తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  September16 Telugu Updates : దేశానికి కేసీఆర్‌ నాయకత్వం అవసరం - మాజీ సీఎం వాఘేలా
ఏపీ తెలంగాణ తాజా వార్తలు
ఏపీ తెలంగాణ తాజా వార్తలు

September16 Telugu Updates : దేశానికి కేసీఆర్‌ నాయకత్వం అవసరం - మాజీ సీఎం వాఘేలా

16 September 2022, 21:22 IST

  • సెప్టెంబర్ 16 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వార్తల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి. అప్ డేట్స్ కోసం ఎప్పటికప్పుడూ పేజీని రిఫ్రెష్ చేస్తూ ఉండండి

16 September 2022, 21:22 IST

కేసీఆర్ నాయకత్వం అవసరం..

దేశానికి కేసీఆర్ నాయకత్వం అవసరం అన్నారు గుజరాత్ మాజీ సీఎం శంకర్‌సింగ్‌ వాఘేలా. శుక్రవారం ప్రగతి భవన్‌ వేదికగా 5గంటల పాటు జరిగిన ఈ భేటీలో తెలంగాణ ప్రగతి, దేశ పరిస్థితులు, జాతీయ రాజకీయాలపై చర్చించారు.

16 September 2022, 21:22 IST

సమైక్యతా ఉత్సవాలు

రాష్ట్రంలో జాతీయ సమైక్యతా ఉత్సవాలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. పట్టణం, పల్లెలన్నీ త్రివర్ణ శోభితమయ్యాయి. ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, ప్రజలు భారీగా జెండా ర్యాలీలో పాల్గొన్నారు. మూడు రోజులపాటు ఈ ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి.జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు వైభవంగా జరుగుతున్నాయి. నేటి ర్యాలీ కార్యక్రమాల్లో బాగంగా కరీంనగర్ అమరవీరుల స్థూపం నుండి నియోజకవర్గ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించి అశేష జనవాహిణితో కలిసి పాల్గొన్నారు.ప్రజలు పెద్ద సంఖ్యలో స్వచ్చందంగా తరలివచ్చి జాతీయ సమైక్యతా దినోత్సవ స్పూర్తిని చాటారు.

16 September 2022, 19:34 IST

రేపు సెలవు

రేపు ప్రభుత్వ కార్యాలయాలకు మరియు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

16 September 2022, 19:32 IST

బోర్డు సభ్యుడిగా చల్లా శ్రీశాంత్‌

ప్రతిష్టాత్మక భారత కాఫీ బోర్డు సభ్యుడిగా ఇన్‌స్టాంట్‌ కాఫీ దిగ్గజం సీసీఎల్‌ ప్రొడక్ట్స్‌ ఎండీ చల్లా శ్రీశాంత్‌ నియమితులయ్యారు. మూడేళ్లపాటు ఆయన ఈ పదవిలో ఉంటారు. ఇన్‌స్టాంట్‌ కాఫీ తయారీదార్ల తరఫున సభ్యుడిగా... బోర్డు ఆయనను ఎంపిక చేసింది. ప్రపంచ కాఫీ పరిశ్రమలో శ్రీశాంత్‌కు 18 ఏళ్ల అనుభవం ఉంది.

16 September 2022, 18:24 IST

కీలక ఆదేశాలు… 

ఏపీ చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ ఎం.కె.మీనా కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల కార్యక్రమాలకు వాలంటీర్లనున దూరంగా ఉంచాలని స్పష్టం చేశారు.ఇప్పటికే ఎవరైనా అలాంటి పనులు అప్పగిస్తే పక్కన పెట్టాలని సూచించారు.  ఓటర్ల నమోదులో వాలంటీర్లను ఉపయోగించవద్దని తెలిపారు. ఓటర్-ఆధార్ అనుసంధానంలోనూ వాలంటీర్లను వినియోగించవద్దని… అభ్యర్థులకు వాలంటీర్లు ఏజెంట్లుగా ఉండకూడదని పేర్కొన్నారు.

 

16 September 2022, 17:51 IST

అంబానీ భారీ విరాళం

రిలయన్స్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్  ముఖేష్ అంబానీ శుక్రవారం టీటీడీ ట్ర‌స్టుకు రూ.1.5 కోట్లు విరాళంగా అందించారు. ఇందుకు సంబంధించిన డీడీని తిరుమల శ్రీ‌వారి ఆల‌యంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ ఈవో ఎవి. ధర్మారెడ్డికి అందజేశారు

16 September 2022, 17:50 IST

సిగ్గుచేటు..

తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల వేడుకల పేరుతో ప్రభుత్వ నిధులను కొల్లగొట్టేందుకు ప్రజల ప్రాణాలతో టీఆర్ఎస్ నేతలు చెలగాటమాడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలో వజ్రోత్సవాల పేరుతో కమీషన్ల కోసం కుళ్లిపోయిన భోజన ప్యాకెట్లును అందించి చిన్నారులతో సహా ప్రజల ఆరోగ్యంతో ఆటలాడటం సిగ్గు చేటన్నారు.

16 September 2022, 17:28 IST

నలుగురు మృతి

కృష్ణా జిల్లాలో విషాదం నెలకొంది. బావిలోకి దిగి నలుగురు వ్యక్తులు మృతి చెందారు. పూడిక తీస్తుండగా ఘటన చోటు చేసుకుంది.

16 September 2022, 17:11 IST

బెయిల్ మంజూరు

అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత, ఆమె భర్త పి.రామకోటేశ్వరరావుకు హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. సీబీఐ కోర్టు తీర్పు అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణ డిసెంబరు 16కు వాయిదా పడింది.

16 September 2022, 16:39 IST

ఎమ్మెల్సీ కవిత ట్వీట్

ఈడీ నోటీసుల అంశంపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. తనకు ఎలాంటి నోటీసులు రాలేదని స్పష్టం చేశారు. నిజనిర్థారణ తర్వాతే వార్తలు వేయాలని ట్వీట్ చేశారు.

16 September 2022, 16:30 IST

మంత్రి సంచలన వ్యాఖ్యలు

ఏపీ మంత్రి అమర్ నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది నుంచి విశాఖ నుంచే పాలన ఉంటుందని.. త్వరలోనే అసెంబ్లీలో బిల్లు పెడుతామని చెప్పారు. అందరూ సిద్ధంగా ఉండాలన్నారు

16 September 2022, 16:28 IST

అసెంబ్లీ వాయిదా

ఇవాళ పారిశ్రామిక ప్రగతిపై జరిగిన చర్చలో సీఎం జగన్ మాట్లాడారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి ఢోకా లేదని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి ప్రసంగం తర్వాత ఏపీ అసెంబ్లీ సోమవారానికి వాయిదా పడింది.

16 September 2022, 16:27 IST

శ్రీవారి సేవలో శ్రీమంతుడు..

ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్‌ సంస్థల అధినేత ముఖేశ్‌ అంబానీ శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అంబానీ కుటుంబం సమేతంగా అభిషేకం, నిజపాద దర్శన సేవలో పాల్గొన్నారు. కుటుంబానికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసింది టీటీడీ. దర్శనానంతరం రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీస్సులు అందుకున్నారు. అంబానీ మాట్లాడుతూ తిరుమల శ్రీవారిని సందర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. తిరుమల దేవస్థానం ఏటా అభివృద్ధి చెందుతోందని కొని యాడారు. ఈ పర్యటనలో ఆయన చిన్న కుమారుడు అనంత్ అంబానీకి కాబోయే భార్య రాధిక మర్చంట్‌తో కలిసి వచ్చారు

16 September 2022, 16:27 IST

కృష్ణంరాజు ఇంటికి కేంద్రమంత్రి

ఇటీవల అనారోగ్యంతో మరణించిన మాజీ కేంద్ర మంత్రి కృష్ణంరాజు  నివాసానికి కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్  కాసేపటి క్రితమే చేరుకున్నారు. ఈ సందర్భంగా కృష్టంరాజు భార్య, పిల్లులు, హీరో ప్రభాస్‌ (Prabhas)ను కేంద్రమంత్రి ఓదార్చారు. 

16 September 2022, 14:43 IST

కేసీఆర్ తో మాజీ సీఎం భేటీ

సీఎం కేసీఆర్‌తో గుజరాత్‌ మాజీ సీఎం శంకర్‌సింగ్‌ వాఘేలా భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో కేసీఆర్‌తో ఆయన సమావేశమయ్యారు. జాతీయ రాజకీయాలు, ఇతర అంశాలపై నేతలిద్దరూ చర్చించారు.

16 September 2022, 14:29 IST

: టీఎస్‌ఎఫ్‌ఎస్‌ఎల్‌లో ఉద్యోగాలు…

తెలంగాణ పోలీసు విభాగానికి చెందిన ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబొరేటరీ (టీఎస్‌ఎఫ్‌ఎస్‌ఎల్‌) లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ అక్టోబర్ 10వ తేదీతో ముగియనుంది.

16 September 2022, 13:39 IST

వచ్చే ఎన్నికల్లో టీడీపీని జనం బాదుతారు…

రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం జగన్ చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే పార్థసారథి అన్నారు. మూడేళ్లుగా రాష్ట్ర ఇమేజ్‍పై ప్రతిపక్షం విషం చిమ్ముతోందని  రాష్ట్రానికి పట్టిన దరిద్రమే ప్రతిపక్ష నేత చంద్రబాబు అని ఆరోపించారు.  తప్పుడు నివేదికలతో ప్రజలను చంద్రబాబు మభ్యపెట్టారని, చంద్రబాబు తీరును మాకీ సంస్థ తీవ్రంగా తప్పుబట్టిందని గుర్తు చేశారు.  గత టీడీపీ ప్రభుత్వం ప్రచార ఆర్భాటాలకే పరిమితమైందని, గతంలో కేవలం కాగితాల్లో మాత్రమే పెట్టుబడులు వచ్చాయని,  వచ్చే ఎన్నికల్లో టీడీపీని ప్రజలు బాదేస్తారని జోశ్యం చెప్పారు. 

16 September 2022, 13:37 IST

ఎమ్మెల్సీ కవిత పర్సనల్ ఆడిటర్ ఇంట్లో ఈడీ దాడులు

టిఆర్‌ఎస్‌  ఎమ్మెల్సీ కవిత ఆడిటర్ గోరంట్ల అసోసియేట్స్ కార్యాలయంలో ఈడీ సోదాలు నిర్వహించింది. గ్రాఫర్ చౌరస్తా జాగృతి కార్యాలయం సమీపంలోని శ్రీకృష్ణ రెసిడెన్సీలో ఉదయం నుంచి తనిఖీలు నిర్వహిస్తున్నారు.  కొంతకాలంగా ఎమ్మెల్సీ కవిత దగ్గర ఆడిటర్‍గా  బుచ్చిబాబు వ్యవహరిస్తున్నారు. 

16 September 2022, 11:51 IST

టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్

ఏపీ శాసన సభ నుంచి టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. అసెంబ్లీ ప్రవర్తన నియమావళి సబ్‌ రూల్‌ 2 ప్రకారం  బెందాళం అశోక్‌ , అచ్చన్నాయుడు, ఆదిరెడ్డి భవానీ, గోరంట్ల బుచ్చయ్య, నిమ్మకాయల చిన్నరాజప్ప, గండ్ర వెంకటరెడ్డి,  జోగేశ్వరావు , పయ్యావుల కేశవ, మంతెన రామరాజు, అనగాని సత్యప్రసాద్, డోలా బాలవీరాంజనేయులు వెలగపూడి రామకృష్ణ, గొట్టిపాటి రవికుమార్‌లను ఒకరోజు పాటు సభ నుంచి సస్పెండ్ చేశారు. 

16 September 2022, 11:38 IST

పాదయాత్ర చేసేవారిలో రైతులెందరు…?

పాదయాత్ర చేస్తున్న రైతుల్లో ఎంత మంది స్థానికులు ఉన్నారో తెలియదని మంత్రి నాగార్జున విమర్శించారు. మూడు ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నదే వైసిపి ప్రభుత్వం లక్ష్యమని చెప్పారు.  5 ఏళ్లు అధికారం ఇచ్చినా టిడిపి ఏమి చేయలేక పోయిందని ఎద్దేవా చేశారు.  ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందనే మా ప్రభుత్వం విచారణ చేస్తోందని, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు స్థాయిని మించి మాట్లాడుతున్నారని విమర్శించారు.  రాజధాని ఎక్కడ వస్తుందో ముందే తెలుసు నా దగ్గర డబ్బులు లేకే భూములు కొనలేకపోయనని చెప్పారని,  అందుకే ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగైందని చెబుతున్నామన్నారు.  చంద్రబాబు దగ్గర ఆ పార్టీ నేతలు చప్రాసి ఉద్యోగం చేస్తున్నారపి.  ఏమి లేని చోట చెట్లు పుట్టలో అంబేడ్కర్ విగ్రహం పెడతారా అని నిలదీశారు. 

16 September 2022, 11:33 IST

నేడు హైదరాబాద్ కు రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా

కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్‌ ఇవాళ హైదరాబాద్‌కు రానున్నారు. రాజ్‌నాథ్ సింగ్‌ మధ్యాహ్నం 2 గంటలకు బేగంపేట విమానాశ్రయం చేరుకోనున్నారు.మధ్యాహ్నం 2.40గం.కు కృష్ణంరాజు నివాసానికి వెళ్తారు. కృష్ణంరాజు కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. అనంతరం మధ్యాహ్నం 3.05 గంటలకు ఫిల్మ్‌నగర్‌లో కృష్ణంరాజు సంతాపసభలో పాల్గొంటారు.

 కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఈ రోజు  రాత్రి 9 గంటల 50 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. రాజేంద్ర నగర్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో బస చేస్తారు. 

16 September 2022, 11:13 IST

పరిశ్రమలకు వ్యతిరేకంగా టీడీపీ కుట్రలు

పారిశ్రామికాభివృద్ధిని అడ్డుకునేందుకు టీడీపీ కుట్రలు చేస్తోందని మంత్రి అమర్నాథ్ ఆరోపించారు. పరిశ్రమల ఏర్పాటుకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని,  పరిశ్రమల గురించి మాట్లాడే అర్హత టీడీపీకి లేదన్నారు.  - బల్క్ డ్రగ్ పార్క్ వద్దంటూ టీడీపీ నేతలు లేఖలు రాశారని  కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అసెంబ్లీలో  మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రకటించారు. 

16 September 2022, 11:05 IST

నేడు హైదరాబాద్‌కు రాజ్‌నాథ్‌ సింగ్

నేడు హైదరాబాద్‌కు కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్  రానున్నారు.మధ్యాహ్నం 2 గంటలకు బేగంపేట్‌ ఎయిర్‌పోర్ట్‌కు రాజ్‌నాథ్‌ చేరుకుంటారు. ఇటీవల మరణించిన నటుడు కృష్ణంరాజు కుటుంబీకులకు పరామర్శించనున్నారు. ఫిల్మ్ నగర్‌లో జరిగే కృష్ణంరాజు సంస్మరణ సభలో రాజ్‌నాథ్‌ పాల్గొననున్నారు.  సాయంత్రం 4.20 గంటలకు రాజ్‌నాథ్‌ ఢిల్లీకి తిరుగు పయనం కానున్నారు. 

16 September 2022, 11:03 IST

పెదపారుపూడి పీఎస్ దగ్గర ఉద్రిక్తత

కృష్ణా జిల్లా పెదపారుపూడి పీఎస్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది.  టీడీపీ నేతలు రావి వెంకటేశ్వరరావు, వర్ల కుమార్ రాజాలను  అరెస్ట్ చేశారు.  పీఎస్ ముట్టడికి టీడీపీ శ్రేణుల యత్నించడంతో   పోలీసులు అడ్డుకున్నారు.  టీడీపీ నేత ఈశ్వరరావుపై దాడి చేసినవారిని అరెస్ట్ చేయాలని నినాదాలు చేశారు. నిందితులను అరెస్ట్ చేయకుండా తమను అడ్డుకోవడం ఏంటంటూ వాగ్వాదానికి దిగారు.  వైసీపీ శ్రేణులు, కొడాలి పీఏ లక్ష్మోజీని అరెస్ట్ చేయాలని రోడ్డుపై బైఠాయించారు.  టీడీపీ నేతలను అరెస్ట్ చేసి వివిధ పీఎస్‍లకు తరలించారు.  తోపులాటలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావుకు గాయాలయ్యాయి. 

16 September 2022, 11:03 IST

ఏపీ అసెంబ్లీలో కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు

టీడీపీ హయాంలో దేవాలయాల అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారని మంత్రి కొట్టు సత్యనారాయణ ఆరోపించారు.  టీడీపీ హయాంలో 23 దేవాలయాలను కూలగొట్టారని,  చంద్రబాబు కూల్చిన ఆలయాలను తాము పునరుద్ధరించా మని చెప్పారు. గత గోదావరి పుష్కరాల్లో కోట్ల రూపాయల మేర అవినీతి జరిగిందని,  గోదావరి పుష్కరాల్లో 29 మంది మృతికి చంద్రబాబు కారణమయ్యారని ఆరోపించారు.  చంద్రబాబు షూటింగ్ పిచ్చికి అమాయకులు బలయ్యారని, - అంతర్వేదిలో రథం కాలిపోతే రాజకీయం చేశారని,  రూ.కోటికి పైగా ఖర్చు చేసి కొత్త రథాన్ని తయారు చేశామన్నారు.  రూ.3 కోట్లతో రామతీర్థం ఆలయాన్ని పునరుద్ధరించామని,  వైఎస్ జగన్ సీఎం అయ్యాక భక్తుల విశ్వాసాలను నిలబెట్టారని  మంత్రి కొట్టు సత్యనారాయణ చెప్పారు. 

16 September 2022, 11:03 IST

అన్నా క్యాంటీన్‌ ఏర్పాటు వివాదం

సత్తెనపల్లి తాలుకా సెంటర్‍లో అన్న క్యాంటీన్ ఏర్పాటుకు టీడీపీ సన్నాహాలు చేస్తోంది.  కోడెల శివప్రసాదరావు వర్ధంతి సందర్భంగా క్యాంటీన్ ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభించారు. మరోవైపు క్యాంటీన్ ప్రదేశంలో మినీలారీ, పెట్రోలింగ్ వాహనం  పోలీసులు అడ్డుపెట్టారు.  టెంట్ సామాన్లు, కుర్చీలు వెనక్కి పంపారు.  పోలీసులు ఉద్దేశపూర్వకంగా అడ్డంకులు సృష్టిస్తున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. 

16 September 2022, 11:03 IST

తిరుమలలో అంబానీ

తిరుమల శ్రీవారిని పారిశ్రామిక వేత్త ముఖేశ్ అంబానీ దర్శించుకున్నారు.  ముఖేశ్ అంబానీకి టీటీడీ ఈవో ధర్మారెడ్డి  స్వాగతం పలికారు.  శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్న ముఖేశ్ అంబానీ,  శ్రీవారి ఆశీస్సులు ప్రతిఒక్కరికి ఉండాలని కోరుకున్నారు. అనంతరం  టీటీడీ నిర్వహిస్తోన్న గోశాలను  అంబానీ సందర్శించారు. 

16 September 2022, 11:03 IST

పెన్నా నది ఆక్రమణలపై లోకాయిక్త ఆగ్రహం

 పెన్నా నది ఆక్రమణలపై లోకాయిక్త ఆగ్రహం వ్యక్తం చేసింది.  అనంతపురం జిల్లాలో పెన్నానది ఆక్రమణలపై సుమోటోగా కేసు నమోదు చేయాలని అధికారుల్ని ఆదేశించింది.  అనంతపురం కలెక్టర్, తాడిపత్రి మున్సిపల్ కమిషనర్, విద్యుత్, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులను ప్రతివాదులుగా నోటీసులు జారీ చేిసది.  పెన్నానదిపై ఆక్రమణల తొలగింపునకు కమిటీ వేయాలని ఆదేశించారు. మూడు నెలల్లోగా నివేదిక ఇవ్వాలని లోకాయుక్త ఆదేశించింది. 

16 September 2022, 11:03 IST

టీడీపీ సభ్యుల నిరసన

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాల రెండో రోజు తెలుగు దేశం పార్టీ నిరసనకు దిగివంది. బాదుడే బాదుడు పై నారా లోకేష్ ఆధ్వర్యంలో తెలుగుదేశం నిరసన తెలిపారు.  ధరలు దిగిరావాలి అంటే జగన్ దిగిపోవాలంటూ తెలుగుదేశం పార్టీ సభ్యులు  నినాదాలు చేశారు.  నిత్యావసరాల ధరల బాదుడు తగ్గించేలా చర్యలు డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. తుళ్లూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద టిడిపి శాసనసభ పక్షం నిరసన తెలిపింది. ధరలు ఆకాశంలో... జగన్ ప్యాలస్ లో అంటూ నినాదాలు చేశారు. చెత్తపై పన్నేసిన చెత్త సిఎం జగన్ అని ప్లకార్డుల ప్రదర్శించారు. 

 

    ఆర్టికల్ షేర్ చేయండి