Priority for Education: విద్యారంగానికి తొలి ప్రాధాన్యత..బుగ్గన
16 March 2023, 12:26 IST
- Priority for Education:వెలుగుతున్న దీపమే మరిన్ని దీపాలను వెలిగించగలదని, అందుకే ఏపీ సర్కారు విద్యా రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చినట్లు మంత్రి బుగ్గన చెప్పారు. నేర్చుకున్న వారే ఇతరులకు నేర్పగలరనే వాస్తవాన్ని గుర్తించిన ప్రభుత్వం విద్యా రంగంలో వినూత్న సంస్కరణలు అమలు చేస్తున్నట్లు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
Priority for Education: 200ఏళ్లుగా అమెరికా దేశం విద్యపై ఎంతో పెట్టుబడి పెట్టిందని, దాని ఫలితాలను ఇప్పటికే అది అందుకుందని ఏపీ ఆర్ధిక మంత్రి బుగ్గన చెప్పారు. టాప్ 10 యూనివర్శిటీలు అమెరికాలో ఉండటం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్నప్రతిభావంతులైన విద్యార్ధులంతా అమెరికా వెళ్లి, వారిలో సగంమంది అక్కడే ఉండిపోవడం వల్ల అమెరికా అభివృద్ధికి దోహదపడిందని చెప్పారు. థామస్ జెఫర్‌సన్ 76ఏళ్లలో వర్జీనియా యూనివర్శిటీని స్థాపించినట్లు గుర్తు చేశారు. అదే భావనతో తమ ప్రభుత్వం కూడా పయనిస్తోందని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమ్మఒడి, విద్యా కానుక, గోరుముద్ద, పాఠ్యాంశ సంస్కరణలు, సమీకృత పాఠ్యాంశ విధివిధనాలు తీసుకు రావడం ద్వారా విద్యలో సంస్కరణలు తీసుకొచ్చామని చెప్పారు. నిర్దిష్టమైన తరగతి అభ్యాసానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు.
పాఠశాలల్లో సమర్ధవంతమైన విద్యా బోధన కోసం ప్రత్యేక దృశ్యమాధ్యమాలను, స్మార్ట్ టీవీ గదులను ఏర్పాటు చేసినట్లు బుగ్గన వివరించారు. 2024-25లో పది పరీక్షలకు హాజరయ్యే 4.25లక్షల మంది విద్యార్ధులకు ట్యాబ్‌లను పంపిణీ చేసినట్లు బుగ్గన చెప్పారు.
విదేశీ విద్యలో టాప్100 యూనివర్శిటీల్లో అడ్మిషన్లు పొందిన వారికి ఎంత ఖర్చైనా చదువుకోడానికి ప్రభుత్వం సాయం చేస్తుందని చెప్పారు. అమ్మ ఒడి ద్వారా పేదరికం విద్యకు అడ్డు కాకుండా సాయపడుతున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో 44.50లక్షల మంది తల్లులకు, 80లక్షల మంది విద్యార్ధులకు రూ.19,618కోట్ల రుపాయలను అమ్మఒడి పథకం ద్వారా అందచేసినట్లు వివరించారు.
2023-24లో అమ్మఒడి పథకానికి 6500కోట్లను కేటాయించినట్లు మంత్రి బుగ్గన తెలిపారు. 17715 సురక్షిత పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణ, ఇంగ్లీష్ ల్యాబ్‌లు, మరుగుదొడ్లు, వంటగదులు వంటి మౌలిక సదుప 3500కోట్లతో సదుపాయలు కల్పిస్తున్నామన్నారు
విద్యార్ధుల హాజరు శాతాన్ని పెంచడానికి జగనన్న విద్యా కానుక అందిస్తున్నామని చెప్పారు. విద్యార్ధులకు యూనిఫాంలు, పుస్తకాలు తదితర వస్తువులకు రూ.565కోట్లు కేటాయించినట్లు చెప్పారు. విద్యా ద్వారా మాత్రమే మానవాళి జీవితం మెరుగుపడుతుందనే లక్ష్యంతో విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు.
పాలిటెక్నిక్, మెడికల్, ఇంజనీరింగ్, డిగ్రీ కోర్సులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం అమలుచేస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు మూడేళ్లలో 9,249ట్ల రుపాయల రీయింబర్స్ చేయగా జగనన్న వసతి దీవెన 3,366 పంపిణీ చేశారు.ఈ ఏడాది జగనన్న విద్యాదీవెనకు2841,జగనన్నవసతి దీవెనకు 2200కోట్లు కేటాయించారు. మొత్తంగా 2023-24 బడ్జెట్‌లో పాఠశాల విద్యకు రూ.29,690 కోట్లను కేటాయించినట్లు చెప్పారు. ఉన్నత విద్యకు 2,064కోట్లు కేటాయిస్తున్నట్లు బుగ్గన తెలిపారు.