APSRTC Discount : ఏపీఎస్‌ఆర్టీసి ఏసీ బస్సుల్లో డిస్కౌంట్…..-apsrtc ac bus charges reduced for the month of september
Telugu News  /  Andhra Pradesh  /  Apsrtc Ac Bus Charges Reduced For The Month Of September
ఏపీఎస్ ఆర్టీసీ ఏసీ బస్సుల్లో డిస్కౌంట్ సేల్
ఏపీఎస్ ఆర్టీసీ ఏసీ బస్సుల్లో డిస్కౌంట్ సేల్ (Hindustan times)

APSRTC Discount : ఏపీఎస్‌ఆర్టీసి ఏసీ బస్సుల్లో డిస్కౌంట్…..

02 September 2022, 12:55 ISTHT Telugu Desk
02 September 2022, 12:55 IST

ప్రయాణికుల ఆక్యుపెన్సీ పెంచుకోవడానికి APSRTC డిస్కౌంట్‌ సేల్ ప్రకటించింది. ఆర్టీసీ దూర ప్రాంతాలకు నడుపుతోన్న ఏసీ సర్వీసుల్లో రాయితీ కల్పిస్తున్నారు. ఆర్టీసిలో ఉన్న రకరకరాల ఏసీ సర్వీసుల్లో సెప్టెంబర్ నెలంతటా రాయితీలు పొందవచ్చని ప్రకటించారు.

ముహుర్తాలు, సెలవులు పెద్దగా లేకపోవడంతో ఆర్టీసీ ఏసీ సర్వీసుల్లో ప్రయాణించే వారి సంఖ్య గణనీయంగా తగ్గడంతో APSRTC డిస్కౌంట్ సేల్ ప్రకటించింది. ఏపీఎస్‌ఆర్టీసి పరిధిల ప్రయాణించే అన్ని రకాల సర్వీసులకు ఈ తగ్గింపు వర్తించనుంది. ఏసీ సర్వీసుల్లో ప్రయాణించే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోవడంతో ఆర్టీసి రాయితీలు ప్రకటించింది. ఆదాయాన్ని పెంచుకునే క్రమంలో కొన్ని ఏసీ సర్వీసులకు 20శాతం,హైదరాబాద్‌ వైపు నడిచే సర్వీసులకు 10శాతం రాయితీ ప్రకటించారు.

గత నెలలో ఏపీఎస్‌ ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ 68శాతం నమోదైంది. ప్రస్తుతం ఆక్యుపెన్సీ పెంచుకోడానికి డిస్కౌంట్ సేల్ ప్రకటించారు. విజయవాడ నుంచి ప్రయాణించే సర్వీసులకు ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది. వీటిలో హైదరాబాద్‌కు నడిచే 33 సర్వీసులతో పాటు 5 విశాఖపట్నం సర్వీసులు, 2 బెంగుళూరు బస్సులు, ఒక చెన్నై సర్వీసుకు రాయితీ ధరలు వర్తిస్తాయి.

విజయవాడ నుంచి చెన్నై, బెంగళూరు వెళ్లే ఏసీ వెన్నెల సర్వీసుల్లో ఆదివారం మినహా అన్ని రోజుల్లో రాయితీ వర్తిస్తుంది. చెన్నై, బెంగళూరు నుంచి వచ్చే బస్సులకు శుక్రవారం మినహా మిగిలిన రోజుల్లో రాయితీ వర్తిస్తుంది. విశాఖపట్నం డాల్ఫిన్ క్రూయిజర్ సర్వీసుల్లో ప్రస్తుత టిక్కెట ధర రూ.1060గా ఉంటే డిస్కౌంట్‌తో రూ.870కు విక్రయిస్తారు. బెంగళూరు వెన్నెల సర్వీసు టిక్కెట్‌ ధరను రూ.2180 ఉంటే రూ.1770కు విక్రయిస్తారు. బెంగళూరు అమరావతి బస్సు టిక్కెట్ ధర రూ.1890 ఉంటే రూ.1540కు విక్రయిస్తారు. చెన్నై డాల్ఫిన్ క్రూయిజ్ బస్సు టిక్కెట్ ధర రూ.1280 ఉంటే రూ.1050కు విక్రయిస్తారు.

విజయవాడ హైదరాబాద్‌ మధ్య రాకపోకలు సాగించే గరుడ, అమరావతి, వెన్నెల ఏసీ సర్వీసులకు విజయవాడ నుంచి వెళ్లేటపుడు శుక్రవారం రెండు వైపులా ప్రయాణాలకు రాయితీ వర్తించదు. ఆదివారం మాత్రం తిరుగు విజయవాడ నుంచివ వెళ్లే బస్సులకు మాత్రమే రాయితీ వర్తించదు. హైదరాబాద్‌ ప్రయాణానికి ప్రస్తుతం వెన్నెల బస్సుల్లో టిక్కెట్ ధర రూ.940ఉంటే వాటిని రూ.850కు విక్రయిస్తారు. అమరావతి సర్వీసుల్లో టిక్కెట్ రూ.830ఉంటే వాటిని రూ.750కు విక్రయిస్తారు. గరుడ సర్వీసుల్లో రూ.740 టిక్కెట్లను రూ.670కు విక్రయిస్తారు. సెప్టెంబర్ నెలాఖరు వరకు ఈ రాయితీ వర్తించనుంది.

టాపిక్