TG EAPCET Counselling 2024 : తెలంగాణ ఎంసెట్ ప్రవేశాలు - ఇంజినీరింగ్ తొలి విడత సీట్ల కేటాయింపు, ఇదిగో లింక్..!-ts eapcet 1st phase seat allotment 2024 list at tgeapcet nic in check steps to download ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Eapcet Counselling 2024 : తెలంగాణ ఎంసెట్ ప్రవేశాలు - ఇంజినీరింగ్ తొలి విడత సీట్ల కేటాయింపు, ఇదిగో లింక్..!

TG EAPCET Counselling 2024 : తెలంగాణ ఎంసెట్ ప్రవేశాలు - ఇంజినీరింగ్ తొలి విడత సీట్ల కేటాయింపు, ఇదిగో లింక్..!

Maheshwaram Mahendra Chary HT Telugu
Jul 19, 2024 10:18 PM IST

TG EAPCET Seat Allotment 2024 : తెలంగాణలో ఇంజినీరింగ్ అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఫస్ట్ ఫేజ్ లో వెబ్ ఆప్షన్లు పూర్తి చేసిన వారికి శుక్రవారం సాయంత్రం తర్వాత సీట్లను కేటాయించారు.

తెలంగాణ ఇంజినీరింగ్‌ తొలి విడత సీట్ల కేటాయింపు
తెలంగాణ ఇంజినీరింగ్‌ తొలి విడత సీట్ల కేటాయింపు

TG EAPCET Seat Allotment 2024 : తెలంగాణలో ఇంజినీరింగ్ ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. ఫస్ట్ ఫేజ్ లో భాగంగా ఇప్పటికే ధ్రువపత్రాల పరిశీలనతో పాటు వెబ్ ఆప్షన్లు ఎంచుకున్న వారికి శుక్రవారం(ఇవాళ) సీట్లను కేటాయించారు. విద్యార్థులు పొందే కాలేజీ సీట్ల వివరాలను https://tgeapcet.nic.in/cand_signin.aspx లింక్ పై క్లిక్ చేసి తెలుసుకోవచ్చు.

తొలి విడతలో మొత్తం 75,200 మంది విద్యార్థులకు సీట్లను కేటాయించారు. మిగిలిన సీట్లను ఆ తర్వాత విడుతలో పూర్తి చేయనున్నారు. ఫస్ట్ ఫేజ్ లో సీటు వచ్చిన విద్యార్థులు జులై 23లోగా సంబంధిత కళాశాలల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది.

అలాట్ మెంట్ ఇలా చెక్ చేసుకోండి…

  • ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం వెబ్ ఆప్షన్లు ఎంచుకున్న అభ్యర్థులు https://tgeapcet.nic.in/cand_signin.aspx వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • ఇక్కడ మీ లాగిన్ వివరాలతో పాటు రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టికెట్ తో పాటు పుట్టిన తేదీ వివరాలను ఎంట్రీ చేయాలి.
  • సబ్మిట్ బటన్ పై నొక్కితే మీరు సీటు పొందిన కాలేజీ వివరాలు డిస్ ప్లే అవుతాయి.
  • ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.

జూలై 26 నుంచి సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్….

జులై 26వ తేదీ నుంచి ఇంజినీరింగ్‌ సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ ప్రక్రియ షురూ కానుంది. జులై 27న సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ ఉంటుంది. జులై 27, 28 తేదీల్లో రెండో విడత వెబ్‌ ఆప్షన్లకు అవకాశం కల్పించారు. జులై 31వ తేదీన రెండో విడత సీట్ల కేటాయింపు ఉంటుందని అధికారులు తెలిపారు.

ఆగస్టు 8 నుంచి మూడో విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆగస్టు 9వ తేదీన ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. ఆగస్టు 9, 10 తేదీల్లో వెబ్‌ ఆప్షన్లకు అవకాశం కల్పించారు. ఆగస్టు 13న సీట్ల కేటాయింపు ఉండగా… ఆగస్టు 21 నుంచి కన్వీనర్‌ కోటా ఇంటర్నల్‌ స్లైడింగ్‌కు ఛాన్స్ ఉంటుందని అధికారులు వివరించారు. ఆగస్టు 22 వెబ్‌ ఆప్షన్ల ఫ్రీజింగ్‌ తో పాటు 26వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుంది. ఆగస్టు 27, 28 తేదీల్లో కాలేజీల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఆగస్టు 28న స్పాట్‌ అడ్మిషన్ల గైడ్స్ లైన్స్ విడుదల కానున్నాయి.

ఈసారి తెలంగాణ ఈఏపీసెట్ పరీక్షలో చూస్తే…. అగ్రికల్చర్ , ఫార్మ విబాగాలకు 91633 మంది హాజరయ్యారు. దరఖాస్తు చేసుకున్న వారిలో 91.24 శాతం మంది పరీక్ష రాశారు. కాగా ఇంజనీరింగ్‌ విభాగంలో 2 లక్షల 40వేల 618 మంది పరీక్ష రాశారు. ఈసారి మొత్తం 3 లక్షల 32 వేల 251 మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాశారు.

అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీలో పురుషులు 88.25 శాతం ఉత్తీర్ణత సాధించగా, మహిళలు 90.18 శాతం క్వాలిఫై అయ్యారు. మొత్తం 89.66 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఇక ఇంజనీరింగ్ స్ట్రీమ్ లో అబ్బాయిలు…. 74.38 శాతం క్వాలిఫై అయ్యారు, అలాగే అమ్మాయిలు…. 75.85 శాతం ఉత్తీర్ణత సాధించారు. మొత్తంగా 89.66 శాతం ఉత్తీర్ణత సాధించారు.

How to Check TS EAMCET Results 2024: ఎంసెట్ ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి

  • తెలంగాణ ఎంసెట్( ఈఏపీసెట్) పరీక్ష రాసిన అభ్యర్థులు https://eapcet.tsche.ac.in/ వెబ్ సైట్లోకి వెళ్లాలి.
  • TS EAPCET - Results 2024 లింక్ పై క్లిక్ చేయాలి.
  • మీ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ, రిజిస్ట్రేషన్ నెంబర్ ను నమోదు చేసి సబ్మిట్ పై క్లిక్ చేయాలి.
  • సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయగానే.. మీ ర్యాంక్(స్కోర్) డిస్ ప్లే అవుతుంది.
  • ప్రింట్ లేదా డ్లౌనోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి రిజల్ట్స్ కాపీని పొందవచ్చు.
  • అడ్మిషన్ల ప్రక్రియలో ర్యాంక్ చాలా కీలకం.

Whats_app_banner

సంబంధిత కథనం