తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Sankranti Special Trains: సంక్రాంతికి దక్షిణ మధ్య రైల్వే 20 ప్రత్యేక రైళ్లు

Sankranti Special Trains: సంక్రాంతికి దక్షిణ మధ్య రైల్వే 20 ప్రత్యేక రైళ్లు

Sarath chandra.B HT Telugu

22 December 2023, 9:54 IST

google News
    • Sankranti Special Trains: సంక్రాంతి పండుగ రద్దీకి అనుగుణంగా దక్షిణ మధ్య  రైల్వే పరిధిలో  20 ప్రత్యేక రైళ్లను ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాలకు వీటిని నడుపనున్నారు. 
సంక్రాంతికి 20 ప్రత్యేక రైళ్లు
సంక్రాంతికి 20 ప్రత్యేక రైళ్లు

సంక్రాంతికి 20 ప్రత్యేక రైళ్లు

Sankranti Special Trains: సంక్రాంతికి ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు పలు ప్రాంతాలకు 20 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

పండుగ కోసం సొంత ఊళ్లకు వెళ్లే వారి సౌకర్యార్థం రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడుపనున్నారు. కాచిగూడ-కాకినాడ టౌన్‌, హైదరాబాద్ -తిరుపతి రూట్లలో ఈ ప్రత్యేక రైళ్లను నడుపుతారు. డిసెంబర్‌ 28 నుంచి జనవరి 26వరకు ఈ రైళ్లు రాకపోకలు కొనసాగించనున్నాయి. ప్రత్యేక రైళ్లలో ఫస్ట్‌ ఏసీ, సెకెండ్‌ ఏసీ, థర్డ్‌ ఏసీతో పాటు స్లీపర్‌, జనరల్‌ బోగీలు ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

కాచిగూడ -కాకికనాడ టౌన్‌ స్పైషల్ ట్రైన్‌ (నంబర్ 07653) గురువారం రాత్రి 8.30 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుంది. ఈ రైలు డిసెంబర్‌ 28, జనవరి 4, 11, 18, 25 తేదీల్లో నడుస్తుంది.

కాకినాడ టౌన్‌- కాచిగూడ ప్రత్యేక రైలు (నంబర్ 07654) శుక్రవారం సాయంత్రం 5.10 గంటలకు బయల్దేరి మరుసటి రోజు తెల్లవారు జామున 4.50 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. ఈ రైలు డిసెంబర్‌ 29, జనవరి 5, 12, 19, 26 తేదీల్లో ప్రయాణిస్తుంది.

హైదరాబాద్‌ -తిరుపతి ప్రత్యేక రైలు (నంబర్ 07509) గురువారం రాత్రి 7.25 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8.20 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుంది. ఈ రైలు డిసెంబర్‌ 29, జనవరి 4, 11, 18, 25 తేదీల్లో నడుస్తుంది.

తిరుపతి - హైదరాబాద్‌ ప్రత్యేక రైలు (నంబర్ 07510) శుక్రవారం రాత్రి 8.15 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8.40 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుంది. ఈ రైలు డిసెంబర్‌ 29, జనవరి 5, 12, 19, 26 తేదీల్లో రాకపోకలు సాగిస్తుంది.

కాచిగూడ-కాకినాడ టౌన్‌-కాచిగూడ ప్రత్యేక రైళ్లు (రైలు నంబర్ .07653/07654) మల్కాజిగిరి, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట రైల్వే స్టేషన్ల మీదుగా రాకపోకలు కొనసాగించనున్నాయి.

హైదరాబాద్‌ -తిరుపతి- హైదరాబాద్‌ ప్రత్యేక రైళ్లు (రైలు నంబర్ 07509/07510) సికింద్రాబాద్‌, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తాయని అధికారులు తెలిపారు.

తదుపరి వ్యాసం