YCP vs TRS : మంత్రి హరీశ్ రావ్ కామెంట్స్ కు వైసీపీ నేతల కౌంటర్-sajjala ramakrishna reddy strong counter to telangana minister harish rao ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Ycp Vs Trs : మంత్రి హరీశ్ రావ్ కామెంట్స్ కు వైసీపీ నేతల కౌంటర్

YCP vs TRS : మంత్రి హరీశ్ రావ్ కామెంట్స్ కు వైసీపీ నేతల కౌంటర్

Sep 30, 2022 06:06 PM IST HT Telugu Desk
Sep 30, 2022 06:06 PM IST

  • ts minister harish rao Vs ycp leaders : తెలంగాణ మంత్రి హరీష్ రావ్ వ్యాఖ్యలకు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటర్ ఇచ్చారు. గురువారం ఓ సందర్భంలో తెలంగాణ మంత్రి హరీశ్ రావు .. ఏపీలో టీచర్లు, వ్యవసాయ మోటార్లకు మీటర్ల గురించి స్పందించారు.  ఏపీలో ఉపాధ్యాయుల ప‌ట్ల ఆ రాష్ట్ర ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోందని చెప్పారు.  ఇప్పుడు ఆ కామెంట్సే ఇరు రాష్ట్రాల మధ్య డైలాగ్ వార్‌కు కారణమయ్యాయి. హరీష్ రావు ఎందుకు అలా మాట్లాడారో అర్ధం కావడం లేదన్న సజ్జల.. ఇది రెండు రాష్ట్రాల మధ్య అంశం కాదని స్పష్టం చేశారు. సీఎం జగన్‌ను విమర్శించి రెచ్చగొట్టాలని చూస్తున్నట్టుగా కన్పిస్తుందని అనుమానించారు. ఏదో గ్యాంగ్‌తో జతకట్టి హరీష్ రావు మాట్లాడినట్టుగా అనిపిస్తుందని వ్యాఖ్యానించారు. మరోవైపు మంత్రులు బొత్స, అమర్ నాథ్ కూడా హరీష్ కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు. లింక్ పై క్లిక్ చేసి వీడియో చూడండి……..

More