Adilabad District : వెంటనే ఎత్తివేయాలి...! బెల్ట్ పాపులపై దాడికి దిగిన మహిళలు
Adilabad District News: అదిలాబాద్ జిల్లాలో మద్యం బెల్ట్ దుకాణాలపై మహిళల దాడికి దిగారు. వెంటనే దుకాణాలను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Attack On Liquor Belt Shops: విచ్చలవిడి మద్యం అమ్మకాలు కుటుంబాల అభివృద్ధికి కుంటుపడుతున్నాయని ఆ గ్రామ మహిళలకు అగ్రహం తెచ్చిపెట్టాయి. కుటుంబాలు చిన్నబిన్నమవుతున్నాయని మహిళలు మధ్య దుకాణాలపై విరుచుకుపడేలా చేశాయి.
వివరాల్లోకి వెళితే అదిలాబాద్ జిల్లా(Adilabad district) తలమడుగు మండలం కోసాయి గ్రామంలో గ్రామ మహిళలు మద్యం అమ్మకాలు కొనసాగించరాదంటూ ఆందోళన వ్యక్తం చేశారు. అంతటితో కాకుండా గ్రామంలోని మద్యం బెల్ట్ దుకాణాలపై పెద్ద ఎత్తున చేరుకొని దాడులు(Attack On Liquor Belt Shops) నిర్వహించారు. గ్రామ శివారులోని బెల్ట్ దుకాణం చేరుకొని అక్కడ మద్యం సీసాలను కింద పారబోసి బాటిల్లను విసిరేశారు. ఈ సందర్భంగా కొందరు మహిళలు మాట్లాడుతూ…. యువత మద్యం కు బానిసగా మారి భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో మద్యం మహమ్మారితో కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయని ఆందోళనకు దిగామన్నారు, మద్యం విక్రయదారులకు మద్యం విక్రయించరాదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కోసాయి గ్రామ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రభుత్వం వెంటనే మద్యపానం నిషేధం అమలు చేయాలని డిమాండ్ చేశారు.
తేనెతీగల దాడి లో 40 మందికి గాయాలు
ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలపై తేనెటీగలు దాడి చేసిన ఘటనలో 42 మందికి గాయాల య్యాయి. ఆదిలాబాద్ జిల్లా బేల మండలం దౌను గూడ గ్రామపంచాయతీ పరిధిలోని రేణిగుడ గ్రామ సమీపంలో గురువారం ఉదయం 60 మంది కూలీలు తవ్వకం పనులు చేస్తున్నారు. పక్కనే ఉన్న చెట్ల పొదల్లో తేనెటీగలు లేచి కూలీలపై దాడి చేశాయి. దీంతో వారు గ్రామం వైపు పరుగు తీశారు. తేనెటీగల దాడిలో 42 మందికి గాయాలయ్యాయి. వీరిలో 15 మంది మహిళలు ఉన్నారు. విషయం తెలిసిన వెంటనే కలెక్టర్ రాజర్షి షా.. ఉపాధి హామీ అధికారులను, వైద్య సిబ్బందిని అలర్ట్ చేశారు. వెంటనే జిల్లా కేంద్రం నుంచి 5 అంబులెన్స్ లను ఘటనాస్థలానికి పంపించి బాధితులను ఆదిలాబాద్ రిమ్స్ కు తరలించారు. రిమ్స్ డైరెక్టర్, డాక్టర్లు వెంటనే చికిత్స అందించారు. గాయపడినవారు రెండు రోజుల్లో కోలుకుంటారని వైద్యులు తెలిపారు.