Pet Dog Attacked Infant : పెంపుడు కుక్క దాడిలో 5 నెలల పసికందు మృతి, రష్మి వ్యాఖ్యలపై నెటిజన్లు ఫైర్!
Pet Dog Attacked Infant : వికారాబాద్ జిల్లా తాండూరులో విషాద ఘటన చోటుచేసుకుంది. 5 నెలల చిన్నారిపై పెంపుడు కుక్క దాడి చేసింది. ఈ దాడిలో చిన్నారి మృతి చెందాడు. ఈ ఘటనపై రష్మి చేసిన పోస్టులపై నెటిజన్లు మండిపడుతున్నారు.
Pet Dog Attacked Infant : వికారాబాద్ జిల్లా తాండూరులో విషాదం చోటుచేసుకుంది. ముక్కుపచ్చలారని పనికుందుపై పెంపుడు కుక్క దాడి చేసింది. ఈ దాడిలో చిన్నారి మృతి చెందాడు. తాండూరు బసవేశ్వర్ నగర్ లో నివశిస్తున్న దత్తు, లావణ్య దంపతులకు 5 నెలల బాబు ఉన్నాడు. వీళ్లు ఒక కుక్కను పెంచుకుంటున్నారు. మంగళవారం పెంపుకు కుక్క పసికందుపై దాడి చేసింది. ముఖంపై తీవ్రమైన గాయం చేసింది. పెంపుడు కుక్క దాడితో చిన్నారి పెద్దగా ఏడ్వడంతో తల్లిదండ్రులు పరుగున వచ్చి చూశారు. అప్పటికే కుక్క తీవ్రమైన గాయం చేయడంతో పనికందు విగతజీవిగా మారాడు. ముక్కుపచ్చలారని చిన్నారిని చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. రక్షణ కోసం పెంచుకున్న కుక్కే తమ బిడ్డను చంపడంతో వారికి ఎవరిని నిందించాలని తెలియలేదు. అయితే ఈ ఘోరమైన సంఘటన గురించి తెలుసుకున్న స్థానికులు, బంధువులు ఆగ్రహంతో శునకాన్ని కొట్టి చంపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. రాష్ట్రంలో చిన్నారులపై వీధి కుక్కల దాడుల సంఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. అయితే ఇప్పుడు పెంపుకుక్క దాడి చేయడం విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
రష్మి వ్యాఖ్యలపై నెటిజన్లు ఫైర్
పెంపుడు కుక్క దాడిలో పనికందు మృతిచెందిన ఘటనపై నెటిజన్లు విచారం వస్తూ మెసేజ్ లు పెడుతున్నాయి. అయితే జబర్దస్త్ యాంక్ రష్మి గౌతమ్ ఈ ఘటనపై వివాదాస్పదంగా పోస్టు పెట్టారు. వికారాబాద్ జిల్లా తాండూర్లో పసికందుపై పెంపుడు కుక్క దాడి చేసింది. ఈ దాడిలో ఐదు నెలల చిన్నారి మృతిచెందింది. దీంతో చిన్నారి బంధువులు ఆ కుక్కను కొట్టి చంపారు. ఈ ఘటనపై ఓ నెటిజన్ స్పందిస్తూ... ఆ కుక్కను చంపినందుకు చిన్నారి తల్లిదండ్రులపై కేసు పెట్టాలని రష్మి గౌతమ్ అంటుందంటూ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ కు రష్మి స్పందిస్తూ సుదీర్ఘంగా పోస్టు పెట్టింది. పిల్లలను కన్న తర్వాత బాధ్యతగా వ్యవహరించాలంటూ కామెంట్లు పెట్టింది. చిన్నారిని సరిగ్గా పట్టించుకోకుండా...తల్లిదండ్రులు ఎందుకు వదిలేశారు. కుక్క దాడి చేస్తున్న సమయంలో తల్లిదండ్రులు నిద్రపోతున్నారా? ఆ చిన్నారి ఏడుపు వారికి వినిపించలేదా? అని ప్రశ్నించింది. మూగజీవులపై ఈ చెత్త ప్రచారాన్ని ఆపండంటూ పోస్టు పెట్టింది. పిల్లల పట్ల తెలివి తక్కువగా వ్యవహరించే తల్లిదండ్రుల వెయ్యి వీడియోలను షేర్ చేయగలనన్నారు. పిల్లల జీవితాలను రిస్క్ పెట్టింది తల్లిదండ్రులే కదా అన్నారు. జంతువుల విషయంలో మాత్రం మీకు లాజిక్స్ అవసరంలేదన్నారు. ఈ ప్రపంచాన్ని ఇబ్బందులకు గురి చేసి మీరంతా ప్రశాంతతను పొందాలనుకుంటే అది సాధ్యమయ్యే పనికాదన్నారు. రష్మి వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. అయితే రష్మి మాత్రం హితబోధ చేసింది. పెంపుడు కుక్కలు ఉన్న వాళ్లు పిల్లలను అలా నిర్లక్ష్యంగా విడిచిపెట్టొద్దని తెలిపింది.
పెంపుడు జంతువులకు శిక్షణ ఇవ్వాలి
ఈ విషయంపై నెటిజన్లు రష్మి లక్ష్యంగా ట్వీట్లు చేస్తున్నారు. వీటికి రష్మి సమాధానాలు చెబుతోంది. మరో నెటిజన్ స్పందిస్తూ... తల్లిదండ్రులు 24 గంటలు పిల్లలతో ఉండలేరని, ఇలాంటి ఘటన క్షణాల్లో జరుగుతుంటాయన్నారు. అవును, అనుకోకుండా జరిగి ఇలాంటి ఘటనపై తల్లిదండ్రులు నిర్ల్యక్షంగా ఉండకూడదని సూచించింది. తల్లిదండ్రులు ఇలాంటి చిన్న తప్పులు చేయకుడదని తెలిపింది. బయటి వారిపై దాడి చేయకుండా పెంపుడు జంతువులు పెంచాలని, ఆవిధంగా యజమానులు శిక్షణ ఇవ్వాలని సూచించింది. దాడి జిరిగితే యజమానిపై కేసు పెట్టాలని తెలిపింది.
సంబంధిత కథనం