలనే పూజించేందుకు ప్రాధాన్యమివ్వాలి.

విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదాలు జరగకుండా నిర్వాహకులు, మందుస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. నిర్లక్ష్యంగా వహించరాదు.

కమిటీ సభ్యులు రాత్రి సమయంలో మండపం వద్ద కాపలాగా ఉండాలి.

శబ్దకాలుష్యం విషయంలో పీసీబీ నియమాలు విధిగా పాటించాలి.

ఉదయం 8 నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే స్పీకర్లు వినియోగించాలి.

మండపాల ప్రదేశం వద్ద ట్రాఫిక్‌ అంతరాయం కలిగించకూడదు.

విగ్రహాల ఊరేగింపు సమయంలో అశ్లీల పాటలు వేసినా, డ్యాన్సులు చేసినా కఠిన చర్యలు ఉంటాయి.

మందుగుండు సామగ్రి కాల్చరాదు,

వినాయక నిమజ్జన ఊరేగింపు నిర్దేశించిన సమయంలో పూర్తి చేయాలి.

ఘర్షణలకు కారణమైన వారిపై కేసులు నమోదు చేస్తారు.

తదుపరి వ్యాసం