తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Narayana Swamy : అన్నంలో ఏదో కలిపి చంద్రబాబును చంపేందుకు కుట్ర, భువనేశ్వరిపై నారాయణస్వామి తీవ్ర వ్యాఖ్యలు

Narayana Swamy : అన్నంలో ఏదో కలిపి చంద్రబాబును చంపేందుకు కుట్ర, భువనేశ్వరిపై నారాయణస్వామి తీవ్ర వ్యాఖ్యలు

18 October 2023, 16:22 IST

google News
    • Narayana Swamy On Chandrababu : చంద్రబాబు కుటుంబ సభ్యులపై డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబును చంపి లోకేశ్ ను సీఎం చేయాలని భువనేశ్వరి కుట్రచేస్తున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
డిప్యూటీ సీఎం నారాయణ స్వామి
డిప్యూటీ సీఎం నారాయణ స్వామి

డిప్యూటీ సీఎం నారాయణ స్వామి

Narayana Swamy On Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులపై డిప్యూటీ సీఎం నారాయణస్వామి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు భోజనం పంపిస్తున్న నారా భువనేశ్వరి, అన్నంలో ఏదో కలిపి ఆయనను చంపేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఇటీవల నారాయణ స్వామి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. అయితే తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని నారాయణ స్వామి అన్నారు. భువనేశ్వరి, పురంధేశ్వరి ఎన్టీఆర్ బిడ్డలే కాబట్టి ఆయన మృతికి కారణమైన చంద్రబాబుపై పగఉండి ఉండవచ్చని, ఆ కారణంగానే చంద్రబాబును చంపి లోకేశ్ ను సీఎం చేయాలని చూస్తున్నారని మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేయలేకపోతున్నారన్నారు. కోర్టులు ఇప్పుడే కళ్లు తెరుచుకున్నాయని డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు.

టీడీపీ టెర్రరిస్టుల పార్టీ

టీడీపీ టెర్రరిస్టుల పార్టీ అని, చంద్రబాబు వెన్నుపోటుదారుడంటూ డిప్యూటీ సీఎం నారాయణస్వామి విమర్శించారు. ఎన్టీఆర్ పార్టీని లాక్కున్న వ్యక్తి చంద్రబాబు అన్నారు. వచ్చే ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఇంటికి ఒక బంగారు ముద్ద ఇస్తానని చంద్రబాబు అంటారని సెటైర్లు వేశారు. ఒక్కొక్క రైతుకు ఒక్కొ ట్రాక్టర్ ఇస్తానంటారని, యువకులకు మోటార్ సైకిల్ ఇస్తారని హామీలు గుప్పిస్తారన్నారు. చంద్రబాబు హామీలు నమ్మి మోసపోవద్దని నారాయణస్వామి అన్నారు. చంద్రబాబు తప్పు చేసి జైలుకు వెళ్లారని తెలిపారు. ఎలాంటి తప్పు చేయని సీఎం జగన్ ను అప్పట్లో సోనియాగాంధీ, కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు కలిసి జైలుకు పంపించారన్నారు. లాలూ ప్రసాద్ యాదవ్, జయలలిత, సీఎం జగన్ ఇలాంటి ఎందరో వ్యక్తులు జైలుకు వెళ్లినప్పుడు ఆందోళనలు జరగలేదన్నారు. కానీ చంద్రబాబును అక్రమంగా జైలుకు తరలించారంటూ కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు చేస్తున్న ఆందోళనలు సమంజసంగా లేవన్నారు.

టీడీపీ రోజుకో డ్రామా

"స్కిల్‌ కేసులో సీఐడీ చంద్రబాబును అరెస్ట్‌ చేస్తే అక్రమ అరెస్ట్‌ అంటూ టీడీపీ నాయకులు రోజుకొక డ్రామా ఆడుతున్నారు. స్కాం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు లాయర్లు సుప్రీంకోర్టులో స్కాం గురించి ప్రస్తావించకుండా కేవలం టెక్నికల్‌ అంశాల ఆధారంగా కేసు కొట్టేయాలని అభ్యర్థిస్తున్నారు. స్కిల్‌ స్కాంలో రూ.371 కోట్లు చంద్రబాబు దోచేశారని సెంట్రల్‌ ఏజెన్సీలు నోటీసులు ఇస్తే ఆయనపై కేసు పెట్టడం అక్రమమా? చంద్రబాబు బాబు పీఏ పెండ్యాల శ్రీనివాస్‌ పరారీలో ఉన్నారు, అతడు దొరికితే మరిన్ని ఆధారాలు లభిస్తాయి. చంద్రబాబు వయసును ప్రస్తావిస్తూ, ప్రభుత్వం ఆయన పట్ల అమానుషంగా ప్రవర్తిస్తోందని కోర్టు దృష్టికి తెచ్చి సానుభూతి పొందాలని చూస్తున్నారు. చంద్రబాబు, రామోజీరావు కలిసి వైశ్రాయ్‌ హోటల్‌ బయట ఎన్టీఆర్‌పై చెప్పులు వేయించి, ఆయనను సీఎం పీఠం నుంచి దించేసిన ఎపిసోడ్‌ను ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేదు. చంద్రబాబు కుట్రకు కథ, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్‌ అంతా రామోజీరావుదే. చంద్రబాబు, రామోజీ తాము ఎన్ని అక్రమాలు చేసినా ప్రజలు నమ్మేస్తారనే భ్రమల్లో ఉన్నారు. చంద్రబాబు నిర్దాక్షిణ్యంగా ఎన్టీఆర్‌ను సీఎం పదవి నుంచి దించేసి, టీడీపీ ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు"- నారాయణ స్వామి

తదుపరి వ్యాసం