తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Nandyala Accident: నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు హైదరాబాద్‌ ఆల్వాల్ వాసుల దుర్మరణం

Nandyala Accident: నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు హైదరాబాద్‌ ఆల్వాల్ వాసుల దుర్మరణం

Sarath chandra.B HT Telugu

06 March 2024, 8:21 IST

    • Nandyala Accident: నంద్యాల జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో  ఐదుగురు మృతి చెందారు.  ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల వద్ద ఆగివున్న లారీని  కారు ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది.  ఈ ఘటనలో కొత్త జంటతో పాటు ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. 
నంద్యాల జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో  ఐదుగురి దుర్మరణం
నంద్యాల జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురి దుర్మరణం

నంద్యాల జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురి దుర్మరణం

Nandyala Accident: దైవదర్శనం చేసుకుని స్వస్థలానికి తిరిగి వెళుతున్న వారిని రోడ్డు ప్రమాదం బలితీసుకుంది. తిరుపతిలో దర్శనం పూర్తి చేసుకుని వెళుతున్న కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం కబళించింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా హైదరాబాద్‌కు Hyderabad ఆల్వాల్‌కు చెందిన వారిగా గుర్తించారు.

ట్రెండింగ్ వార్తలు

AP Petrol Bunks : ఏపీ సర్కార్ కీలక నిర్ణయం, ఖాళీ బాటిళ్లలో పెట్రోల్ అమ్మకాలపై నిషేధం

Ramanarayanam IRCTC Package : సింహాచలం, శ్రీరామనారాయణం, విశాఖ బీచ్ ల సందర్శన- ఐఆర్సీటీసీ 2 రోజుల టూర్ ప్యాకేజీ వివరాలివే

Anantapur Road Accident : పెళ్లింట తీవ్ర విషాదం - షాపింగ్ కు వెళ్లి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు మృతి

Tirumala Darshan Tickets : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ - నేడు ఆగస్టు నెల ఆర్జితసేవా టికెట్లు విడుదల

ఫిబ్రవరి 29న రవీందర్‌ -లక్ష్మీ దంపతుల కుమారుడు సాయికిరణ్ వివాహం జరిగింది. మూడో తేదీన రిసెప్షన్ ముగిసిన తర్వాత 4వ తేదీ ఉదయాన్నే తిరుపతి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో  ఉండగా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో డ్రైవర్‌ కూడా ప్రాణాలు కోల్పోయాడు. 

నంద్యాల జిల్లా  Nandyala District ఆళ్లగడ్డ మండలంలో నల్లగట్లలో Nallagatla జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన ఓ కుటుంబం మొత్తం ప్రాణాలు కోల్పోయింది. కొడుకు, కోడలితో కలిసి తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని తిరిగి హైదరాబాద్ వెళుతున్న కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం బలి తీసుకుంది.

నంద్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదంలో రవీందర్‌, లక్ష్మీలతో పాటు వారి ఇద్దరు కుమారులు, కోడలు ప్రాణం కోల్పోయారు. ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు మృతిచెందారు. నిద్రమత్తు, వేగంగా ప్రయాణించడంతో పాటు ఆగిఉన్న లారీని గుర్తించ లేకపోవడంతో ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు.

తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్టు పోలీసులు గుర్తించారు. మృతులను రవీందర్, లక్ష్మీ దంపతులు, ఉదయ్ కిరణ్, సాయికిరణ్, కోడలు కావ్యశ్రీ మృతిచెందారు. ప్రమాదంలో కుటుంబం మొత్తం ప్రాణాలను కోల్పోవడం అందరిని కలిచి వేసింది. రోడ్డు ప్రమాదంతో కర్నూలు-హైదరాబాద్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

ప్రమాదంలో మృతి చెందిన బాలకిరణ్-కావ్యశ్రీలకు గత నెల 29న వివాహం జరిగింది. మార్చి 3న వీరి రిసెప్షన్ జరిగింది. ఆల్వాల్‌ దినకరన్‌ కాలనీలో నివాసం ఉంటున్న వీరు కొత్త జంటతో కలిసి తిరుపతి దర్శనానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో  నంద్యాల జిల్లాలో ప్రమాదానికి గురయ్యారుర. 

 

మంత్రి కాన్వాయ్ ఢీకొని ఒకరి మృతి

ప్రకాశం జిల్లాలో మంత్రి ఆదిమూలపు సురేష్ Adimupalpu Suresh కాన్వాయ్ వాహనం ఢీకొని ఒకరు మృతి చెందారు. త్రిపురాంతకం Tripurantakam మండలం కేశినేనిపల్లి వద్ద జాతీయ రహదారిపై ఆటోను ఢీకొన్న మంత్రి ఆదిమూలపు సురేష్ ఎస్కార్ట్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాజుపాలెం చెందిన ఇజ్రాయిల్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి, మరొకరి తీవ్ర గాయాలయ్యాయి.

క్షతగాత్రుడిని మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రమాద సమయంలో మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రయాణిస్తున్న వాహనం వెనుక ఉన్న ఎస్కార్ట్ వాహనం అదుపు తప్పి ఆటోను ఢీకొట్టింది. సీఎం పర్యటన ఉన్న నేపథ్యంలో విజయవాడ నుంచి మంత్రి సురేష్ మార్కాపురం వస్తుండగా ఘటన జరిగింది. మృతుడిని త్రిపురాంతకం మనరాజుపాలెంకు చెందిన ఇజ్రాయిల్‌గా గుర్తించారు.

తదుపరి వ్యాసం