తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Mlc Election Results: ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం..వైసీపీ జోరు

MLC Election results: ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం..వైసీపీ జోరు

HT Telugu Desk HT Telugu

16 March 2023, 11:06 IST

    • MLC Election results: ఆంధ్రప్రదేశ్‌ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది.  రాష్ట్రంలో స్థానిక సంస్థలు, ఉపాధ్యాయు, పట్టభద్రుల నియోజక వర్గాల స్థానాలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ఇప్పటికే  కొన్ని స్థానాలకు సంబంధించిన ఫలితాలు వెలువడ్డాయి. 
మండలి ఫలితాల్లో వైసీపీ జోరు
మండలి ఫలితాల్లో వైసీపీ జోరు

మండలి ఫలితాల్లో వైసీపీ జోరు

MLC Election results: ఆంధ్రప్రదేశ్‌లో ఎనిమిది ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. తొలుత స్థానిక సంస్థల ఫలితాలు, రాత్రికి ఉపాధ్యాయ, అర్ధరాత్రి దాటిన తరువాత గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

IRCTC Tirupati Tour Package : తిరుపతి, కాణిపాకం, శ్రీకాళహస్తి ఆలయాల దర్శనం-విశాఖ నుంచి ఐఆర్సీటీసీ ఎయిర్ టూర్ ప్యాకేజీ!

AP TET Results 2024 : ఏపీ టెట్ ఫలితాలు ఎప్పుడు..?

AP ECET Key 2024 : అలర్ట్... ఏపీ ఈసెట్‌ ప్రాథమిక 'కీ' విడుదల - డైరెక్ట్ లింక్ ఇదే

APHC YS Sunitha: సునీత, రాజశేఖర్‌, సిబిఐ ఎస్పీ రాంసింగ్‌ క్వాష్‌ పిటిషన్లను కొట్టేసిన హైకోర్టు

అన్నిచోట్ల ఎన్నికల అధికారులు ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈసారి నకిలీ ఓట్లు ఎక్కువగా ఉండటం, వారిలో ఎక్కువ మందికి చదువు లేకపోవడంతో ఫలితాల ప్రభావం ఎలా ఉంటుందనేది కొంత ఉత్కంఠ నెలకొంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచి తీరాలని ముఖ్యమంత్రి ఆదేశించడంతో మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ ఈ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించారు. దీంతో ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం గ్రాడ్యుయేట్‌ నియోజకవర్గంలో 37 మంది, ప్రకాశం నెల్లూరు, చిత్తూరులో 22 మంది, కడప, అనంతపురం కర్నూలులో 49 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ప్రకారం, నెల్లూరు, చిత్తూరు ఉపాధ్యాయ నియోజకవర్గంలో ఎనిమిది మంది, కడప, అనంతపురం, కర్నూలు నియోజకవర్గంలో 12 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు.

శ్రీకాకుళం, పశ్చిమగోదావరి, కర్నూలు జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. దీనిలో శ్రీకాకుళంలో ఇద్దరు, పశ్చిమగోదావరిలో ఆరుగురు, కర్నూలులో ముగ్గురు పోటీపడుతున్నారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గం ఎన్నికల ఫలితం తాము వెలువరించే తుది తీర్పుకు లోబడి ఉంటుందని హైకోర్టు బుధవారం పేర్కొంది. ఎన్నికల ఓట్ల లెక్కింపును యథాతథంగా నిర్వహించవచ్చునని స్పష్టం చేసింది.

వెలువడుతున్న ఫలితాలు….

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో 3 పట్టభధ్రుల, 2 ఉపాధ్యాయుల, 4 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 13న పోలింగ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే తిరుపతిలోని రెండు పోలింగ్ కేంద్రాల్లో మార్చి 15న రీపోలింగ్ నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈ రోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. కౌంటింగ్ విషయంలో అధికారులు అన్నిరకాల జాగ్రత్తలు తీసుకున్నారు. కౌంటింగ్ ప్రక్రియలో ముందుగా బ్యాలెట్ పేపర్లను పరిశీలించారు. ముందుగానే చెల్లని ఓట్లను పక్కకు పెట్టేశారు.

శ్రీకాకుళం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో వైసీపీ విజయం సాధించింది. ఇందుకు సంబంధించిన వివరాలను అధికారులు విడుదల చేశారు. వైసీపీ అభ్యర్థి నర్తు రామారావు విజయం సాధించట్టుగా తెలిపారు. మొత్తం 752 ఓట్లు పోలవ్వగా.. నర్తు రామారావుకు 632 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థికి 108 ఓట్లు వచ్చాయి. 12 ఓట్లు చెల్లనివిగా గుర్తించారు.

పశ్చిమగోదావరి జిల్లా ఎమ్మెల్సీలుగా కవురు శ్రీనివాస్ గారు 481 ఓట్లు లతో వంకా రవీంద్ర 460 ఓట్లతో విజయం సాధించారు.ఏలూరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది. రెండు ఎమ్మెల్సీ స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది. వైసీపీ అభ్యర్థులు కవురు శ్రీనివాస్, వంకా రవీంద్రనాథ్ గెలుపొందారు.- కవురు శ్రీనివాస్‍కు 481 ఓట్లు, వంకా రవీంద్రనాథ్‍కు 460 ఓట్లు లభించాయి. కర్నూలులోనూ వైసీపీ అభ్యర్థి డాక్టర్ మధుసూదన్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మధుసూదన్ 359 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

తదుపరి వ్యాసం