తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Gds Results : ఏపీ, తెలంగాణ సర్కిళ్ల జీడీఎస్ రిజల్ట్స్ రిలీజ్, సర్టిఫికెట్ల పరిశీలనకు మే 22 లాస్ట్ డేట్!

GDS Results : ఏపీ, తెలంగాణ సర్కిళ్ల జీడీఎస్ రిజల్ట్స్ రిలీజ్, సర్టిఫికెట్ల పరిశీలనకు మే 22 లాస్ట్ డేట్!

13 May 2023, 17:29 IST

google News
    • GDS Results : తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని అన్ని సర్కిళ్లలో జీడీఎస్ మూడో జాబితాను పోస్టల్ శాఖ విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులు మే 22లోగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కు హాజరుకావాల్సి ఉంటుంది.
పోస్టల్ జీడీఎస్ రిజల్ట్స్
పోస్టల్ జీడీఎస్ రిజల్ట్స్ (Twitter )

పోస్టల్ జీడీఎస్ రిజల్ట్స్

GDS Results : ఏపీ, తెలంగాణతో సహా అన్ని సర్కిళ్ల పరిధిలో సర్టిఫికెట్ల పరిశీలనకు ఎంపికైనవారి మూడో జాబితాను పోస్టల్ శాఖ మే 12న విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్‌ సర్కిళ్లలో గ్రామీణ డాక్‌ సేవక్‌(GDS) నియామకాలకు సంబంధించి జనవరిలో పోస్టల్ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. 40,889 నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్‌ విడుదలైన చేసింది.

మే 22లోగా సరిఫికెట్ల వెరిఫికేషన్

ఏపీలో 2480, తెలంగాణలో 1266 ఖాళీలు ఉన్నాయని నోటిఫికేషన్ లో పేర్కొంది. పదో తరగతి మార్కులు, మెరిట్‌ ఆధారంగా జీడీఎస్ లో ఎంపికలు చేపట్టారు. రిజర్వేషన్, కంప్యూటర్‌ జనరేటెడ్‌ పద్ధతిలో మార్కులకు ప్రాధాన్యతను బట్టి అభ్యర్థులను ఎంపిక చేశారు. ఎంపికైన అభ్యర్థులకు ఈమెయిల్, పోస్ట్, ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేస్తున్నారు. అభ్యర్థులు బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌, అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌, డాక్‌ సేవక్‌ హోదాలతో విధులు నిర్వహిస్తారు. మూడో జాబితాలో ఎంపికైన అభ్యర్థులు మే 22 లోగా సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరుకావాల్సి ఉంటుంది. నిర్ణీత గడువు దాటాక ఎట్టిపరిస్థితుల్లో ధ్రువపత్రాల పరిశీలనకు అనుమతించమని పోస్టల్ శాఖ స్పష్టం చేసింది. ధ్రువపత్రాల పరిశీలనకు హాజరయ్యే అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లను, ఒక జత జిరాక్స్ కాపీలను, ఫొటోలను తీసుకువెళ్లాల్సి ఉంటుంది.

రోజుకు నాలుగు గంటలే పని

ఎంపికైన అభ్యర్థులకు బ్రాంచ్ పోస్టు మాస్టర్(BPM), అసిస్టెంట్‌ బ్రాంచ్ పోస్టు మాస్టర్(ABPM), డాక్ సేవక్ హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. పోస్టును బట్టి రూ.10,000 - రూ.12,000 వరకు ప్రారంభ వేతనం ఉంటుంది. ఏపీలో 2480, తెలంగాణలో 1266 జీడీఎస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ పోస్టులకు ఎంపికైనవారు రోజుకు నాలుగు గంటలు పని చేయాల్సి ఉంటుంది. వీటితో పాటు ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంకు సేవలకు ప్రత్యేకంగా ఇన్సెంటివ్ రూపంలో బీపీఎం/ ఏబీపీఎం/ డాక్ సేవక్‌లకు ప్రోత్సాహం కూడా అందిస్తారు. ఆ సేవలకు విలువ ఆధారంగా ఇంటెన్సివ్ ఇస్తారు. వీరు రోజువారీ విధులు నిర్వర్తించడానికి ల్యాప్‌టాప్/ కంప్యూటర్/ స్మార్ట్ ఫోన్ లాంటివి తపాలాశాఖ ఇస్తుంది. కేటాయించిన ప్రాంతంలో అందుబాటులో ఉండాలి, ఎంపికైన అభ్యర్థులకు సైకిల్ తొక్కడం రావాలి.

అభ్యర్థులు తమ ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి

Step 1 : ముందుగా పోస్టల్ శాఖ అధికారిక వెబ్ సైట్ https://indiapostgdsonline.gov.in/ ను ఓపెన్ చేయాలి.

Step 2 : అనంతరం షార్ట్ లిస్టెడ్ క్యాండిడెడేట్స్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.

Step 3 : అక్కడ అభ్యర్థులకు ఏ పోస్టల్ సర్కిల్ కు చెందినవారో దానిని ఎంచుకోవాలి.

Step 4 : తర్వాత ఎంపికైన అభ్యర్థుల జాబితా పీడీఎఫ్ ను డౌన్ లోడ్ చేసుకోండి.

Step 5 : ఆ పీడీఎఫ్ లో అభ్యర్థి పేరు ఉందేమో చెక్ చేసుకోండి.

తదుపరి వ్యాసం