తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Au Dual Degree : ఏయూలో డబుల్ డిగ్రీ కోర్సులకు నోటిఫికేషన్

AU DUAL Degree : ఏయూలో డబుల్ డిగ్రీ కోర్సులకు నోటిఫికేషన్

HT Telugu Desk HT Telugu

28 August 2022, 9:53 IST

google News
    • ఆంధ్రా యూనివర్శిటీలో డబుల్ డిగ్రీ ఇంజినీరింగ్ కోర్సులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఏయూ- స్వీడన్‌కు చెందిన బ్లీకింగ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలు సంయుక్తంగా ఈ కోర్సులు నిర్వహిస్తాయి.
ఆంధ్రా యూనివర్శిటీలో డబుల్ డిగ్రీ కోర్సులు
ఆంధ్రా యూనివర్శిటీలో డబుల్ డిగ్రీ కోర్సులు

ఆంధ్రా యూనివర్శిటీలో డబుల్ డిగ్రీ కోర్సులు

ఆంధ్రా యూనివర్శిటీ-స్వీడన్‌కు చెందిన బ్లీకింగ్ యూనివర్శిటీలు సంయుక్తంగా నిర్వహించే డబుల్ డిగ్రీ కోర్సులకు నోటిఫికేషన్ విడుదలైంది. రెండు సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్న డబుల్ డిగ్రీ ప్రోగ్రామ్‌లో అడ్మిషన్ల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. కోర్సు కాల వ్యవధి నాలుగేళ్లు. మొదటి మూడేళ్లు ఏయూ కాలేజ్ ఆఫ్‌ ఇంజనీరింగ్‌లో విద్యాభ్యాసం ఉంటుంది. చివరి ఏడాది బీటిహెచ్‌లో చదవాల్సి ఉంటుంది. ఏడాదికి రెండు సెమెస్టర్లను పూర్తి చేయాల్సి ఉంటుంది. విద్యార్ధులు బ్లీకింగ్ యూనివర్శిటీలో తప్పనిసరిగా అండర్ గ్రాడ్యుయేట్ ప్రాజెక్టు పూర్తి చేయాల్సి ఉంటుంది.

ఈ కోర్సులో భాగంగా ఆంధ్రా యూనివర్శిటీ బీటెక్‌ డిగ్రీ, బీటిహెచ్‌ నుంచి బిఎస్ డిగ్రీలు అందుతాయి. కోర్సు పూర్తి చేసిన అభ్యర్ధులు ఏయూ లేదా బీటిహెచ్‌ వర్శిటీలు నిర్వహించే మాస్టర్స్‌ కోర్సుల్లో అడ్మిషన్లు పొందవచ్చు.

కోర్సులు ఇవే….

మెకానికల్ ఇంజనీరింగ్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్- ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ అండ్‌ మెషిన్ లెర్నింగ్ కోర్సులు ఉన్నాయి. ఒక్కో కోర్సులో ఐదు సీట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

డబుల్ డిగ్రీ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్ధులు ఇంటిర్మీడియట్‌ తత్సామానమైన తరగతుల్లో ఎంపిసి సబ్జెక్టులో ఉత్తీర్ణులై ఉండాలి. ఇంటర్‌, సిబిఎస్‌ఇ, ఐసీఎస్‌ఇలలో మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీలలో కనీసం 70శాతం మార్కులు సాధించి ఉండాలి. 2022 జేఈఈ మెయిన్స్‌, ఏపీ ఈఏపీ సెట్‌, తెలంగాణ ఎంసెట్‌, ఏయూఈఈటీలలో ఏదొక దాంట్లో అర్హత సాధించి ఉండాలి.ఇంగ్లీష్ మినహా ఇతర మీడియంలలో చదివిన వారు బీటిహెచ్‌లో ప్రవేశం నాటికి ఐఈఎల్‌టీఎస్‌, టోఫెల్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలి. టోఫెల్‌లో 575/90, ఐఈఎల్‌టీఎస్‌లో 6.5 మార్కులు రావాల్సి ఉంటుంది. దరఖాస్తు చేయడానికి ఆఖరు తేదీ సెప్టెంబర్ 12. www.andhrauniversity.edu.inలో మరిన్ని వివరాలు లభిస్తాయి. ఇంటర్మీడియట్‌లో వచ్చిన మార్కులతో పాటు అర్హత పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా కౌన్సిలింగ్ నిర్వహించి ప్రవేశాలు కల్పిస్తారు.

టాపిక్

తదుపరి వ్యాసం