TS Group 1 Mains: మొత్తం 900 మార్కులు.. గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షా విధానం ఇదే.. -tspsc finalised group 1 main exams pattern 2022 check full details are here ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Tspsc Finalised Group 1 Main Exams Pattern 2022 Check Full Details Are Here

TS Group 1 Mains: మొత్తం 900 మార్కులు.. గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షా విధానం ఇదే..

HT Telugu Desk HT Telugu
Jan 20, 2023 12:02 PM IST

TSPSC Group -1 Main Exams 2022:గ్రూప్‌-1 మెయిన్స్ ఎగ్జామ్స్ విధానాన్ని టీఎస్‌పీఎస్సీ(తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్) ప్రకటించింది. సబ్జెక్టు నిపుణుల కమిటీ సిఫార్సులను కమిషన్‌ ఆమోదించింది. ఈ మేరకు వివరాలను వెబ్‌సైట్లో పొందుపరిచింది. ఆ వివరాలను చూస్తే....

గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు
గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు

TSPSC Finalised Group -1 Main Exams Pattern 2022: హైకోర్టు తీర్పు తర్వాత గ్రూప్ 1 పోస్టుల భర్తీ ప్రక్రియ వేగంగా ముందుకుసాగుతోంది. ఇప్పటికే ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల కాగా... తాజాగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరో అప్డేట్ ఇచ్చింది. మెయిన్స్ పరీక్షా విధానాన్ని ప్రకటించింది. నిపుణుల కమిటీ సిఫార్సులను కమిషన్ ఆమోదించింది. ఈ మేరకు పరీక్షా విధానంతో పాటు మార్కుల కేటాయింపు వివరాలను స్పష్టంగా పేర్కొంది.

ట్రెండింగ్ వార్తలు

మొత్తం 900 మార్కులు..

ప్రధానపరీక్షలో ఒక్కో పేపరుకు 150 మార్కుల చొప్పున మొత్తం 900 మార్కులకు పరీక్ష నిర్వహిస్తార. పదోతరగతి స్థాయిలో ఇంగ్లీష్‌ పరిజ్ఞానంపై 150 మార్కులకు అర్హత పరీక్ష ఉంటుంది. మెయిన్స్ పరీక్షల్లో 6 ప్రధాన సబ్జెక్టులతో పాటు జనరల్ ఇంగ్లిష్ క్వాలిఫైయింగ్ పరీక్ష ఉంటుంది. ఈ క్వాలిఫైయింగ్ పరీక్షలో అర్హత సాధించిన వారికి మాత్రమే మిగతా 6 పేపర్లను మాత్రమే పరిగణలోకి తీసుకొని పేపర్ల మూల్యాంకనం చేస్తారు. క్వాలిఫయింగ్ టెస్టు 150 మార్కులకు ఉంటుంది. ఇది కేవలం క్వాలిఫయింగ్ టెస్టు మాత్రమే. ఈ మార్కులను మెయిన్స్‌ పరీక్షల్లో (6 పేపర్లు) సాధించిన మొత్తం మార్కులలో మాత్రం కలపరు.

మెయిన్స్ పరీక్షల్లో నిర్వహించే మొత్తం 6 పేపర్లలో.. ప్రతి పేపర్‌కు 150 మార్కుల చొప్పున 900 మార్కులకు మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తారు. ఒక్కో పేపరుకు 3 గంటల సమయం కేటాయించారు.

గతంలో ఇంటర్వూలు ఉండేవి. ప్రస్తుతం అలాంటివి ఏమీ లేవు. ఇప్పుడు ఇంటర్వూలు ఎత్తివేయటంతో 900 మార్కులకే గ్రూప్ -1 మెయిన్స్ నిర్వహించనున్నారు.

అభ్యర్థుల ఎంపికలో కేవలం ఈ ఆరు పేపర్లలో సాధించిన మార్కులను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు.

ప్రిలిమ్స్, క్వాలిఫయింగ్ ఇంగ్లిష్ పరీక్షలలో సాధించిన మార్కులను ప్రధాన పరీక్షలకు కలపరు.

పేపర్‌-1 : జనరల్‌ ఎస్సే

ఈ పేపర్‌లో మూడు సెక్షన్‌లు ఉంటాయి. ఒక్కో సెక్షన్‌కు 50 మార్కులు కేటాయించారు. ఒక్కో సెక్షన్‌లో మూడు ప్రశ్నలు ఉంటాయి. ప్రతిసెక్షన్‌లో ఒక ప్రశ్నకు తప్పనిసరిగా సమాధానం రాయాలి. ఇది వెయ్యిపదాల్లో ఉండాలి. అన్నీ సెక్షన్లకు కలిపి 150 మార్కులు ఉంటాయి.

పేపర్‌-2 : చరిత్ర, సంస్కృతి, జాగ్రఫీ

పేపర్‌-3 : భారతీయ సమాజం, రాజ్యాంగం, పరిపాలన

పేపర్‌-4 : ఎకానమీ, డెవలప్‌మెంట్‌

పేపర్‌-2, 3, 4లలో మూడు సెక్షన్లు ఉంటాయి. ప్రతిసెక్షన్‌లో 5 ప్రశ్నలకు జవాబులు రాయాలి. ఒక్కో సెక్షన్‌కు 50 మార్కులుంటాయి. ప్రశ్నకు సమాధానం 200 పదాల్లో ఇవ్వాలి. ఒక్కోప్రశ్నకు పది మార్కులు ఉంటాయి. అయితే ఒక్కో సెక్షన్‌లో అయిదు ప్రశ్నల్లో తొలిరెండు ప్రశ్నలకు సమాధానం తప్పనిసరిగా ఇవ్వాలి. మూడు, నాలుగు, అయిదు ప్రశ్నల్లో ఛాయిస్‌ ఆప్షన్‌ ఉంటుంది.

పేపర్‌-5 : సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌

ఈ పేపర్ లోనూ 3 సెక్షన్లు ఉంటాయి. మొదటి రెండు సెక్షన్లలో అయిదు ప్రశ్నల చొప్పున ఉంటాయి. ఈ సెక్షన్లలో తొలిరెండు ప్రశ్నలకు తప్పనిసరిగా సమాధానం ఇవ్వాలి. మిగతా మూడు ప్రశ్నలకు ఛాయిస్‌ ఉంటుంది. ప్రశ్నలకు సమాధానం 200 పదాల్లో ఉండాలి. ఇక మూడో సెక్షన్‌లో మొత్తం 30 ప్రశ్నలుంటాయి. వీటిలో 25 ప్రశ్నలకు సమాధానమివ్వాలి. ఒక్కో ప్రశ్నకు రెండు మార్కుల చొప్పున 50 మార్కులు ఉంటాయి.

పేపర్‌-6 : తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటు

మూడు సెక్షన్లు ఉంటాయి. ప్రతిసెక్షన్‌లో అయిదు ప్రశ్నలకు తప్పనిసరిగా సమాధానం రాయాలి. ప్రతి ప్రశ్నకు సమాధానం 200 పదాల్లో ఇవ్వాలి. ఒక్కోప్రశ్నకు పది మార్కులు చొప్పున మొత్తం 15 ప్రశ్నలకు 150 మార్కులు కేటాయించారు. అయితే ఒక్కో సెక్షన్‌లోని అయిదు ప్రశ్నల్లో తొలిరెండు ప్రశ్నలకు సమాధానం తప్పనిసరి ఇవ్వాలి. ఇందులో ఛాయిస్‌ ఉండదు. మూడు, నాలుగు, అయిదు ప్రశ్నల్లో ఛాయిస్‌ ఆప్షన్‌ ఉంటుంది.జనరల్‌ ఇంగ్లీష్‌ అర్హత పరీక్ష: ఇందులో 15 ప్రశ్నలు ఉంటాయి.

NOTE:

మెయిన్స్ పరీక్షా విధానం, సెక్షన్ల వివరాలు, ప్రశ్నల ఛాయిస్ తదితర వివరాలకోసం పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారిక వెబ్‌సైట్‌ https://www.tspsc.gov.in/ ను సందర్శించవచ్చు.

గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షా విధానానికి సంబంధించి కింద ఇచ్చిన PDF చూడండి..

IPL_Entry_Point

సంబంధిత కథనం