TSPSC Group 3: గ్రూప్ 3 సిలబస్, ఎగ్జామ్ విధానం చూశారా..-tspsc released syllabus for group 3 jobs check full details are here ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tspsc Group 3: గ్రూప్ 3 సిలబస్, ఎగ్జామ్ విధానం చూశారా..

TSPSC Group 3: గ్రూప్ 3 సిలబస్, ఎగ్జామ్ విధానం చూశారా..

HT Telugu Desk HT Telugu
Jan 27, 2023 07:03 AM IST

TSPSC Group 3 Recruitment:గ్రూప్‌-3 పోస్టుల భర్తీ ప్రక్రియకు సంబంధించి అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. జోన్లవారీగా పోస్టుల వివరాలతో సిలబస్ ను కూడా ప్రకటించింది పబ్లిక్ సర్వీస్ కమిషన్.

గ్రూప్ 3 సిలబస్ విడుదల
గ్రూప్ 3 సిలబస్ విడుదల

TSPSC Group 3 Recruitment : తెలంగాణలో ఉద్యోగాల జాతర కొనసాగుతోంది. ఇప్పటికే రిక్రూట్మెంట్ బోర్డుల నుంచి వరుస నోటిఫికేషన్లు వచ్చాయి. ఇటీవల... తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 1,365 పోస్టులతో గ్రూప్ - 3 నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. జనవరి 24 నుంచి దరఖాస్తుల ప్రక్రియ షురూ కాగా… సిలబస్ ను ప్రకటించింది టీఎస్పీఎస్సీ. పరీక్ష విధానానికి సంబంధించిన వివరాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇవే గాకుండా తాజాగా... జోన్లవారీగా పోస్టుల వివరాలను కూడా ప్రకటించింది. సిలబస్ తో పాటు ఎగ్దామ్ విధానం చూస్తే……

3 పేపర్లు - 450 మార్కులు..

గ్రూప్ -3కి సంబంధించి మొత్తం 450 మార్కులకు రాతపరీక్షను నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. మొత్తం 3 పేపర్లు ఉండగా.. ఒక్కో పేపరుకు 150 మార్కులు ఉంటాయి.గ్రూప్ 3 పరీక్షలో మొత్తంగా మూడు పేపర్లు ఉండనున్నాయి. ఒక్కో పేపరుకు 150 మార్కుల చొప్పున 450 మార్కులకు పరీక్షలు నిర్వహిస్తారు. ఒక్కో పేపరు రాసేందుకు రెండున్నర గంటల సమయం ఉంటుంది. బుధవారం ఈ సిలబస్ ను వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకువచ్చింది టీఎస్పీఎస్సీ. గ్రూప్‌-3 పోస్టులకు పోటీపడే అభ్యర్థులు మూడు పేపర్లు రాయాల్సి ఉంటుంది. ప్రతి పేపర్‌లోనూ 150 ప్రశ్నలుంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. ఈ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన అభ్యర్థులను పోస్టులకు ఎంపిక చేయనున్నారు. ఇంటర్వ్యూ ఉండదు. రాత పరీక్షలను తెలుగు, ఇంగ్లిష్‌, ఉర్దూ భాషల్లో నిర్వహిస్తారు.

సిలబస్..

గ్రూప్ 3లోని మొదటి పేపర్ లో జనరల్ నాల్జెడ్ కి సంబంధించి ఉంటుంది. ఇక పేపర్‌-2లో మొత్తం 3 అంశాలు ఉండగా.. ప్రతి అంశంపై 50 ప్రశ్నలు.. 50 మార్కులు ఉంటాయి. ఇదే పేపర్‌లో భారత రాజ్యాంగం అంశానికి 50 మార్కులు, భారత చరిత్రకు మరో 50 మార్కులు ఇచ్చారు. తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అంశానికి 50 మార్కులు ఉంటాయి. పేపర్‌-3లో మూడు అంశాలుండగా.. ఒక్కో అంశానికి 50 మార్కులున్నాయి. వీటిలో భారత ఆర్థిక వ్యవస్థ, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధిలో మార్పులు వంటి అంశాలున్నాయి. గ్రూప్ 3 పోస్టులకు ఎలాంటి ఇంటర్వూ ఉండదు.

గ్రూప్ 3 పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు ఓటీఆర్ పూర్తి చేసి ఉండాలి. టీఎస్పీఎస్సీ అధికారిక వెబ్ సైట్ https://www.tspsc.gov.in/ సైట్ లోకి వెళ్లి వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది.

Whats_app_banner

సంబంధిత కథనం