తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Amarnath : అమర్‌నాథ్‌ యాత్రలో ఇద్దరు రాజమండ్రి మహిళల మృతి

Amarnath : అమర్‌నాథ్‌ యాత్రలో ఇద్దరు రాజమండ్రి మహిళల మృతి

HT Telugu Desk HT Telugu

11 July 2022, 12:52 IST

google News
    • అమర్‌నాథ్ యాత్రలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మహిళ ప్రాణాలు కోల్పోయింది. మూడ్రోజులుగా అచూకీ లేకుండా పోయిన మహిళలు మరణించినట్లు స్పష్టమైంది. సుధ అనే మహిళ విగత జీవిగా శ్రీనగర్‌ మార్చురీలో కనిపించింది. పార్వతి మృతదేహాన్ని ఢిల్లీ ఎయిమ్స్‌లో గుర్తించారు.   అమర్‌నాథ్‌ యాత్రలో  గల్లంతైన వారి మృతదేహాలను సైన్యం శ్రీనగర్‌ ప్రభుత్వాస్పతికి తరలించింది. శ్రీనగర్‌ ఆస్పత్రిలో సుధ మృతదేహాన్ని ఆమె భర్త గుర్తించారు. 
అమర్‌నాథ్‌ యాత్రలో మరణించిన సుధ
అమర్‌నాథ్‌ యాత్రలో మరణించిన సుధ

అమర్‌నాథ్‌ యాత్రలో మరణించిన సుధ

అమర్‌నాథ్‌ యాత్రలో గల్లంతైన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు మహిళ మరణించారు. కొండచరియల విరిగిపడిన సమయంలో గుడారాల్లో ఉన్న మహిళలు ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించారు. . బేస్‌ క్యాంపులో ఒక్కసారిగా కొండ చరియలు విరిగి పడిన సమయంలో అందులో ఉన్న సుధ ప్రాణాలు కోల్పోయారు. సుధా భర్త విజయ్‌ కిరణ్‌ భార్య మృతదేహాన్ని గుర్తించారు. ఢిల్లీ ఎయిమ్స్‌లో పార్వతి మృతదేహాన్ని గుర్తించారు.

తూర్పు గోదావరి జిల్లా నుంచి అమర్ నాథ్ యాత్రకు వెళ్లిన 20 మందిలో ఇద్దరి అచూకీ గల్లంతైనట్లు ఆదివారం గుర్తించారు. తూర్పు గోదావరి జిల్లా నుంచి అమర్ నాథ్ యాత్రకు వెళ్లిన 20 మందిలో 18 మంది సురక్షితంగా ఉన్నట్లు ఆదివారం రెవిన్యూ అధికారులు ప్రకటించారు.

రాజమహేంద్రవరం అన్నపూర్ణమ్మ పేటకు చెందిన కొత్త పార్వతి, మునిశెట్టి సుధలు గల్లంతయ్యారు. వారి భర్తలు మాత్రం ప్రమాదం నుంచి సురక్షితంగా బయట పడ్డారు. పార్వతీ, సుధల జాడ కోసం ఏపీ భవన్‌ అదనపు ఆర్సీ ఆధ్వర్యంలో శ్రీనగర్‌లో ప్రయత్నించారు. సోమవారం ఉదయం శ్రీనగర్‌ మార్చురీలో ఉన్న మృతదేహాలను గుర్తించే సమయంలో సుధ శవాన్ని భర్త గుర్తించారు. పార్వతీ మృతదేహాన్ని ఢిల్లీలో గుర్తించారు.

<p>రాజమండ్రిలో బాధిత కుటుంబాలతో మాట్లాడుతున్న ఆర్డీఓ</p>

అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లిన వారిపై ఒక్కసారిగా వరద ప్రవాహం విరుచుకుపడటంతో పలువురు ప్రాణాలు కోల్పోయారు. బేస్‌ క్యాంపుల్లోకి వరద ప్రవాహం విరుచుకుపడటంతో యాత్రికులు వరదలో కొట్టుకుపోయారు. దీంతో ఏపీ నుంచి అమర్‌నాథ్ యాత్రకు వెళ్లిన వారి అచూకీపై ఆందోళన నెలకొంది. సోమవారం ఇద్దరు మృతి చెందినట్లు నిర్ధారణ కావడంతో వారి కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి.

ఏపీ నుంచి అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లిన వారి క్షేమ సమాచారాలు తెలుసుకోడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. రాజమండ్రి నుంచి 20మంది సభ్యుల బృందం అమర్‌నాథ్ యాత్రకు వెళ్లినట్లు గుర్తించారు. వారిలో ఇద్దరు మహిళల అచూకీ ఇంకా లభించలేదని అధికారులు చెబుతున్నారు. అచూకీ లభించని మహిళల భర్తలు శ్రీనగర్‌ చేరుకున్నారని, మహిళల అచూకీ తెలుసుకోడానికి ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు.

గల్లంతైన మహిళ గాయపడి ఎక్కడైనా చికిత్స పొందుతూ ఉండొచ్చని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు కొండ చరియల కింద చిక్కుకుపోయిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. రాజమండ్రి ఆర్డీఓ బాధిత కుటుంబాన్ని పరామర్శించి సహాయ చర్యలపై కుటుంబ సభ్యులకు వివరించారు. మరోవైపు గుంటూరుకు చెందిన 38మంది సభ్యుల బృందం కూడా అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లినట్లు గుర్తించారు. వీరంతా క్షేమంగా ఉన్నారు.

తాడేపల్లి గూడెంకు చెందిన 17మంది సభ్యుల బృందం కూడా అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లారు. తిరుపతి నుంచి ఆరుగురు సభ్యుల బృందం, విజయనగరం నుంచి వెళ్లిన మరో బృందం ఆకస్మిక వరదల నుంచి సురక్షితంగా బయటపడ్డారు. కడప నుంచి వెళ్లిన మరో బృందం కూడా తాము సురక్షితంగానే ఉన్నట్లు అధికారులకు సమాచారం అందించారు. ఈ బృందంలో ఎంతమంది అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లారనేది స్పష్టం కాలేదు.

ఆంధ్రప్రదేశ్‌ నుంచి అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లిన యాత్రికులను సురక్షితంగా స్వస్థలాలకు చేర్చే ప్రయత్నాలు చేస్తున్నారు.ఏపీభవన్ అదనపు రెసిడెంట్ కమిషనర్‌ హిమాన్షు కౌషిక్‌ శ్రీనగర్‌లో ఉండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. స్థాఅమర్‌నాథ్‌ యాత్రీకుల కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 1902 హెల్ప్‌లైన్‌ ద్వారా సహాయాన్ని అందిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

మరోవైపు సోమవారం నాటికి అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లి అచూకీ లభించని వారి సంఖ్య 30ను దాటింది. ఏపీలోని వివిధ ప్రాంతాల నుంచి అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లి ఎలాంటి సమాచారం కుటుంబ సభ్యులకు అందించని వారి సంఖ్య 34గా నమోదైంది. ఢిల్లీలో ఏర్పాటు చేసిన టోల‌్‌ఫ్రీ నంబరుకు పలువురు తమ వారి అచూకీ కోసం ఆరా తీస్తున్నారు. నెల్లూరు నుంచి రెండు బృందాలుగా వెళ్లిన 29మందితో పాటు ఏలూరుకు చెందిన ఇద్దరు, తణుకు సమీపంలోని ఉండ్రాజవరంకు చెందిన ఒకరి కోసం బంధువులు అధికారుల్ని సంప్రదించారు. యాత్రీకుల సమాచారం తెలియకపోవడంతో రెవిన్యూ అధికారులు వారి ఇళ్లకు వెళ్లి ఆరా తీస్తున్నారు. ప్రమాదానికి ముందే అక్కడి నుంచి వె‌ళ్ళిపోయిన వారు, ఫోన్లు ఛార్జింగ్ లేని వారి గురించి బంధువులు ఆందోళన చెందుతున్నట్లు గుర్తించారు. అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లిన వారిలో 38మందిని సురక్షితంగా రైళ్ల ద్వారా విజయవాడ తరలించారు.

టాపిక్

తదుపరి వ్యాసం