TS TET 2024 Updates : తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్ - దగ్గరపడిన దరఖాస్తుల గడువు, ఆ 'ఆప్షన్' కూడా క్లోజ్ కానుంది-ts tet 2024 applications will close on 20th april ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Tet 2024 Updates : తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్ - దగ్గరపడిన దరఖాస్తుల గడువు, ఆ 'ఆప్షన్' కూడా క్లోజ్ కానుంది

TS TET 2024 Updates : తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్ - దగ్గరపడిన దరఖాస్తుల గడువు, ఆ 'ఆప్షన్' కూడా క్లోజ్ కానుంది

Maheshwaram Mahendra Chary HT Telugu
Apr 18, 2024 02:15 PM IST

TS TET 2024 Applications Updates : తెలంగాణ టెట్ దరఖాస్తుల గడువు దగ్గరపడింది. కేవలం రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఏప్రిల్ 20వ తేదీతో అప్లికేషన్ల ప్రాసెస్ పూర్తి కానుంది.

తెలంగాణ టెట్ దరఖాస్తులు - 2024
తెలంగాణ టెట్ దరఖాస్తులు - 2024

TS TET 2024 Applications Updates : తెలంగాణ టెట్ దరఖాస్తుల(TS TET 2024) ప్రక్రియ కొనసాగుతోంది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం… ఏప్రిల్ 10వ తేదీతోనే ఈ ప్రక్రియ ముగియాల్సి ఉండగా…అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు మరో పది రోజుల గడువును పెంచింది విద్యాశాఖ. అయితే ఈ గడువు కూడా దగ్గరపడింది. కేవలం రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఏప్రిల్ 20వ తేదీతో అప్లికేషన్ల ప్రాసెస్ ప్రక్రియ పూర్తి కానుంది. మరోసారి గడువు పెంచే అవకాశం లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఫలితంగా ఎవరైనా దరఖాస్తులు చేసుకోలేని వారు ఉంటే వెంటనే చేసుకోవాలని సూచిస్తున్నారు. https://schooledu.telangana.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ చేసుకోవచ్చని తెలిపారు.

ఇక ఎడిట్ ఆప్షన్(TS TET 2024 Application Edit option) కూడా ఏప్రిల్ 20వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉండనుంది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకున్న వారు… ఏవైనా తప్పులు చేస్తే తిరిగి ఎడిట్ చేసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే వెబ్ సైట్ లో ఆ ఆప్షన్ అందుబాటులోకి రాగా…. ఏప్రిల్ 20వ తేదీతోనే క్లోజ్ కానుంది. ఆ తర్వాత…ఈ ఆప్షన్ కనిపించదు. ఫలితంగా ఏవరైనా తప్పులు చేస్తే వెంటనే ఎడిట్ ఆప్షన్ ద్వారా… వెంటనే సరి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. https://tstet2024.aptonline.in/tstet/ApplicationFilingEdit లింక్ తో ఈ ప్రాసెస్ పూర్తి చేసుకోవచ్చు.

How to Apply TS TET 2024 : తెలంగాణ టెట్ కు ఇలా దరఖాస్తు చేసుకోండి

  • టెట్ రాయాలనుకునే అభ్యర్థులు https://schooledu.telangana.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • ‘Fee Payment’ ఆప్షన్ పై క్లిక్ చేసి ఫీజును చెల్లించాలి. ఈ ప్రక్రియ పూర్తి అయితేనే దరఖాస్తు ప్రక్రియను కంప్లీట్ చేయవచ్చు.
  • హోంపేజీలో కనిపించే ‘Application Submission’ అనే లింక్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ మీ వివరాలను నమోదు చేయాలి.
  • దరఖాస్తు ఫారమ్ లో ఫొటో, సంతకం తప్పనిసరిగా అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.
  • అన్ని వివరాలను ఎంట్రీ చేశాక చివర్లో ఉండే సబ్మిట్ బటన్ పై నొక్కితే అప్లికేషన్ ప్రక్రియ పూర్తి అవుతుంది.
  • 'Print Application' అనే ఆప్షన్ పై నొక్కితే మీ దరఖాస్తు కాపీనీ డౌన్లోడ్ లేదా ప్రింట్ తీసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ నెంబర్ ను జాగ్రత్తగా ఉంచుకోవాలి. హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకునేందుకు ఈ నెంబర్ ఉపయోగపడుతుంది.

TS TET 2024 Application Edit option : ఇలా ఎడిట్ చేసుకోండి…

  • తెలంగాణ టెట్ కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ముందుగా https://schooledu.telangana.gov.in  వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • హోం పేజీలో Edit Application అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేయాలి.
  • ఇక్కడ Journal Number/Payment Reference ID మరియు Date of Birth ను ఎంట్రీ చేసి సబ్మిట్ చేయాలి.
  • మీ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. మీ వివరాలను ఎడిట్ చేసుకోవచ్చు.
  • చివరగా సబ్మిట్ చేస్తే మీ అప్లికేషన్ ఎడిట్ పూర్తి అవుతుంది.
  • ప్రింట్ అప్లికేషన్ పై క్లిక్ చేసి మీ దరఖాస్తు ఫారమ్ ను పొందవచ్చు.
  • ఈ ఎడిట్ ఆప్షన్ తో మీ దరఖాస్తును ఎడిట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ అవకాశం ఒక్కసారి మాత్రమే ఉంటుంది. 
  • ఒక్కసారి ఎడిట్ చేసి సబ్మిట్ చేస్తే… మళ్లీ ఎడిట్ చేసుకునే అవకాశం ఉండదు.

IPL_Entry_Point