తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Assembly: జూలై 22 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు…మరో మూడు నెలలు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పొడిగింపు

AP Assembly: జూలై 22 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు…మరో మూడు నెలలు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పొడిగింపు

Sarath chandra.B HT Telugu

09 July 2024, 8:20 IST

google News
    • AP Assembly: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు జూలై 22 నుంచి  ప్రారంభం కానున్నాయి. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మూడు నెలల వ్యవధితో అమోదించిన ఓటాన్ అకౌంట్‌ బడ్జెట్‌ను మరో మూడు నాలుగు నెలలు పొడిగించనున్నారు. 
ఏపీ అసెంబ్లీ సమావేశాలు 2024
ఏపీ అసెంబ్లీ సమావేశాలు 2024

ఏపీ అసెంబ్లీ సమావేశాలు 2024

AP Assembly: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ గడువు ముగియడంతో దానిని మరో మూడు నాలుగు నెలలు పొడిగించేందుకు ఆర్డినెన్స్ జారీ చే‍యనున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో అమల్లో ఉన్న పథకాల కొనసాగింపు, కొత్త పథకాలకు నిధుల కేటాయింపు, ప్రాధాన్యతల వారీగా కేటాయింపులు చేయాల్సిన అవసరం ఉండటంతో శాసనసభా సమావేశాలను ఏర్పాటు చేస్తున్నారు.

సమావేశాల తొలిరోజు గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగంతో ఇవి ప్రారంభమవుతాయి. తర్వాత రెండు రోజులపాటు గవర్నర్‌ ప్రసంగంపై సభలో చర్చ జరిపి దానిని ఆమోదిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధిక పరిస్థితిపై విడుదల చేస్తున్న శ్వేత పత్రాలను ఈ సమావేశాల్లో సభ ముందు ప్రవేశపెడ తారు.

సమావేశాల్లో మూడు రోజులపాటు వాటిపై కూడా చర్చ జరుగుతుంది. మొత్తం ఐదు రోజుల చర్చతో ఈ సమావేశాలు ముగుస్తాయి. మరోవైపు పూర్తి స్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టడానికి అనువైన పరిస్థితులు లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్‌ను మరో నాలుగు నెలలు పొడిగించే సూచనలు ఉన్నాయి.

తదుపరి వ్యాసం