తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  5 Working Days : అమరావతిలో పని చేస్తున్న ఉద్యోగులకు 5 రోజులే పని

5 Working Days : అమరావతిలో పని చేస్తున్న ఉద్యోగులకు 5 రోజులే పని

HT Telugu Desk HT Telugu

30 June 2022, 19:56 IST

google News
    • అమరావతి రాజధాని ప్రాంతంలో పనిచేస్తున్న ఏపీ సచివాలయం, హెచ్ఓడీ కార్యాలయాలు, ఇతర విభాగాల ఉద్యోగుల పని దినాలపై ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఐదురోజుల పనిదినాల విధానాన్ని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

రాజధాని ప్రాంతంలో పని చేస్తున్న ఉద్యోగులకు 5 రోజులే పని దినాలు.. మరో ఏడాది ఉండనున్నాయి. ఈ నెల 27 తేదీ నుంచి మరో ఏడాదిపాటు ఐదు రోజుల పనిదినాల విధానాన్ని పొడిగిస్తూ సాధారణ పరిపాలనశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ విధులు నిర్వహించాలని ఉత్తర్వుల్లో సూచించారు.

ఇప్పటికే రాజధానిలో సచివాలయ ఉద్యోగులకు క్వార్టర్స్ ను మరో రెండు నెలల పాటు కొనసాగించాలని ఇప్పటికే ఉత్తర్వులు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. సచివాలయ ఉద్యోగులకు ఐదు రోజుల పనిదినాల్ని మరో ఏడాది పొడిగించింది.

ఎప్పటి నుంచి 5 రోజుల పనిదినాలు

ఏపీలో సచివాలయ ఉద్యోగులకు ఇతర ప్రాంతంలో పనిచేసే ఉద్యోగులకు కొన్ని తేడాలు ఉంటాయి. సచివాలయ ఉద్యోగులతో పాటు రాజధానిలో వివిధ శాఖాధిపతుల కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో అత్యధికశాతం హైదరాబాద్ నుంచి రాష్ట్రవిభజన సందర్భంగా వచ్చిన వారు.

చంద్రబాబు ప్రభుత్వం ఇక్కడకు వచ్చిన వారికి కొన్ని వెసులుబాట్లు కల్పించింది. ఐదు రోజుల పనిదినాలతో పాటు రాజధానిలో క్వార్టర్స్ వంటి సదుపాయాలు ఇచ్చారు. అయితే హైదరాబాద్ నుంచి సోమవారం ఉదయం సచివాలయానికి వచ్చి ఐదు రోజుల పాటు రాజధానిలోని క్వార్టర్ట్స్ లో ఉండి శుక్రవారం సాయంత్రం తిరిగి హైదరాబాద్ వెళ్లేవారు. ఇదే ఇప్పటికీ కొనసాగుతోంది..

టీడీపీ ప్రభుత్వం ఏపీ రాజధానిగా అమరావతిని ఎంపిక చేసిన నేపథ్యంలో ఐదేళ్లలో సచివాలయ ఉద్యోగులు ఏపీకి వచ్చేస్తారని చంద్రబాబు అనుకున్నారు. దానికోసమే.. ఇలా వెసులుబాట్లు కొనసాగించారు. వైసీపీ ప్రభుత్వం తొలి ఏడాది కూడా వెసులుబాట్లు అలానే ఇచ్చేసింది. అనంతరం మూడు రాజధానులు తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ కారణంగా వెసులుబాట్లు ఎత్తేయాలని అనుకున్నారు. కానీ ఉద్యోగుల నుంచి డిమాండ్లు వచ్చాయి. దీంతో వైసీపీ ప్రభుత్వం కొనసాగించక తప్పలేదు. ఇప్పటికీ రాజధానిపై క్లారిటీ లేక వీరికి ఏటా వెసులుబాట్లు పొడిగిస్తూనే ఉన్నారు.

రాజధానిపై హైకోర్టు తీర్పు ఇచ్చినా.. ప్రభుత్వం బహిరంగంగానే మూడు రాజధానులు తెస్తామని చెప్పుకుంటున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే.. సచివాలయ ఉద్యోగుల క్వార్టర్స్ ను మరో రెండు నెలల పాటు పొడిగిస్తూ ఉత్తర్వులు సైతం ఇచ్చారు.

టాపిక్

తదుపరి వ్యాసం