AP ECET-2023: ఏపీఈసెట్-2023 పరీక్ష వాయిదా.. కొత్త తేదీ ఇదే
23 April 2023, 10:03 IST
- AP ECET-2023 Updates: ఏపీఈసెట్-2023 పరీక్ష వాయిదా పడింది. మే 5న జరగాల్సిన ఎగ్జామ్ ను జూన్ 20వ తేదీన నిర్వహించనున్నారు.
ఏపీఈసెట్-2023
AP ECET-2023 Exam Updates: ఏపీఈసెట్-2023 పరీక్షకు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చారు అధికారులు. షెడ్యూల్ ప్రకారం నిర్ణయించిన పరీక్ష తేదీని వాయిదా వేశారు. మే 5వ తేదీన ఈ పరీక్ష జరగాల్సి ఉండగా…. జూన్ 20వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటన విడుదలైంది. పాలిటెక్నిక్ ఆఖరి సంవత్సరం విద్యార్థుల పరీక్షలు పూర్తి కానందున ఏపీ సాంకేతిక విద్యాశాఖ కమిషనర్, రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ బోర్డు అభ్యర్థన మేరకు పరీక్షను వాయిదా వేస్తున్నట్లు సెట్ అధికారులు తెలిపారు. ఇక ప్రవేశ పరీక్ష ద్వారా… బీఈ, బీటెక్, బీఫార్మసీ కోర్సుల్లో ద్వితీయ సంవత్సరంలో ప్రవేశాలు కల్పిస్తారు.
ఈసెట్ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు ప్రక్రియ మార్చి 10న ప్రారంభంకాగా.. ఎలాంటి దరఖాస్తు రుసుము లేకుండా ఏప్రిల్ 10 వరకు దరఖాస్తులు స్వీకరించారు. పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను ఏప్రిల్ 28 నుంచి అందుబాటులో ఉంచనున్నారు.
వివరాలు..
ఏపీఈసెట్ - 2023
కోర్సులు: బీటెక్, బీఫార్మసీ.
అర్హత: పాలిటెక్నిక్ డిప్లొమా (ఇంజినీరింగ్), బీఎస్సీ (మ్యాథమెటిక్స్) ఉత్తీర్ణులై ఉండాలి. చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా దరఖాస్తుకు అర్హులు.
ఎంపిక విధానం: ప్రవేశపరీక్షలో ర్యాంకు ఆధారంగా.
పరీక్ష విధానం: మొత్తం 200 మార్కులకుగాను ఈసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 200 ఆబ్జె్క్టివ్ తరహా ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నల తీరు ఇంజినీరింగ్, ఫార్మసీ, బీఎస్సీ (మ్యాథ్స్) విభాగాలకు వేర్వేరుగా ఉంటాయి.
హాల్‌టికెట్ల డౌన్‌లోడ్: 28.04.2023.
పరీక్ష తేది: 20.06.2023.(కొత్త తేదీ)
పరీక్ష సమయం: ఉ.9 గం.- మ. 12 గం. వరకు, మ.3 గం.-సా.6 గం. వరకు.
NOTE: ఈ లింక్ పై క్లిక్ ఏపీఈసెట్ హాల్ టికెట్లు, ఫలితాలతో పాటు ఇతర ముఖ్యమైన అప్డేట్స్ పొందవచ్చు.
ప్రవేశ పరీక్షకు ఉచితశిక్షణ
Ap Polycet Coaching: ఏపీలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలలో పాలిసెట్ – 2023 ప్రవేశ పరీక్ష కోసం ఉఛిత శిక్షణ అందిస్తున్నట్లు సాంకేతిక విద్యా శాఖ కమీషనర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఈ నెల 24 నుండి నూతన బ్యాచ్‌లను ప్రారంభిస్తున్నట్లు తెతలిపారు. శిక్షణకు హాజరయ్యే విద్యార్ధులకు ఉచితంగా స్టడీ మెటీరియల్ అందచేస్తారు.ఈ నెల 24 నుండి నూతన బ్యాచ్‌లను ప్రారంభిస్తున్నట్లు తెతలిపారు. శిక్షణకు హాజరయ్యే విద్యార్ధులకు ఉచితంగా స్టడీ మెటీరియల్ అందచేస్తారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ ప్రవేశాల కోసం మే 10వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 61 పట్టణాలలోని 410 పరీక్ష కేంద్రములలో పాలీసెట్ 2023 నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పరీక్షకు సుమారు 1,50,000 మంది విద్యార్థులు హాజరవుతారన్నారు. ప్రవేశ పరీక్షకు ప్రభుత్వం నిర్దేశించిన పదవ తరగతి సిలబస్ నుండి గణితంలో 50 మార్కులు , భౌతిక శాస్త్రము 40 మార్కులు, రసాయన శాస్త్రము 30 మార్కులు మొత్తం కలిపి 120 మార్కులకు రెండు గంటల వ్యవధిలో పరీక్ష ఉంటుందన్నారు.