BRAU Recruitment 2024 : శ్రీకాకుళం అంబేడ్కర్ యూనివర్శిటీలో ఫ్యాకల్టీ పోస్టులు - కేవలం ఇంటర్వ్యూనే..!
25 September 2024, 10:35 IST
- ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి శ్రీకాకుళంలోని అంబేడ్కర్ యూనివర్శిటీ నోటిఫికేషన్ జారీ చేసింది. కేవలం ఇంటర్వ్యూల ద్వారానే వీటిని భర్తీ చేయనున్నారు. సెప్టెంబర్ 30వ తేదీన ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూలు జరుగుతాయి. మొత్తం 22 ఖాళీలు ఉన్నాయి.
అంబేద్కర్ యూనివర్శిటీలో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్శిటీ (శ్రీకాకుళం)లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. 2024-25 విద్యా సంవత్సరానికి కాంట్రాక్ట్ పద్ధతిలో సబ్జెక్ట్ కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ పోస్టులను ఎటువంటి పరీక్ష లేకుండా భర్తీ చేస్తున్నారు. కేవలం ఇంటర్య్వూ ద్వారానే ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. సెప్టెంబర్ 30 ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
ఏ విభాగంలో ఎన్ని పోస్టులు…?
మొత్తం 22 సబ్జెక్ట్ కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇంజినీరింగ్ సీఎస్ఈలో మూడు, ట్రిపుల్ ఈలో మూడు, మెకానికల్‌లో ఒకటి, సివిల్‌లో రెండు, పీజీ కోర్సుల్లో ఫిజిక్స్‌లో రెండు, మైక్రో బయోలజీలో ఒకటి, రూరల్ డవలప్‌మెంట్‌లో ఒకటి, ఎంఎల్ఐఎస్సీలో ఒకటి, స్పెషల్ ఎడ్యుకేషన్‌లో ఒకటి, ఐటెప్‌లో ఒకటి, సోషల్ వర్క్‌లో ఒకటి, డీసీఎంఎస్‌లో ఒకటి, కమ్యూనికేషన్ స్కిల్స్‌లో రెండు, అననాటికల్ స్కిల్స్‌లో ఒకటి, సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనర్ ఒకటి పోస్టులను భర్తీ చేస్తారు. ఇతర వివరాల కోసం యూనివర్శిటీ అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్ https://www.brau.edu.in/assets/pdf/notifications/23-sep-24/subject-contract-faculty-2024-2025-notification.pdf లో చూడొచ్చు.
డిప్లోమా కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్శిటీ (శ్రీకాకుళం)లో డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆరు నెలల డిప్లమా కోర్సు ఎర్లీ చైల్డ్ హుడ్ కేర్ ఎడ్యుకేషన్ (ఈసీసీఈ)-2024-25లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఈ కోర్సును ఆరు నెలల పాటు ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారు. అలాగే కోర్సును మూడేళ్లలోగా పూర్తి చేయాల్సి ఉంటుంది.
తెలుగు, ఇంగ్లీష్ మాధ్యమాల్లో కోర్సు ఉంటుంది. విద్యా అర్హత అభ్యర్థులు కనీసం పదో తరగతి ఉత్తీర్ణలై ఉండాలి. కోర్సు ట్యూషన్ ఫీజు రూ. 5,000 ఉంటుంది. ఫీజును “The Registrar, Dr.B.R.Ambedkar University Srikakulam” payable at Etcherlaకు ఏదైనా జాతీయ బ్యాంకులో చెల్లించాలి. 75 శాతం అటిండెన్స్ ఉంటేనే, ఆ అభ్యర్థులు మాత్రమే కోర్సు ఫైనల్ పరీక్షలకు రాయడానికి అర్హులు.
అంగన్‌వాడీ కార్యకర్తలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు వివరించారు. యూనివర్శిటీ వెబ్‌సైట్ https://www.brau.edu.in/ లో దరఖాస్తు డౌన్‌లోడ్ చేసుకుని, ఆన్‌లైన్ లేదా, డీడీ రూపంలో రూ.250 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈనెల 30వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్ https://www.brau.edu.in/assets/pdf/notifications/20-sep-24/admission-certificate-course-early-childhood-care-education.pdf ను ఓపెన్ చేసి చదవండి.