TSRTC Pushpak Buses : విమానంలో ఉన్న సౌకర్యాలు.. ఇక బస్సుల్లో కూడా-tsrtc pushpak bus services to airport with all facilities
Telugu News  /  Telangana  /  Tsrtc Pushpak Bus Services To Airport With All Facilities
టీఎస్ఆర్టీసీ పుష్పక్ సర్వీసులు
టీఎస్ఆర్టీసీ పుష్పక్ సర్వీసులు

TSRTC Pushpak Buses : విమానంలో ఉన్న సౌకర్యాలు.. ఇక బస్సుల్లో కూడా

06 September 2022, 21:58 ISTHT Telugu Desk
06 September 2022, 21:58 IST

TSRTC Bus Services : ప్రయాణికులను ఆకర్శించేందుకు టీఎస్ఆర్టీసీ ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. సాంకేతికతను అందిపుచ్చుకుంటూ ముందుకెళ్తోంది. డిజిటల్ సేవలను ప్రవేశపెట్టింది.

నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల్లోకి తెచ్చేందుకు ఆ సంస్థ ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. సాంకేతికతను అందిపుచ్చుకుని ముందుకెళ్తోంది. అందులో భాగంగానే టెక్నాలజీని.. పరిచయం చేస్తుంది. పుష్పక్‌ బస్సుల్లో డిజిటల్‌ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది. గూగుల్‌పే, ఫోన్‌పే, పేటీఎం, తదితర మొబైల్‌ యాప్‌లతో టికెట్‌ ఛార్జీలను చెల్లించే ఆప్షన్ ఇచ్చారు. అందుకోసమే ప్రత్యేకంగా.. ఇంటెలిజెన్స్‌ టికెట్‌ ఇష్యూ మిషన్లను కూడా తీసుకొచ్చారు.

ప్రయాణికులు.. నగదు, డిజిటల్ రూపంలోనూ.. ఛార్జీలు చెల్లించే వెసులుబాటు ఉంది. అంతేకాదు.. టీఎస్‌ఆర్టీసీ ట్రాక్‌ ను కూడా అందుబాటులోకి తెచ్చింది యాజమాన్యం. ప్రయాణికులు ఈ సదుపాయం ద్వారా.. బస్స్ ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు. పుష్పక్‌ బస్సుల ఎక్కడ ఉన్నాయో ముందుగానే తెలుసుకోవచ్చు. వాటి ఆధారంగా మీరు ఇంట్లో నుంచి బయలుదేరొచ్చు. ఈ టెక్నాలజీని ఇటీవలే.. అందుబాటులోకి తీసుకొచ్చారు.

ఈ టెక్నాలజీ ద్వారా.. బస్సు ఎక్కడ ఉన్నా మీ మెుబైల్ ఫోన్లో చూసుకోవచ్చు. పుష్పక్ బస్సు ఏ టైమ్ కు వస్తుందో చూసుకుంటే.. సకాలంలో ఎయిర్ పోర్టుకు వెళ్లొచ్చు. హైదరాబాద్‌ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే జాతీయ, అంతర్జాతీయ విమాన సర్వీసుల టైమింగ్స్ కు అనుగుణంగా పుష్పక్‌ బస్సులను 24 గంటల పాటు నడుపుతోంది ఆర్టీసీ. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఎయిర్‌పోర్టుకు సుమారు 40 పుష్పక్‌ బస్సులు నడుస్తున్నాయి.

జేబీఎస్, సికింద్రాబాద్‌ నుంచి తార్నాక, ఉప్పల్‌ల మీదుగా ఎయిర్‌పోర్టుకు కొన్ని బస్సులు నడుస్తున్నాయి. బేగంపేట్‌ పర్యాటక భవన్‌ నుంచి మెహిదీపట్నం, ఆరాంఘర్‌ మీదుగా మరికొన్ని బస్సులు ఉన్నాయి. కేపీహెచ్‌బీ జేఎన్‌టీయూ నుంచి గచ్చిబౌలి మీదుగా ఔటర్‌ మార్గంలో పుష్పక్ సర్వీసులు ఉన్నాయి.

అంతేకాదు.. పుష్పక్‌ బస్సుల్లో లక్కీ డిప్‌లను ఏర్పాటు కూడా చేశారు. వీటి ద్వారా.. ముగ్గురు ప్రయాణికులను ఎంపిక చేస్తారు. తిరుమలలో ఉచిత దర్శనం ఉంటుంది. ఆర్టీసీ బస్సుల్లో తిరుపతికి వెళ్లేవారికి ఈ ఛాన్స్ ఉంటుంది. పుష్పక్‌లో ప్రయాణం చేసిన తర్వాత.. టికెట్‌ వెనక పేరు, ఫోన్‌ నంబర్‌ రాసి లక్కీడిప్‌ బాక్సుల్లో వేయాలి.

మరోవైపు ఏసీ బస్సు ఛార్జీలను పది శాతం తగ్గిస్తూ.. టీఎస్ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. వర్షాకాలం ఓ వైపు, శుభకార్యాలు కూడా లేకపోవడంతో ప్రయాణికుల సంఖ్య తగ్గినట్టుగా ఉంది. ప్రయాణికులను ఆకట్టుకోవడంలో భాగంగా.. ఈ నిర్ణయం తీసుకుంది.