తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Adhar Camps In Ap: ఏపీలో స్పెషల్ ఆధార్‌ క్యాంపులు..ఆన్‌లైన్‌లో ఉచితంగా అప్డేట్

Adhar Camps In AP: ఏపీలో స్పెషల్ ఆధార్‌ క్యాంపులు..ఆన్‌లైన్‌లో ఉచితంగా అప్డేట్

HT Telugu Desk HT Telugu

20 March 2023, 13:43 IST

google News
    • Adhar Camps In AP: ఆధార్‌ డేటాబేస్‌లో వివరాలను అప్డేట్ చేసుకోడానికి  నేటి నుంచి ఐదు రోజుల పాటు ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేస్తున్నట్లు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రకటించింది. పదేళ్లలో ఒక్కసారి కూడా ఆధార్ వివరాలను అప్డేట్ చేసుకోని వారి వివరాలను అప్డేట్ చేసుకోవాలని సూచిస్తున్నారు. 
గ్రామ, వార్డుల సచివాలయాల్లో నేటి నుంచి ఆధార్ క్యాంపులు
గ్రామ, వార్డుల సచివాలయాల్లో నేటి నుంచి ఆధార్ క్యాంపులు

గ్రామ, వార్డుల సచివాలయాల్లో నేటి నుంచి ఆధార్ క్యాంపులు

Adhar Camps In AP: ఆంధ్రప్రదేశ్‌లో ఆధార్‌ డేటాను అప్డేట్ చేయడం కోసం గ్రామ, వార్డు సచివాలయాల్లో ఐదు రోజుల పాటు ప్రత్యేక క్యాంపుల్ని నిర్వహిస్తున్నారు. ఆధార్ సేవలు అందుబాటులో ఉన్న గ్రామ, వార్డు సచివాలయాల్లో నేటి నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. 20, 21,27,28,29 తేదీలలో సచివాలయాల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ షన్‌మోహన్ జిల్లా కలెక్టర్లు, సచివాలయ విభాగాలకు సూచించారు.

గ్రామ, వార్డు సచివాలయ ప్రాంగణాలతో పాటు స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉండే ప్రాంతాల్లో ప్రత్యేక క్యాంపుల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఆధార్ క్యాపుల సమాచారాన్ని స్థానిక ప్రజలకు తెలిసేలా ఎంపీడీవోలు, మునిసిపల్ కమిషనర్లు చర్యలు తీసుకోవాలని సూచించాచు.

ప్రతి క్యాంపు పరిధిలో వాలంటీర్లు 2014కంటే ముందే ఆధార్‌ కార్డులను పొందినా ఇప్పటి వరకు ఒక్కసారి కూడా వివరాలను అప్డేట్ చేసుకోని వారిని తమ వివరాలు నమోదు చేసుకునేలా చూడాలని సూచించారు.

ఏపీలో ఆధార్ కార్డు తీసుకుని పదేళ్లైనా ఇప్పటి వరకు ఒక్కసారి కూడా తమ చిరునామా, ఫోటో ధృవీకరణ వంటి వివరాలను అప్డేట్ చేసుకోని వారు దాదాపు 1.56కోట్ల మంది ఉన్నట్లు యుఐఏడిఐ గుర్తించింది. 2022 డిసెంబర్ 31 నాటికి ఏపీలో 5,19,98,236మందికి ఆధార్‌ కార్డులు మంజూరు చేశారు. వారిలో 1.56కోట్ల మందికి ఆధార్ డేటా అప్డేట్ చేయాల్సి ఉందని పేర్కొన్నారు.

ఉచితంగా అప్డేట్….

వ్యక్తిగత వివరాలను ఆన్‌లైన్‌లో ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆన్‌లైన్‌లో సొంతంగా ఆధార్ వివరాలను అప్డేట్ చేసుకునే వారికి ఈ వెసులుబాటు ఉంటుందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల పేరుతో ప్రతి ఒక్కరు ఆధార్ కార్డులను అప్డేట్ చేసుకోవాలని అధికారులు సూచించారు. యూఐడిఏఐ ప్రమాణాలకు అనుగుణంగా ధృవీకరణ పత్రాలను జారీ చేయడానికి ఏర్పాట్లు చేయాలని సూచించారు.

కొత్త కార్డుల జారీకి వీలుగా డేటా బేస్‌ అప్డేట్ అందుబాటులో ఉన్నట్లు హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయం నుంచి ఏపీ సిఎస్ కార్యాలయానికి సమాచారం అందింది. ప్రతి ఒక్కరు పదేళ్లకోసారైనా ఆధార్ కార్డులను వివరాలను అప్డేట్ చేసుకోవాలనే నిబంధనలను ఇటీవల అమల్లోకి వచ్చిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మార్చి 16 నుంచి జూన్ 14వరకు వ్యక్తిగతంగా వివరాలను అప్డేట్ చేసుకునే వారికి ఫీజుల నుంచి మినహాయింపు లభిస్తుంది.

తదుపరి వ్యాసం