Rythu Bandhu - Rythu Bhima Scam : కోట్లు కాజేశారు...! వెలుగులోకి రైతుబంధు, రైతుబీమా కుంభకోణం, ఏఈవో అరెస్ట్
Rythu Bandhu - Rythu Bhima Scam : రైతుబంధు, రైతుబీమా నిధులను దారి మళ్లించిన కేసులో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు సైబరాబాద్ పోలీసులు. ఇందులో ఒకరు ఏఈవోగా ఉన్నారు.
Diversion of Rythu Bhima and Rythu Bandhu Funds: రైతుబంధు, రైతు బీమా పథకం డబ్బులు పక్కదారి పడుతున్నట్లు వస్తున్న వార్తలు తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారింది. దీంతో ఈ వ్యవహారంపై పోలీసులు నిఘా పెట్టారు.నకిలీ పత్రాలతో రైతు బంధు,రైతు భీమా డబ్బులు కాజేస్తున్నారని రంగారెడ్డి జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
గత కొన్నేళ్ళ నుంచి రైతుబంధు, బీమా డబ్బులను నిందితులు విత్ డ్రా చేసుకొని తమ సొంత అవసరాలకు వాడుకుంటున్నట్లు వెలుగులోకి రావడంతో అధికారులు షాక్ తిన్నారు. నకిలీ పత్రాలు సృష్టించి..... నకిలీ వ్యక్తుల పేర్లతో డబ్బులు తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. భూములు లేకపోయినా ఉన్నట్లుగా సృష్టించి..... రైతుబంధు,రైతు బీమా పథకాలు డబ్బులను తీసుకున్నట్టు తెలిపారు.నిందితులను చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు లోతైన విచారణ చేపట్టారు. అయితే దీనిపై సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చారు.
చనిపోయిన వారి పేరిట క్లెయిమ్ చేసి.....
రంగారెడ్డి జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ ఫిర్యాదుతో రైతుబంధు, రైతు భీమా మీద పథకం డబ్బులు కొట్టేసినట్లు వెలుగులోకి వచ్చిందన్నారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలో 20 రైతు భీమా క్లెయిమ్ లు జరిగినట్లు వెల్లడించారు.అయితే ఈ 20 క్లెయిమ్స్ అనుమానాస్పదంగా ఉన్నాయని అగ్రికల్చర్ ఆఫీసర్ తమతో చెప్పినట్లు సీపీ పేర్కొన్నారు. ఈ 20 రైతు భీమా క్లెయిమ్స్ ద్వారా సుమారు రూ.కోటి రూపాయల ఎల్ఐసి అమౌంట్ రైతు భీమా కింద డైవర్ట్ చేసినట్లు అవినాష్ మహంతి వెల్లడించారు. సుమారు 130 నకిలీ పట్టాధారులను సృష్టించి రైతు బంధు స్కీం లో క్లెయిమ్ చేశారన్నారు.ఇందులో కొంత మంది అప్పటికే మరణించి ఉన్నారని సంచలన విషయాలు భయట పెట్టారు.
కందుకూరు మండల పోలీస్ స్టేషన్లో ఏఈఓ గోరటి శ్రీశైలం తో పాటు వీర స్వామిని అరెస్ట్ చేశామని సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి పేర్కొన్నారు. 2000 మంది రైతులకు దక్కాల్సిన రైతు బంధు, రైతు భీమా డబ్బును మళ్లించి...… డెత్ సర్టిఫికెట్ లో పైన కింద ఒరిజినల్ అని ఉంటుందనీ..... కానీ మధ్యలో ఉండే పేర్లు, ఇతర వివరాలను ఏఈఓ శ్రీశైలం మార్ఫింగ్ చేసినట్లు ఆయన వివరించారు. ఈ డబ్బుతో ఏ ఈ ఓ శ్రీశైలం వ్యవసాయ భూమిని కొనుగోలు చేసినట్లు అవినాష్ మహంతి తెలిపారు.తన బంధువులు, ఇతర కుటుంబ సభ్యులకు భూములు ఉన్నాయని తనకు మాత్రమే లేకపోవడంతోనే ఇలా చేసినట్లు నిందుతుడు శ్రీశైలం ఒప్పుకున్నట్లు సీపీ పేర్కొన్నారు.
ఏకంగా 2000 మంది రైతులకు సంబంధించిన రైతు బంధు,రైతు భిమను శ్రీశైలం మరియు వీర స్వామి గత కొన్నాళ్లుగా కానేస్తునట్లు చెప్పుకొచ్చారు.రైతులు రైతు బంధు,భీమా పథకాల డబ్బు గురించి నిలదీసిన ప్రతీ సారి ఏదో ఒక సాకు చెప్పే వాడని సీపీ వివరించారు. వీరస్వామితో ఏడు బ్యాంక్ అకౌంట్లు ,జాతీయ బ్యాంకులలో ఎకౌంట్లు క్రియేట్ చేశాడని.....ఏటీఎం బ్యాంక్ పాస్ బుక్ లు మాత్రం తన వద్దే పెట్టుకునే వాడని తెలిపారు. ఏఈఓ అక్రమంగా కొనుగోలు చేసిన భూమిని,ఇతర ఆస్తులను,నగదును ఏసీబీకి అప్పగిస్తామని సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి వెల్లడించారు.