Adilabad Politics: అదిలాబాద్‌ జిల్లా మున్సిపాలిటీల్లో అవిశ్వాసాల అలజడి...-adilabad municipalities threat of incorrect dissent ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Adilabad Municipalities Threat Of Incorrect Dissent

Adilabad Politics: అదిలాబాద్‌ జిల్లా మున్సిపాలిటీల్లో అవిశ్వాసాల అలజడి...

HT Telugu Desk HT Telugu
Dec 28, 2023 01:04 PM IST

Adilabad Politics: బీఆర్ఎస్ కోటను బద్దలుకొట్టి అనూహ్యంగా కాంగ్రెస్అధికారంలోకి రావడంతో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో అవిశ్వాస రాజకీయాలు ఒక్కసారిగా జోరందుకున్నాయి.

అదిలాబాద్‌లో బిఆర్‌ఎస్‌కు అసమ్మతి ముప్పు
అదిలాబాద్‌లో బిఆర్‌ఎస్‌కు అసమ్మతి ముప్పు

Adilabad Politics: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో ఉమ్మడి అదిలాబాద్‌ జిల్లతాలో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. మున్సిపల్, మండల పరిషత్, జడ్పీ, డీసీసీబీ చైర్మన్ వరకు అవిశ్వాసాల ముప్పు పొంచి ఉండటంతో కీలక పదవుల్లో ఉన్న చైర్మన్, వైస్ చైర్మన్లు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

అవిశ్వాసాలతో పదవీ, పరపతిని కోల్పోవడం కన్నా అధికార కాంగ్రెస్ పార్టీ మిన్నగా భావించిన నేతలంతా కాంగ్రెస్ వైపు క్యూ కడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో 4 కాంగ్రెస్, 4 స్థానాల్లో బీజేపీ గెలుచుకోగా, బీఆర్ఎస్ రెండు స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

జిల్లాలో అధికార కాంగ్రెస్ పార్టీదే ఆధిపత్యం కొనసాగుతున్న నేపథ్యంలో గులాబీ పార్టీలో ఇమడలేక పదవుల కోసం కొంత మంది కాంగ్రెస్లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీలో క్రమేపి రాజకీయాలు వేడెక్కుతున్నాయి, ఇన్ని రోజులు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉండడంతో మున్సిపల్ చైర్మన్లు పార్టీలో ఉండడం గమనార్హం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో టిఆర్ఎస్ పార్టీలో ఉన్న వైస్ చైర్మన్ లు పదవుల కోసం కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తున్నారు.

కొన్ని మున్సిపాలిటీలో అవిశ్వాసం ప్రకటించి కౌన్సిలర్లతో క్యాంప్ రాజకీయాలు చేస్తున్నారు, ఇటీవల నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీలో ప్రస్తుత చైర్మన్ పై కొందరు కౌన్సిలర్లు అవిశ్వాసం ప్రకటించారు, ప్రస్తుత చైర్మన్ పైన అసంతృప్తితో రగులుతున్నారు. అంటి ముట్టనట్లు వ్యవహరిస్తున్నారు.

ఆదిలాబాద్ మాజీ ఎమ్మెల్యే జోగురామన్నకు ప్రధాన అనుచరుడైన డిసిసిబి చైర్మన్ అడ్డిబోజారెడ్డి సైతం బిఆర్ఎస్ పార్టీని వీడేందుకు రంగం సిద్ధం చేసుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈనెల ఆదిలాబాదు మంత్రి శ్రీధర్ బాబువస్తున్న నేపథ్యంలో ఆయన సమక్షంలోనే కాంగ్రెస్ గూటికి చేరనున్నట్లు వీరితో పాటు పలువురు జడ్పీటీసీలు, ఎంపీపీలు కూడ చేరిపోనున్నట్లు తెలుస్తుంది. దీంతో బిఆర్ఎస్ పార్టీ క్రమంగా ఖాళీ అవుతోంది.

ఊపందుకున్న అవిశ్వాసాలు:

ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటిలో క్రమేపి రాజకీయాలు క్రమేపి వేడెక్కు తున్నాయి. ఇంతకాలం బిఆర్ఎస్ పార్టీకి పెట్టని కోటగా ఉన్న మున్సిపాలిటిల్లో అవిశ్వాసాల ముప్పు ముంచుకు రావడంతో పదవులు కాపాడుకునేందుకు ఓవైపు ప్రయత్నాలు జోరందుకోగా మరోవైపు కౌన్సిలర్లు అవిశ్వాసం ద్వారా తమ పరపతి పెంచుకునేందుకు వలసల బాట పట్టారు. దీంతో ఐదారు మున్సిపాలిటీలు కాంగ్రెస్ ఖాతాలో జమ కానున్నాయి.

మంచిర్యాల జిల్లాలో మూడుఅసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ గెలుపొందడంతో మున్సిపాలిటిల్లో సీన్ మారింది. బెల్లంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత అసెంబ్లీ ఫలితాలు వచ్చిన మరుసటి రోజే ఎమ్మెల్యే గడ్డం వినోద్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిపోగా, మంచిర్యాలలోనూ అదే పరిస్థితి నెలకొనడంతో కౌన్సిలర్లందరు మూకుమ్మడిగా బిఆర్ఎస్కు రాజీనామా చేసి ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావు సమక్షంలో చేరారు.

నిర్మల్ జడ్పీ చైర్ పర్సన్ పై అవిశ్వాస యత్నం!

కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడమే తరువాయి వివిధ పాలకవర్గాల్లో అవిశ్వాసం దిశగా పావులు కదుపుతున్నారు, ఈ మేరకు నిర్మల్ జిల్లా మాజీ మంత్రి ఇంద్రకరణ్ ఇలాకలో జడ్పి చైర్ పర్సన్ పై అవిశ్వాసానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి, జడ్పీ చైర్ పర్సన్ ను అవిశ్వాస తీర్మానం పెట్టి పది నుంచి తప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. జిల్లాలో 18 జెడ్పీసీలు ఉండగా మారిన రాజకీయ పరిమాణాల నేపథ్యంలో అధిక సంఖ్యలో జడ్పీటీసీ లు కాంగ్రెస్ వైపు కదులుతూ జడ్పీ ఛైర్పర్శన్ సీటు కోసం పావులు కదుపుతున్నారు.

(రిపోర్టింగ్ : కామోజీ వేణుగోపాల్, ఉమ్మడి అదిలాబాద్)

WhatsApp channel