Vizag minor Girl rape: విశాఖలో మైనర్ బాలికపై వైద్యుడి అత్యాచారం
10 January 2024, 9:28 IST
- Vizag minor Girl rape: మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన వైద్యుడిపై విశాఖలో కేసు నమోదైంది.
విశాఖలో బాలికపై అత్యాచారం
Vizag minor Girl rape: కుటుంబ అవసరాల కోసం చదువుకుంటూ ఉద్యోగం చేస్తోన్న మైనర్ బాలికపై వైద్యుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగు చూసింది. విశాఖపట్నంలో మహారాణిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చిన్న పిల్లల వైద్యుడిగా పనిచేస్తోన్న డాక్టర్ భవానీ శంకర్‌పై బాధితురాలు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.
ఇంటర్ చదువుతున్న బాలిక కుటుంబ అవసరాలతో ప్రైవేట్ ఆస్పత్రిలో సహాయకురాలిగా ఉద్యోగంలో చేరింది. బాలిక పరిస్థితిని అవకాశంగా తీసుకున్న వైద్యుడు ఆమెపై కన్నేశాడు. బాలిక విధుల్లో ఉన్న సమయంలో పని ఉందని గెస్ట్‌హౌస్‌కు తీసుకువెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తప్పించుకుని పారిపోయే ప్రయత్నం చేయడంతో సూర్యారావు అనే మరో వ్యక్తి ఆమెను కొట్టి బంధించాడు. ఆ తర్వాత వారి నుంచి తప్పించుకున్న బాలిక తల్లిదండ్రులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
బాలికపై అత్యాచారానికి పాల్పడిన డాక్టర్ భవానీశంకర్‌పై పోక్సో కేసుతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు మహారాణిపేట పోలీసులు తెలిపారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించారు.