CISF recruitment 2023: సీఐఎస్ఎఫ్ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్
CISF recruitment 2023: కేంద్ర ప్రభుత్వ పారా మిలటరీ బలగాల్లో ఒకటైన సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సెస్ (Central Industrial Security Force CISF) లో ఉద్యోగాల భర్తీకి (recruitment) నోటిఫికేషన్ విడుదల అయింది.
CISF recruitment 2023: సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సెస్ (Central Industrial Security Force CISF) మొత్తం 451 పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. కానిస్టేబుల్/డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్ (Constable/ Driver cum Pump Operator) ఉద్యోగాల భర్తీకి గానూ ఈ నోటిఫికేషన్ విడుదల అయింది. వీటిలో 183 పోస్ట్ లు కానిస్టేబుల్/డ్రైవర్ (Constable/ Driver) ఉద్యోగాలు కాగా, 268 పోస్ట్ లు కానిస్టేబుల్/డ్రైవర్/ పంప్ ఆపరేటర్ (Constable/ Driver cum Pump Operator) ఉద్యోగాలు. ఈ పోస్ట్ ల కోసం దరఖాస్తుల స్వీకరణ జనవరి 23 నుంచి ప్రారంభమైంది.
CISF recruitment 2023: లాస్ట్ డేట్..
ఈ పోస్ట్ లకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఫిబ్రవరి 22, 2023. ఈ ఉద్యోగాలకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. సీఐఎస్ఎఫ్ (CISF) అధికారిక వెబ్ సైట్ www.cisfrectt.in ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు ఫిబ్రవరి 22 నాటికి 21 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. కేంద్రం లేదా రాష్ట్రం గుర్తించిన బోర్డు నుంచి పదవ తరగతి (Matriculation) కానీ, తత్సమాన అర్హత కానీ సాధించి ఉండాలి.
CISF recruitment 2023: అప్లై ఎలా?
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సెస్ (Central Industrial Security Force CISF) లో (Constable/ Driver cum Pump Operator) ఉద్యోగాలకు ఆన్ లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. CISF అధికారిక వెబ్ సైట్ www.cisfrectt.in ద్వారా ఈ జాబ్స్ కు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు రూ. 100 ను ఆన్ లైన్ లోనే చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీల అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
టాపిక్