తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Appsc Group2 : గ్రూప్-2 పోస్టులకు భారీగా దరఖాస్తులు, ఒక్కో పోస్టుకు 537 మంది పోటీ

APPSC Group2 : గ్రూప్-2 పోస్టులకు భారీగా దరఖాస్తులు, ఒక్కో పోస్టుకు 537 మంది పోటీ

22 January 2024, 17:07 IST

google News
    • APPSC Group2 : ఏపీపీఎస్సీ గ్రూప్-2 పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. మొత్తం 899 పోస్టులకు 4,83,525 మంది దరఖాస్తు చేసుకోగా, ఒక్కో పోస్టుకు 537 మంది పోటీ పడుతున్నారు.
ఏపీపీఎస్సీ గ్రూప్-2
ఏపీపీఎస్సీ గ్రూప్-2

ఏపీపీఎస్సీ గ్రూప్-2

APPSC Group2 : ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 897 పోస్టులు నోటిఫికేషన్ ఇవ్వగా, తాజాగా మరో రెండు పోస్టులను చేర్చింది. ఈ 899 పోస్టులకు ఇటీవల దరఖాస్తు ప్రక్రియ పూర్తైంది. గ్రూప్-2 పోస్టులకు మొత్తం 4,83,525 మంది దరఖాస్తు చేసుకున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. అంటే ఒక్కో పోస్టుకు 537 మంది పోటీప‌డుతున్నారు. ఇప్పటికే దరఖాస్తు గడువు ముగియడంతో అప్లికేషన్లలో తప్పులను సవరించుకునేందుకు జ‌న‌వ‌రి 24 వరకు ఎడిట్‌ ఆప్షన్‌ ఇచ్చినట్లు ఏపీపీఎస్సీ వెల్లడించింది. ఫిబ్రవరి 25న స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించనున్నారు.

పరీక్ష విధానం

గ్రూప్-2 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్స్, కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌లలో ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. స్క్రీనింగ్‌ పరీక్షలో జనరల్‌ స్టడీస్‌, మెంటల్‌ ఎబిలిటీ ఉంటాయి. ఈ పరీక్షను 150 ప్రశ్నలతో 150 మార్కులకు నిర్వహిస్తారు. ప్రిలిమినరీలో అర్హత సాధించిన అభ్యర్థులను మెయిన్స్ కు ఎంపిక చేస్తారు. మెయిన్స్ లో రెండు పేపర్లను 300 మార్కులకు నిర్వహిస్తారు. ఒక్కొక్కటి 150 మార్కులు కేటాయించారు. పేపర్-1లో చూస్తే ఏపీ సామాజిక, సాంస్కృతిక చరిత్ర, భారత రాజ్యాంగం అంశాలు ఉన్నాయి. ఇక పేపర్-2లో చూస్తే భారతదేశ, ఏపీ ఆర్థిక వ్యవస్థ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అంశాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. ప్రతి సెక్షన్ కు 75 మార్కులు కేటాయించారు.

899 పోస్టుల భర్తీ

ఏపీపీఎస్సీ గ్రూప్ -2 నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 899 పోస్టులతో గ్రూప్ -2 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో ఎగ్జిక్యూటివ్ పోస్టులు-331..... నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు- 566 ఉన్నాయి. ముందు 897 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయగా, మరో రెండు పోస్టులను జోడించింది. ఫిబ్రవరి 25వ తేదీన ప్రిలిమనరీ పరీక్ష ఉంటుందని తెలిపింది. డిసెంబర్ 21 నుంచి జనవరి 10 వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని వెల్లడించింది. ఆ తర్వాత దరఖాస్తు గడువును జనవరి 17కు పెంచింది.

గ్రూప్-1 దరఖాస్తు గడువు పెంపుపై క్లారిటీ

ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 పోస్టులకు డిసెంబర్ 8వ తేదీన‌ నోటిఫికేషన్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువు జ‌వ‌వ‌రి 21వ తేదీతో ముగిసింది. గ్రూప్‌-1కు భారీగా ద‌ర‌ఖాస్తులు వ‌చ్చిన‌ట్టు ఏపీపీఎస్సీ తెలిపింది. జ‌న‌వ‌రి 24 వరకు గ్రూప్‌-1 అప్లికేషన్ల ఎడిట్‌ కు అభ్యర్థులకు అవకాశం కల్పించింది. గ్రూప్‌-1 దరఖాస్తు గడువును పొడిగించాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే గ్రూప్‌-1 దరఖాస్తు గడువును పెంచే ఆలోచ‌న లేద‌ని ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది.

తదుపరి వ్యాసం